Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
గతాలు గుర్తుకొస్తే నాటి సంఘటనలు కూడా స్మృతిపధంలో కళ్లకుకట్టినట్టుగా అగుపిస్తుంటాయి
*****
అప్పుడప్పుడు అనుకోకుండానే గతస్మృతులు తళుక్కున గుర్తుకొస్తుంటాయి ..
కొన్ని సందర్భాలలో ఆప్తులైనవారితో ముచ్చటించే సమయంలొ మాటలు గతాన్ని గుర్తుచేస్తుంటాయి ..
జారిపోయిన విషయాలు చెప్పాలంటే గంటలు పట్టొచ్చుకానీ , గుర్తుకొచ్చినప్పుడు మనసుకు కొన్ని సెకండ్లవ్యవధిలో కళ్లకుకట్టినట్టి మెదులుతుంటాయి ..
గతం ఎంతటివారిని వొదిలిపెట్టదు ..
గతం సంస్కారవంతమైతే , తలుచుకొన్నప్పుడు అది ఆహ్లాదాన్నిస్తుంది ..
గతం దోషాలతో గడిచివుంటే అదే మనసును నిత్యమూ పట్టిపీడిస్తుంటుంది ..
గతం ఎలా గడిచినా కనీసం వర్తమానంలో అయినా సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తే అది భవిష్యత్తును సరిచేసుకొని మార్గానికి దోహదం చేస్తుంది ..
అనుకొన్న సంకల్పాలు జరిగిపోవాలని , భవిష్యత్ బంగారుమయం కావాలని ప్రతి ఒక్కరి ఆశ ..
నిజానికి జరిగిపోయింది అందరికి గుర్తుండిపోతుందికానీ , భవిష్యత్తు తమ ఇష్టానుసారంగా మలుచుకోగలడం ఎంతటివాడికి సాద్యం కాదు …
భూత , వర్తమాన భవిష్యత్తులంటే అసలు ఊహేతెలియంది అమ్మవొడిలో చిందులేసే పసికూనలు , పుట్టుకతో మతి స్థిమితం లేనివారే కనిపిస్తారు ..
నిజమనసుతో గురువుకు పగ్గాలప్పగించినవాడు , భవిష్యత్తును గూర్చి యోచనలేక , ఏది ఎలా జరుగుతున్నా , ఆ బాద్యతను గురువుకే అప్పగించిన వాడు , నిశ్చలంగా ఉంటాడని ఆర్యులు అనుభవంతో చెప్పినమాట ..
ఎప్పుడో చూసిన సినిమా గుర్తుకొస్తే , మొదటినుండి చివరివరకూ ఆ సినిమాలో సన్నివేశాలన్నీ కళ్లముందు గిర్రున తిరుగుతుంటాయి ..
నిత్యము సద్గ్రంథాలుచదువుతుంటారు ..
ఎవరు నన్నే స్మరిస్తూ , నాపై దృష్టిని నిలిపేదరో వారి వెంట నేనన్నారు సాయి ..
చదువుతున్న చరిత్ర ప్రతిఫలరహితమైనప్పుడు , మనసు యాంత్రికం నుండి బయటపడుతుంది మనసారా ఒక్కసారి సాయీ అన్నా , చరిత్రలో విషయాలన్నీ స్పురిస్తుంటాయి ..
ఆ స్మరణే ప్రతిక్షణం మనిషిని జాగ్రుతంచేస్తుంటుంది ..
ఎక్కడా నైతికంగా దిగజారనీయక అప్రమత్తం చేస్తుంటుంది …
స్మరణ చేయడం , మననం చెయడం అంటే సదా ఆయనను గుర్తించగలినప్పుడు గత పారాయణలో గ్రహించిన ఆయన సద్బోధలు స్మృతి పధంలో మెదలడం అన్న అర్ధంకావొచ్చని నా భావన ..
శ్రీ సాయి గురుభ్యోనమః
****
Latest Miracles:
- బాబా ఆశీర్వదించి దృష్టిని ప్రసాదించారు
- పిల్లి దృష్టిని పునర్దుద్దరించిన విభూతి—Audio
- మరో డైరీ …..సాయి@366 జూలై 19…Audio
- అమ్మా నీవు నాపై దృష్టి పెట్టు, నేనును అట్లే నీపై దృష్టిపెట్టెదను. నీవు మేలు పొందెదవు–Audio
- బాబా యొక్క అనంత కోటి అనుగ్రహ కిరణాల్లో ఒక కిరణం నాపై ప్రసరింప చేసినట్లున్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments