Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
“సర్వేజనా సుఖినోభవంతు “..
ఇచ్చిపుచ్చుకోడంలొ నిజాయతీ సన్నగిల్లితే , సగటు మనిషేకాదు , సద్గురువు చెంతకూడా నమ్మకాన్ని చూరగొనడం దుర్లభమే…
***
సర్వేజనా సుఖినోభవంతు అని వినిపించగానే , ఎప్పుడొ 55 సంవత్సరాల క్రిందటి నా చిన్నతనంలో గత సంఘటన గుర్తుకొచ్చింది ..
ఉదయాన్నే నిద్రలేచి గట్టిగా కళ్లు నులుముకోకమునుపే పక్కింటివాళ్ళో , ఎదురింటి వాళ్ళో ఏదో కొంపమునిగిపోయినట్టు తలుపు తట్టేవారు ..
తీరా చూస్తె చేతిలో ఒక లోటా పట్టుకొని , దానినిండా పంచదారకో , కాఫీపొడికొ బదులివ్వమని అడిగేవారు ..
ఒక రోజు లేదా రెండురోజులు అది మర్యాదగా , గౌరవంగా ఉండేది ..
ముందు చేబదులుగా తీసికెళ్ళినవి తిరిగి ఇవ్వకపోతె , ఆబ్బె మాయింట్లోకూడా అడుగంటాయని , ఉన్నా , యివ్వడానికి మనస్కరించక , పాచినోటితోనే అబద్దం చెప్పి , తప్పించుకొనేవారు ..
” సర్వేజనా సుఖినోభవంతు “ అన్నపదం మొదటిసారిగా రేడియోలో విన్నాను , అదేదో అర్ధంకాని భాషగా అనిపించి , మా నాన్నగారిని అడిగాను దానికాయన ఇలా చెప్పారు ” లోకమంతా సుభిక్షంగా ఉండాలని కొరుకోడం ” ..
అలా అందరూ ఉండగలిగితే ఎవరినీ , ఎవరుకూడా చేయిచాచి ఆధారపడే అవసరం రాదుకదా అన్నాడు ..
అయినా అప్పట్లో పెద్దగా అవగాహనకు రాలేదు .. కాస్త అవహగాహన మొదలైన తర్వాత , లోకంతీరును బట్టి ఆ పదానికి అర్థం ఇలా ఉండొచ్చు అనిపించింది ..
కొందరిని చూస్తె పెట్టబుద్దేస్తుంటుంది , కొందరిని చూస్తె మొత్తబుద్ధేస్తుంటుంది .
కొందరు అతివిచారంగా మొహంపెట్టి , ప్రాణాలమీదికి వొచ్చిందంటూ చేబదులుకు అంటే అప్పు అభ్యర్ధించడానికి ఒచ్చి , బతిమలాడి బామాలి కాళ్ళావేళ్ళాపడుతుంటారు అయ్యో అనిపించి ఆదుకొంటే , ఆ తర్వాత వాళ్లు మళ్లీ వెతికినా కనిపించరు సరికదా , పొరపాటున దూరమునుండి యిచ్చినవాడిన గమనిస్తె , పుచ్చుకొన్నవాడు మొహం చాటేస్తుంటాడు , అంతవరకూ ఉన్న పరిచయాలు దెబ్బతిని ,లేని శత్రుత్వానికి దారితీస్తుంటాయి ఇలాంటి లావాదేవీలవలన ..
కొందరిమీద అతి విశ్వాసంతో ఆధారపడి , జీవితంలో కొలుకోలేని అయోమయ పరిస్తితి దాపురిస్తుంటుంది ..
కొందరి పరిచయాలు ఎంతో విశ్వాసంతో ముందుకు నడిపిస్తూ , అందని స్థాయిలో నిలబెడుతుంటాయి ..
ప్రకృతిమీద మనిషి , మనిషిమీద ప్రకృతి పరస్పరం ఆధారపడివున్నాయి ..
ప్రకృతికి మనిషిలా భేషజాలు అన్నవే తెలియవుకనుక దానిధర్మాన్ని అది గతి తప్పకుండా నిర్వహిస్తోంది ..
ప్రకృతినుండి , మనిషి ఎంత పొందేప్రయత్నం చేస్తున్నాడో , అంత ప్రకృతిని కాపాడుకొనే ప్రయత్నంచేస్తే పరస్పరం సృష్టి ధర్మానికి విఘాతమన్నది ఎన్నడూ తలెత్తదు ..
కళ్లనీళ్లపర్యంతమౌతూ , ఎంతో వినయంగా మాటలుచెప్పి అవసరాలు తీర్చుకొన్నవాడు , తిరిగి తీర్చేప్రయత్నం చేయకపోతే అది వీధిపోరాటాలకు దారితీసి , ఆజన్మ విరోధాన్ని సృష్టిస్తుంది ..
ఇచ్చి,పుచ్చుకోడంలో , నిజాయితీకి మద్య విశ్వాసం వారధిలాంటిది ..
సమర్థుడైన సద్గురువు కూడా తన ఖాజానాను కొల్లగొట్టి , తీసికెళ్లేందుకు యోగ్యులైనవారు ఎవరొస్తారా అని ఎదుచూస్తూంటారట …
ఇచ్చేవాడొకడున్నాడని , పదేపదే అది భౌతికపరమైన కోరికలకే పరిమితమయితే , జన్మకూ , జన్మకూ మద్య ఋణానుబంధమనే వారధికే విఘాతం తప్పదని పెద్దలమాట ..
జయ్ సాయి గురు సమర్థ
***
Latest Miracles:
- సర్వే జనా సుఖినోభవంతు! …. మహనీయులు – 2020… మార్చి 18
- భక్తురాలి అన్న సంతర్పణకు బాబా వారు వచ్చుట–Audio
- విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు–Audio
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments