బాబావారి సద్బోధలను పదిలంగా మనసున ఆవిష్కరించుకోని ఎవరిని వారు సంస్కరించుకొనే గట్టి సంకల్పాలకు బాబా వద్ద నెరవేరనిదంటూ ఏమిఉండదు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

సంకల్పాలు ఎలాఉంటాయో బ్రతుకులూ అలాగడిచిపోతూంటాయి.
****

బాగ రుచిగా ఉంది అనుకొనే ఏ పదార్ధమైనా అవి శరీరాన్ని బాధపెట్టేవే అన్నాడో వైద్యుడు ..

బంగాళాదుంపలకు , ఉల్లిముక్కలు దట్టించి మరీ వేపుడుచేసుకొని తింటె అబ్బా ఆ రుచి , మరే పధార్ధంతోనూ సాటిరాదు ..

తిన్నప్పుడు ఎంత ఆనoదాన్ని ఇస్తుందో , జీర్ణమై వొంటికిపట్టినతర్వాత , దాని ప్రభావంతో బాధపడేవాళ్లనుకూడా అంతమందిని చూస్తూంటాం ..

అయినా నాలిక దానికోసమే పాకులాడుతూ ఉంటుందేతప్ప కాకరలాంటి పధార్ధాలను వొడ్డిస్తే మూతి మూడువొంకర్లుపోతూంటుంది.

వేసవికాలంలో సపోటాలు తింటే అది అన్ని విధాలా మేలుచేస్తుంది , అయినా అన్ని వికారాలనుకలిగించే మామిడి పండ్లకోసమే ఎక్కువశాతం.. ఎగబడుతుంటారు ..

వైద్యుడు పత్యం చెప్పి , ఏది వొద్దంటాడో మనసు దానికోసమె పాకులాడుతూవుండడం లోకసహాజం.

ఒక దేవుడిని దర్శించిన , ఒక గురువును ఆశ్రయించినా , సంకల్పాలు ఎలా ఉంటాయో ప్రతిఫలంకూడా అలానె నెరవేరుతుంటాయి ..

గురువును ఆశ్రయించి , తలచిందే జరగాలని ఎంత ప్రాధేయపడినా , నీకేది హితావో అదే నెరవేరుస్తాడని కొందరంటారు ..

ఇలాంటి సందర్భాలకు కూడా బాబాసచ్చరిత్రలోనే సమాధానం లభిస్తుంది ..

కాలుకుంటితనం పోవాలనే ఆశయం , బాబాను దర్శించుకొన్న మరుక్షణం , తన మసుకుపట్టిన కుంటితనాన్ని సరిచేయమని గట్టి సంకల్పంచేసుకొన్న దీక్షిత్ , ఆయన శిక్షణలో చివరకి మోక్షార్హను సాధించుకొన్నాడని చరిత్రలో చూస్తున్నాం ..

సాధువులు , భిక్షగాళ్ళేకాక , లౌకికమైన సంకల్పాలతో ఆయనని చేరి నెరవేర్చుకొని , నాటకంలో పాత్రల్లా మెరిసి మాయమైపోయినవారుకూడా ఎందరో చరిత్రలో పరిచయమౌతారు .

కడలో తోడురాని , ఆర్జించిన దనాన్ని , విలువైన బంగారాన్ని బీరువాలో బద్రంగా , అతి జాగ్రత్తగా దాచుకొన్నట్టు , చివరితోడులో తన చేయినందించే హితవైన ఆయన సద్బోధలు పదిలంగా మనసున ఆవిష్కరించుకొని , దృష్టి ఆయనపై నిలిపి , ఎవరిని వారు సంస్కరించుకొనే గట్టి సంకల్పాలకు ఆయన వద్ద నెరవేరనిదంటూ ఏముంటుంది అని నా భావన. .

శ్రీ సాయి పాదార్పణమస్తు
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles