పట్టెడు కడుపుకోసం పడే తాపత్రయంలో పదోవొంతు సాధనవైపు మొగ్గుచూపితే జన్మ ఫలించినట్లే.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

పట్టెడు కడుపుకోసం పడే తాపత్రయంలో పదోవొంతు సాధనవైపు మొగ్గుచూపితే జన్మ ఫలించినట్లే.

**

రెండు కళ్ళూ, మెదడుకు కిటీకీలులాంటివి అన్నాడో మహాకవి ..కిటికీలోంచి చూస్తే, యింటికి చుట్టూ ఉన్న పరిసరాలను మాత్రమే గమనించగలవు .. గడపదాటి వూరి హద్దులు దాటితే , లోకమేదో గుర్తించగలవు .

మనసు ఎదిగినా , దిగజారినా , చూసిన ప్రతి విషయాన్ని , మెదడుకు అందిన సంకేతాలవలన , స్పందించే మనసునుబట్టి ఆలోచనలు మొదలౌతూ ఉంటాయి ..

మనిషి సంస్కారానికి మూలం , వాడి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది ..

ఆ మార్గానికి మూలం , వింటున్న , చూస్తున్న విషయాలపట్ల కనబరిచే ఆసక్తిని బట్టి ఆధారపడిఉంటుందంటారు ..

కొత్తగా వినిపించే , కనిపించే ప్రతి విషయమూ ఆ క్షణంలో స్పందన కలిగించవొచ్చు ..

ఏది హితమో , ఏది అహితమో , ఆలోచనకు తోడుగా కాస్త ఇంగితజ్ఞానం.

అంటే అవగాహన చోటు చేసుకోక , కలిగే నష్టాలకు మూల్యం చెల్లించకతప్పదు …

జానెడు కడుపుకోసం జన్మంతా కష్టపడకతప్పదు ..

జన్మాన్తర సుఖంకోసం మనసును అదుపుచేసుకొని , సాధనవైపు మొగ్గుచూపకా తప్పదు ..

ఏ శ్రమా లెకుండా ఏవో అద్భుతాలు జరిగిపోవాలి అన్న కోరికలు మొదలయితే , అందుకు తగ్గ చేటుకలిగించు ఆకర్షించే వర్గమే తోడౌతుంది ..

జీవితంపట్ల ఎంత అవగాహనతో అడుగు ముoదుకువేస్తుంటామో , ఆధ్యాత్మిక సాధనలో కూడా క్షణికావేశానికి లోనుకాక , విషయాలపట్ల అవగాహన పెంచుకొంటే , తారసపడే బాధగురువులకు , బోధగురువులకు వ్యత్యాసమేమిటో గ్రహించి,ఆలోచనలు సక్రమార్గంలో సాగిపోతూ , ఆకర్షణలకులోనుకాక , యదార్ధానికి మనసు చేరువై , జన్మఫలాన్ని సాధించుకునే యోగ్యతను పొందగలదని పెద్దలమాట ..

జయ్ జయ్ సాయిరాం
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles