బాబావారి ఆశయాలకు ఎక్కడ గౌరవం,ఆదరణ లభిస్తుందో అక్కడ వారి పరిపూర్ణ అనుగ్రహం వుంటుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

స్పందించే హృదయం ఎక్కడో ఆయన తత్వంకూడా అక్కడ విస్తారమౌతుంది.

****

కాశీక్షేత్రం ప్రసిద్ధికెక్కింది అంటే కారణం , విశ్వేశ్వరుడు విశ్వమంతా నిండివున్నా , ఆ క్షేత్రంలో పూర్వ ఋషులు , సాధకులు దీక్షతో సాధించి ధారపోసిన తపోఫల స్పందనే కారణమంటారు ..

అలాగె శిరిడీ క్షేత్రం కూడా … భగవంతుడు ఎంత గొప్పవాడయినా , అనుసరించి , తరించేవారినిబట్టి ఆ క్షేత్ర పాలకుల విలువ లోకం గ్రహిస్తుంది ..

ఎన్నో శ్రీవారి ఆలయాలు దేశ , విదేశాల్లో నిర్మించుకున్నా , మూలక్షేత్రంలో ఉన్న స్పందన మరేఇతర చోట్ల అనుభవానికి రాదు .

బాబా పాద స్పర్శతో శిరిడీ గ్రామం పునీతమైంది ..

ప్రపంచమంతటా వేలాది మందిరాలు నిర్మించుకుని , మూలస్థానంలో నిర్వహించే నిత్యకార్యక్రమాలు అన్నీ ప్రతి మందిరంలో భక్తి శ్రద్దలతో నిర్వహించుకొంటున్నా , నిత్యము శిరిడీగ్రామం మాత్రం భక్తులతొ కిటకిటలాడుతూనే ఉంటుంది ..

కొన్ని లక్షలాదిమంది గతంలో పండరీపురాన్ని దర్శనం చేసుకొన్నవారున్నా , అందులొ వెలాదిమంది అతీతులైన భక్తులున్నా తుకారాం , సక్కూబాయిలాంటి అరవైనాలుమంది ప్రదాన సాధకులు సిద్ధిపొందారని , ఆ భక్తుల సాధనామార్గాన్ని గ్రంథంలో వివరించబడింది ..

శిరిడీలో ఆయన అడుగుపెట్టిన ఎన్నో సంవత్సరాలకుకానీ , ఆయనెవరో, ఆయనస్థితి ఏమిటో లోకం గుర్తించలేకపొయింది.

ఆయన మహిమలు విని , విప్పారిన కోరికలతో చేరినవారు కొందరయితే , ఆయనను అనుసరించి , జన్మధన్యం చేసుకున్న మహల్సాపతి , కాకాసాహెబుదీక్షిత్ లాంటి ప్రముఖ భక్తులు కొందరు ..

ఒక కుటుంబంలో యజమాని ఎంత సమర్థుడైన , ఆ కుటుంభ సభ్యులుకూడా యాజమానిని అనుసరించక , ఆ ఇంటికి గౌరవం దక్కదు ..

ఒక గురువు ఎంతటి సమర్థుడైనా , ఆశ్రయించిన భక్తులు అనుసరించే తీరునుబట్టి , ఆ గురువువిలువ లోకానికి విస్తరిస్తుంది ..

ఒక మందిరం నిర్మించేందుకు మనిషి ప్రయత్నం చాలు .. ఆ మందిరంలో అడుగుపెట్టగానే స్పందనకు మాత్రం మనిషి మానశిక సాధనతోనే సాధ్యమౌతుందంటారు.

ప్రసిద్ధికెక్కిన ప్రతి క్షేత్రంవెనక ఎందరో సాధకుల ఫలితము కారణమంటారు.

కట్టుకున్న కొన్ని మందిరాలలో స్పందన కూడా అయా భక్తుల సాధన ఫలితమే ..

ఆయన ఆశయాలకు ఎక్కడ గౌరవం, ఆదరణ లభిస్తుందో అక్కడ ఆయన పరిపూర్ణ అనుగ్రహంతోబాటు మానశిక స్పందనకు ఏలోటు ఉండదు.

మందిరాలు ఎన్ని కట్టుకొన్నా , భక్తులు అనుసరించే విధానాన్నిబట్టే ఆ మoదిరం తరతరాలకు ఆదర్శం కాగలదని నా భావన …

ఇదే శతాబ్ది ఉత్సవాలలో అందరూ ఆయనకు సమర్పించగల నిజ గురుదక్షణ …

జయ్ గురు సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles