Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
బ్రమలోనుండి బయటపడక ఆరాటపడే మనసుకు నిలకడ కుదరటం కష్టమే
**
డబ్బుకోసం , కీర్తికోసం ఆరాటం శృతిమించితే , ప్రతి నిమిషం వాటికోసమే మనసు తీవ్రంగా కక్కుర్తిపడుతూనే ఉంటుంది ..
అంతా రామమయం అన్నాడు భక్తిపారవశ్యంతో అప్పటి భక్తరామదాసు ..
ఇప్పుడు జగమే ధనమయమైపోయింది ..
ఎప్పుడు ఎలాటి అవసరాలు ముంచుకొస్తాయో అని కలిగినదానిలో కాస్త ముందు జాగ్రత్తలు తీసుకునే మనిషి , ఏ సమయానికి ఎవరికి మూడుతుందో అర్ధమౌతున్నా , మోక్షాన్నీ సాధించుకునే కఠిన సాధనలు నేర్చకపోయినా , కనీసం మళ్లీ జన్మకు మనిషిగా పుట్టే యోగ్యతని సాధించుకునే విషయంలో కూడా బలహీనుడైపోతున్నాడు ..
అంతా కల్తీమయమైపోతోంది ,గద్దె ఎక్కే ప్రయత్నంలో , ప్రతి రాజకీయుడి నోటా నెరవేర్చలేని , నోరూరించే కల్తీమాటలు …
అవసరాల విషయంలో అతి వినయాన్ని ప్రదర్శించే కొందరి వ్యక్తుల మాటల్లో కల్తీ , ఆలయాలచుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా , మనసునిండా మసురుకొన్న ఆలోచనల్లో కల్తీ , చివరకి సద్గ్రంధాలలో కూడా తెలియపరచిన కఠిన నియామాలను కూడా ఆకర్షించే భాగంలో , మూలానికి భంగం కలిగించే కల్తీలు ..
సద్గురుబోధలు విన్నా , సద్గ్రంథాలు పఠించినా జన్మ ఆవశ్యకతను తెలియజేయబడే జ్ఞానం అబ్బుతుంది ..
తెలియచేయబడిన విషయాలను ఎవరికివారు తమ నడతలో అన్వయించుకోక , అందించబడిన గ్రంథసారాల,సద్గురువు ఆశించిన ఫలితం నెరవేరదు …
మనిషి జీవితం ప్రకృతితో , ప్రకృతి ఉనికి మనిషితో ఒకటికొకటి ముడివేసుకోబడి ఉన్నాయంటుంది వేదం …
ప్రకృతిని గమనించు , అదే పాఠాలు నేర్పుతుంది అని దత్తులవారి మాట …
ఆయన మాట అనుభవానికి తెచ్చుకొంటే , ఆ అనుభూతి మనోకల్మషనివారణకు దోహదచేసి , చావు పుట్టుకల మద్య మనిషి తన పాత్ర యెంతవరకో గుర్తించగలడని పెద్దలమాట …
జయ్ గురుదేవ సాయి సమర్థ
****
Latest Miracles:
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
- భిక్షుని రూపంలో అన్న ప్రసాదం స్వీకరించిన బాబా!
- ఒకసారి శరణు వేడిన చాలును!…..సాయి@366 మే 6….Audio
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments