Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
కృష్ణరాయబారంలా ప్రతి గ్రంథమూ హితవునందించేవే , ప్రేరణతో స్పందించి , జన్మ రణక్షేత్రాన్ని గెలిచే ప్రయత్నం మాత్రం మనిషి ఒంతే
*******
కుటుంబాల పరువు వీధి పాలుకాకుండా , అన్నదమ్ముల హితాన్ని కోరుతూ , రాయబారం చేసి ఎన్నో హితవాక్యాలను పలికాడు శ్రీకృష్ణుడు ..
అంతా విని భీష్మాధులు కూడా ఆ రాయభారాన్ని పూర్తిగా సమర్ధించారు , ధృతరాష్టుడికి అంత రాజ్యానుభవం ఉన్నా , పుత్రవ్యామోహం అడ్డొచ్చి , ఎటూ తేల్చుకోలేక ఉభయమధ్యస్థంగా ఉన్నాడు , పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్టు , దుర్యోధనాదులు ఏమాత్రం మంకుపట్టు వీడక , రాజ్యభోగాన్ని , చివరకి ప్రాణాలనే పణంగాపెట్టి మూర్ఖులై అసువులు కోల్పాయారు …
మల్లెపూవు ఆడవారి సిగలో చేరినా , దేవుడి పాదాల వాలినా తన పరిమలాన్ని ఒకేలా గుభాళింపచేయడం దానికున్న దర్మం .
పుట్టనుండి గుట్టకుమారినా , మంచునుండి మానుకు మారినా ఎక్కడికక్కడ రంగులు మార్చడం ఊసరవల్లికి అబ్భిన దర్మం …
మానవులందరూ ఒకటే అయినా మానవత్వాలు ఒకలా ప్రతిబింబించవు , ఇదే రాయబార సన్నివేశంలోకూడా వ్యక్తమౌతోంది .
బుద్ది ప్రేరేపిస్తూ ఉంటుంది , మనసు అన్నీ వింటున్నట్టే ఉంటుంది , అంతలోనే పరిస్థులకనుగుణంగా పెడదోవ పడుతుంటుంది ..
ఎక్కడైనా ఒక మంచివక్త ప్రవచనం చెపుతూంటే చెవుల రిక్కరించిమరీ ఎంతో శ్రద్దగా వింటూంటారు , విని ఇంటికెళ్లి ఆత్మావలోకనం చేసుకునే ,గుణదోషాలను సంస్కరించుకొనే ప్రయత్నంలో పాండవులంతటి సంస్కారులు ఉంటారు , విన్నా బుర్రకుపట్టించుకోక వెనకటి గుణాలను కనీసం మార్చుకొనే ప్రయత్నం చేయని కౌరవసంతతిలాంటివారూ ఉంటారు ..
మనసును భవనంతో పోలుస్తారు.భ అంటే భక్తికి సంకేతం , వనం అంటే అడవి ..
అడవి అంటే క్రూర మృగాలతో కూడింది ….భక్తి , జ్ఞానం కుదిరేంతవరకు మంచీ , చెడుల విచక్షణలేని మనసు , అజ్ఞానంతో పొల్లుతూంటుంది ..
ఒక సద్గురువు అనుగ్రహం వలనకానీ , ఒక సద్గ్రంథ పారాయణ ప్రేరణవలన మనసు కృష్ణరాయభారంలా హితాన్ని ప్రేరేపిస్తుంది ..
చిత్తభ్రమలకు అలవాటుపడిన మనసు ఉత్తమ స్థాయికి ఎదిగే ప్రయత్నములో అటా యిటా అన్న కొంత మానసిక సంధిక్తతను ఎదుర్కొనకతప్పదు …
రధసారధ్యం వహించిన పరమాత్ముడు విడువక తోడు నిలిచినా , ధర్మానికి అరణ్యవాసం , అజ్ఞాతవాసాలు అనుభవించాక , పాండవులకు రాజ్యాధికారం సంభవించింది ..
భగవద్గీత అయినా , బాబా చరిత్ర అయినా మనసుకు హితవునేర్పే కృష్ణ రాయభారంలాంటివే ..ఎవరి స్పందన ఎలా ఉంటుందో అట్టి ఫలితాలే సంప్రాప్తించగలవని పెద్దలమాట ..
జయ్ జయ్ సాయి గురు సమర్థ
*******
Latest Miracles:
- ఆత్మహత్య చేసుకుందామనుకున్న మామయ్య మనసు మార్చి, మా కుటుంబ ఇలవేల్పు అయినా బాబా వారు.
- ” మీ అమ్మాయికి అబ్బాయి పుట్టే అవకాశం లేదు, అయినా గాని నా శరీరంలో సగ భాగం కత్తిరించి, ఈమెకు కొడుకు పుట్టే విధంగా నేను చేస్తాను అని ” బాబా మాటిచ్చారు.
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- ” ఊదీ ” మహిమతో ఎంతటి నొప్పి అయినా మటుమాయం …………………!
- బాబా నాతో భగవద్గీత చదివించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments