“భారం నాపై పడవేయుడు , చివరికంటా గమ్యం చేరుస్తాను ” అన్నారు బాబావారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి   బాబా           …           సాయి   బాబా           …           సాయి   బాబా           …           సాయి   బాబా

Author:Kota Prakasam Garu

చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిర్ణయాన్ని భగవంతుడికి అప్పచెబితే మనసెప్పుడూ నిశ్చలంగా ఉండగలదు.

********

తండ్రి ఆబ్దికాన్ని ముగించుకొని , భోజనానంతరం తాంబూలం సేవిస్తూ , ముందుగానే కుటుంబసభ్యులందరికీ చెప్పిమరీ శరీరం చాలించాడు మహల్సాపతి ..

ఇటీవలి కాలంలో కూడా .బాగ పరిచయమున్న యిద్దరు , ముగ్గురు పెద్దవాళ్లు , ముందుగానే తమ చావును గురించి ప్రస్తావిస్తే , వయసుతో చాదస్తపు మాటలేమో అనిపించింది .. కానీ తర్వాత వాళ్లు చెప్పిన రోజునే , ఆ ఘడియల ప్రకారమే శరీరం చాలించడం ఓ విశేషం…

జారిపోయిన తమ గతాన్ని సర్వసామాన్యుడు కూడాగుర్తుపెట్టుకొని మరీ వెల్లడించగలడుకానీ , భవిష్యత్తు ఇలా ఉంటుందని వూహించగలగడం ఎవరికీ సాద్యంకాదు , కోట్లమందిలోవేళ్లమీద లెక్కించగల ఏ అతికొద్దిమందికో తప్ప ..

రామజననానికి ముందే రామాయణం లిఖించబడింది ..

రచించిన వాల్మీకి గతం అతి కిరాతకుడిగా పేరున్నవాడు ..

రామ జననానికి ముందే, రామశబ్ధం ఉపదేశించబడింది ..

మాములుగా వ్యవహరించే మనిషికన్నా మూర్ఖుడికి పట్టుదల ఎక్కువట ..

ఆ పట్టుదలే ఆయన స్మరణకు , జ్ఞానానికి దారితీసి రామునికన్నా ముందే రామకథాసారాన్ని రచించాడు , ఆ ఇతివృత్తం ఎలా సాగిందో , అక్షరం పొల్లుపోకుండా రామావతారం కూడా అలానే గడిచిపోయింది.

గతం కొందరికి దుర్భర దరిద్రంతోనో , ఎదో కొలుకోలేని సమస్యలతోనో గడిచిపోయివుండొచ్చు.కొందరికి కీర్తి ప్రతిష్టలు , అతి విలాసాలను అందించి ఉండొచ్చు ..

ఎవరి జీవితాలు ఎప్పటికి ఒకలా ఉండవు ..

బండ్లు ఓడలౌతుంటాయి .ఓడలు బండ్లవుతుంటాయి ..

గతం కొందరికి శాపంగా , కొందరి జన్మ సుకృతంగా గడిచిపోయి ఉండొచ్చు , భవిష్యత్తు ఎవరి ఊహకు అందనిది ..

భవిష్యత్తుమీద ఆశలేకపోతే ఒక సామాన్యుడికి జీవితమేలేదు ..అది హద్దులుమీరితే , కొన్ని సందర్భాలలో ఊహలు తలకిందులై అంధకారాన్ని అందించవొచ్చు ..

భగవధావతారాలు ,మహాత్ముల ఆగమనాలు , అవతార సమాప్తులౌతున్నా , వారాధేసించిన ధర్మ ప్రబోధాలు మాత్రం చెక్కుచెదరక గ్రంధాలరూపంలో అందించబడుతూనే ఉన్నాయి ..

ఒక రామాయణం కావొచ్చు , బాబా సచ్చరిత్రకావొచ్చు , శ్రద్దగా పట్టుకొంటే, పలికేది వారందించిన ధర్మసూక్షాలే ..

మనసు తీవ్రంగా గ్రంథావిషయాలపట్ల ఆసక్తిని చూపితే , అక్షరాలకన్నా , అందులో ఆవిష్కరింపబడిన రూపాలే కంటిముందు కదలాడగలవు ..

పాత్రలో వొదిగడం మొదలయితే అదే తానుగా మారిపోగలదని అనుభవంతో కూడిన మాట ..

అంతటి పాండవులకే భవిష్యత్తు ఊహకంది ఉంటె అసలు కురుక్షేత్ర సంగ్రామానికి తావుండేది కాదేమో ..

నిర్ణయించుకొనేది మనిషే , ఆ నిర్ణయాలు ప్రతిబంధకాలైతే విచారంతో కుమిలిపోయేది మనిషే ..

“బారం నాపై పడవేయుడు , చివరికంటా గమ్యం చేరుస్తాను ” అన్నారు బాబా ..

భవిష్యత్తుకు నిచ్చెనలు వేయక , కర్తవ్యంలో తమ వొంతు ధర్మాన్ని ఆచరిస్తూ , ఏది జరుగుతున్న అది ఆయన నిర్ణయానికే కట్టుబడిన మనసు సదా నిశ్చల స్థితిని అనుభవించగలదని పెద్దలమాట …

జయ్ గురు సాయి సమర్థ
******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles