Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
జన్మకు మూలమైనదేదో గుర్తిస్తే ,
కృతఙ్ఞత , నీరాజనం పడుతుంది
****
అవసరానికి ఆదుకొన్నవాడిపట్ల కృతఙ్ఞత కలిగిఉండడం ఉత్తమ లక్షణం .. మాట యిచ్చినచోట మరచిపోకుండా నెరవేర్చడం , అప్పుచేసినచోట , తిరిగి చెప్పినమాటప్రకారం యిచ్చుకోడం నిజాయతీపరుడి లక్షణం ..గతితప్పి ప్రవర్తిస్తే , అవే ఋణానుబంధరూపంలో వెంటాడుతాయని శాస్త్రవచనం ..
తల్లి ఋణం , సద్గురువు ఋణం ఎన్నటికి సమసిపోలేనివని అంటారు .
ఒక విత్తనం నాటితే అది వృక్షంగా ఎదిగి , అనేక విత్తనాలందించి
వందల వృక్షాలకు మూలమైనట్లు , మనిషి జన్మకు అమ్మ మూలమైతే ,
సృష్టిఆదిలో ఈ మనిషి జన్మకు విత్తునాటిన మూలపురుషుల మూలమేదొ ఆ వంశవృక్షాన్ని ఎరిగినవాళ్లు భూమినిచుట్టి గాలించినా ఒక్కడైనా ఉంటాడు అంటే సందేహమే ..
మూలం అన్నది లేక జన్మ శాకోపశాకాలుగా విస్తరించే అవకాశమే లేదు .. ఆ అవకాశంలేక ఈ సృష్టికి , విస్తరించిన జీవరాశికి మనుగడేలేదు అన్నది నిస్సందేహమే
ఉన్నంతవరకు పుట్టిపెరిగిన ఊరును గుర్తించగలం ..
జన్మనిచ్చిన తల్లితండ్రులను , వారికి మూలమైన రెండుమూడు తరాలను తెలిసినవారు ఉండొవచ్చేమోకాని , ఆది మూలానికి కారకులెవరో ఊహకు కూడా సాద్యం కాని విషయం
పలాలను ఇచ్చే వృక్షాన్ని నాటినవాడెవరో లొకం గ్రహించలేదు .. కానీ ఆ ఫలితాన్ని మాత్రం లొకంలో అందరూ ఆస్వాదిస్తారు ..
అమ్మను తెలుసు , నాన్నను తెలుసు , ఆ వెనుక ఈ బీజాలకు కారణభూతులెవరో అన్వేషణలొపడ్డా అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపొతుంది ..
ఒక గురువుకు పాదపూజా , అభిషేకాలతో తంతుముగిస్తే లెని ఫలితం , ఆ గురువు అందించిన జ్ఞానబోధను అనుసరిస్తె , అనుసరించరించినవాడు , వాడినివాడు ఉద్ధరించుకోడమేగాక , వాడివలన పరిసరాలవారు ఉద్ధరింపబడవొచ్చు ..
జన్మనిచ్చినవారినీ , జన్మలకు ఆదిమూలమైన వారిపట్ల కృతఙ్ఞతకల్గి , ఆ వంశవృక్షం అందించిన ఆచారాలకు అణుగుణంగా జీవనశైలిని పాటించటం అది పూర్వీకులపట్ల మనిషి నెరవేర్చగలిగిన కృతజ్ఞతాపూర్వక చర్య ..
జన్మనిచ్చినతల్లిని , జ్ఞానాన్ని పంచిన గురువును గుర్తుపెట్టుకుని అనుసరించి , ఆచరించటం కృతజ్ఞతాపూర్వక లక్షణం ..
ప్రతినిత్యం ఉషోదయంలో సృష్ఠికిమూలమైనవాడిని , సృష్టిలో ఆద్యులైనవారిని పూజావిధిలో సంకల్పంచెప్పుకోడం ఒక బాగం ..
ప్రపంచం లౌకికమాయలో పడి మరచిపోయినా , ఏడాదికోసారైనా వారసులకు , లోకానికి గుర్తుచేసే మాహాపర్వదినం ఈ మకరసంక్రాంతి రోజున ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం ..
మనసా , వాచా వారిని స్మరించుకుని , వారి జీవనవిధానంలో మనసును మలుచుకోడమే వారికి
సమర్పించగల నిండునీరాజనం అని పెద్దలమాట …
మకరసంక్రాంతి శుభాకాంక్షలతొ
సర్వం శ్రీగురు , మాతాపితా
పాదార్పణమస్తు
Author : Kota Prakasam Ji
**
Latest Miracles:
- బాబురావు ఔరంగబాద్కర్
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- భిక్షుని రూపంలో అన్న ప్రసాదం స్వీకరించిన బాబా!
- నిజ జీవితంలో బాబా లీలలు
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments