ఆచరణఎరిగినవారికి అద్భుతరీతిలో అనుభవాలను ప్రసాదిస్తూనేఉన్నారు బాబావారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

నీలో ఉన్న నేనె నీ చివరతోడు
/
ఆత్మజ్ఞానం /
***

ఎవరు నేను , ఏది నాది అన్న ఆలోచన మనసు అంతర్ముఖం కానిదే సాద్యంకాదు అని అనుభవజ్ఞులమాట …

సంసారంలో తామరాకుమీద నీటిబొట్టులా బాద్యతను నిర్వహించేవాడీ మనసుకు ఏ బందాలు , ఏ సుఖదుక్కాలు దరిచేరవు అంటారు ..

బాహ్యమైన విషయాలపట్ల దృష్టిని సారించినంత వరకూ , మనసు బ్లాటింగ్ పేపర్లా ప్రతి విషయానికి ప్రాధాన్యతను ఇస్తుంటుంది ..

యేతీర్ధానికి వెళ్లినా ఏమహాత్ములను ఆశ్రయించినా , బాహ్యమైన విషయాలపట్ల ఆసక్తిని వెల్లడిస్తూ , ఆ ఆశయాలు నెరవేరాలని మనసు ఆరాటపడుతూంటుంది ..

మనుసులో ఇదా , ఆదా అన్న అంతర్గత పోరాటాలు సమసిపోనంతవరకు గోడమీదపిల్లిలా , సందర్భాన్నిబట్టి సమయోచితంగా ప్రవర్తిస్తూ ఉంటుందితప్ప , నిలకడగా ఒక ధ్యేయానికి సిద్ధంకాదు …

” ఈ బ్రాహ్మణ మశీదులో కూర్చుని ,ఈ సద్బ్రాహ్మణుడెన్నఁడు అసత్యం పలకడు ” అన్నారు సాయి ..

నమ్మినవారిని వమ్ము చేయనని కొన్ని సందర్భాలలో ఆయన చేసిన వాగ్దానాలుకూడా ఏకాదశ సూత్రాల రూపంలో తననాశ్రయించిన భక్తాదులకు ఏలోటూ ఉండదని చెప్పడమేకాక , ఆచరణఎరిగినవారికి అద్భుతరీతిలో అనుభవాలను ప్రసాదిస్తూనేఉన్నారు మహసమాది అనంతరంకూడా ….

మనిషి ఆలోచనా సరళినిబట్టే , ఎవరి గతులు అందుకు తగ్గట్టుగా నెరవేరుతుంటాయంటారు ..

ఒక ఆలోచన బౌతిక ఆలోచనచుట్టూ పరిభ్రమిస్తుంటుంది ..

మరి కొందరి ఆలొచన జన్మతరించె ఉపాయంకోసం పరితపిస్తుంటుంది …

ఎందరో ఒక సద్గురువును ఆశ్రయిస్తూఉంటారు ..

ఎవరి మనసు గురుబోధలకు ప్రభావితమై , అవగాహన ప్రారంభమౌతుందో , సంసంసారంలోఉన్నా , జన్మ ఆవస్యకథనెఱిగి , నేనునేను అంటున్న తన నిజపాత్రను మనసు గుర్తించగలదని పెద్దలమాట ..

శ్రీ గురుబ్యోనమః
. **

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles