సాయి కలలో చెప్పి మరీ  పిలుచుకున్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి రామ్ ,

నా పేరు లక్ష్మి ప్రసన్న, హైదరాబాద్.

సాయినాథా స్వప్నం అని వినగానే కుశాల్ చంద్ గుర్తువస్తారు. ఎందుకు అంటే బాబా కలలో కనిపించి మరీ చూడాలని ఉంది అని పిలుస్తారు.

బాబా ప్రేమ ఎనలేనిది. అటువంటి ప్రేమ ఒక భక్తురాలి మీద చూపించిన విదానం, నిజంగా నేను ధన్యురాలిని.

ఒక రోజు రాత్రి కల, ఆ కలలో ఒక ఆమే బాగా ఏడుస్తున్నారు ఎందుకూ అంటే షిర్డీ వెళ్ళాలి నేను పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకూ కూడా నేను వెళ్ళలేదు.బాబాని చూడాలి, అక్కడ ఆయన బట్టలు, ఆయన వాడిన వస్తువులు, ఉంటాయి. నాకు ఇంకా పిలుపు లేదు అని ఏడుస్తున్నారు.

నేను చెప్పాను లేదు అమ్మా మీరు ఏడవకండి ఇంతగా బాధ పడవద్దు. బాబా పిలుస్తారు నేను మిమ్మల్ని షిర్డీ తీసుకువెళ్తాను అని కలలో మాట ఇచ్ఛా.

నా స్వబావం ఎవరు బాధగా ఉన్నా వెళ్లి పలకరించి మాట్లాడడం నా అలవాటు నాకు తెలిసి ఎవరూ బాధగా ఉండవద్దు అని అనుకుంటా.

తెల్లారింది మా ఇంట్లో బాబాకి బెడ్ వేసి పడుకోపెడతాను కదా. నేను లేవగానే మొదట ఆయనను లేపుతాను.

రోజు అలవాటుగా వెళ్ళాను. ఆరోజు బాబా నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించి  ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నా ఒక్కసారిగా కల గుర్తువచ్చింది.

అంతా బానే ఉంది కాని బానే బాద్యతలు అంట గడతావు కాని ఆమె ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు బలే ఇరకాటంలో పెడతావు తాత నువ్వు.

మీరే ఆమెను బయటకు తీసుకురండి, నేను తీసుకువస్తా ఈవిదంగా మల్లి నీ దగ్గరకు నేను ఇంకోసారి రావచ్చు.

ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. నాకు ఎప్పుడు వేలదామా అని  ఉంటుంది  ఎదురుచూస్తూ ఉంటా.

కాని బాబా మిమ్ము చూడడానికి ఎంతగా తపిస్తున్నదో ఏమో త్వరగా చెప్పు ఆమె ఎవరో అని అడుగుతూ ఉన్నా.

ఒకరోజు తరువాత మా ఇంటికి ఒక అతను వచ్చారు మా ఇంట్లో ఉన్న బాబా ఫోటోలను చూసి మీరు బాబా భక్తులా, మా అక్కకి  చాలా రోజుల నుండి షిర్డి వెళ్ళాలని కోరిక పుట్టిన ఇంట్లో ఎలాగు ఆకోరిక తీరలేదు అత్తగారి ఇంట్లో అసలే తీరదు అని తేలిపోయింది.

వాళ్ళు ఇల్లు కదలరూ, ఎక్కడకి వెళ్ళరు. పాపం మా అక్క కోరిక బాబానే తీర్చాలి. ఇది అంతా వింటూ నేను తాత వైపు చూస్తున్నా.

ఇక నేను వాళ్ళ phone నెంబర్ తీసుకొని మేము షిర్డి వెళ్తున్నాము మీరు మాతో వస్తారా? అని అడిగాను .

మా ఇంట్లో ఏమి అంటారో ఏమో బయంగా ఉంది అని చెప్పి phone పెట్టేసారు.

మన తాత గారు ఏమి చమత్కారం చేసారో ఏమో కాని తరువాత రోజు కాల్ చేసి మేము అంతా షిర్డీ వస్తాము మొత్తము ఎనిమిది మంది వస్తాము అనిచెప్పారు.

చివరకు అంతా కలసి ఒక పదిహేనూ రోజుల్లోనే షిరిడి వెళ్ళాము. వాళ్ళ ఫ్యామిలి అంతా రూమ్ లో సీరియల్స్ లో నిమగ్నమయ్యారు. పాపం నాకు ఇది అంతా చాలా నవ్వించే విషయం.

నేను తనని షిర్డీ అంతా, ఇంకా అందరి  ఇల్లు, చూపించాను. తనకి బాబా ఊది ఇచ్చారు, వేపాకులు ఇచ్చారు. అందరూ వెదుక్కుంటారు కానే ఆమె వెళ్ళగానే తన మీద నాలుగు ఆకులు వేసారు బాబా. దానితో ఆమె ఆనందం చెప్పలేక చివరకు ఏడుస్తూ కూర్చున్నారు.

అది ఏడుపు అనేకంటే కూడా ఆనందం అంటే ఇంకా బాగుంటుంది. బాబా ప్రేమ ఆమె తపన రెండిటి మద్యలో నన్ను వాడారు తాత.

ఇక్కడ నా అదృష్టం, నాకు బాబా దర్శనం అయ్యింది కదా. ఇక్కడ బాబా మనసు చూస్తారు. పూజలతో పనిలేదు. స్వార్ధం లేకుండా ఉంటే ఆయన మన మనసులో ఎప్పుడు కొలువుతీరి ఉంటారు అనడానికి ఈ కధ నిదర్శనం.

ఎక్కడో బాద పడుతున్న ఆమెను బలే పిలుచుకున్నారు బాబా.

మీ ప్రేమకి ఈ జన్మ మీకు నచ్చేలా మలుచుకొని ఈ మనసు అనే పుష్పాన్ని మీ పాదాల వద్ద ఉండే అర్హత ఇవ్వమని మీ పాదాల వద్ద వినమ్రంగా వేడుకుంటున్నా బాబా.

ప్రేమతో మీ మనవరాలు.

సాయి నాథ్ మహారాజ్ కి జై.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles