లాలా లక్ష్మీచంద్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

అతడు మొట్టమొదట రైల్వేలోను, అటుతరువాత బొంబాయిలోని శ్రీవేంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రుజులో, క్రిస్టమస్ పండుగకు ఒకటిరెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ళ తరువాత దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ యింటికివెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను. పటము, దాసుగణు కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసుగణు చెప్పుచున్న హరికథ) ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్లూరుచుండెను. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మికకృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల యనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని యడిగెను. అతని యానందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన యేర్పాటులన్నియును జేసికొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును, అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణీకుల నడిగిరి. చాల సంవత్సరములనుంచి షిరిడీలో నున్నసాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే బాబాకొరకు జామపండ్లను కొనవలె ననుకొనెను. కాని, యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యావిషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికాసంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్లగంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను. బండి నాపి కొన్నియెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామపండ్లను కొనవలె ననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపయి జండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచితవిధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాల సంతసించెను. సువాసనగల తామరపువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా యిట్లనెను. “టక్కరి వాడు; దారిలో భజన చేసెను. ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేల? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మార్వడివద్ద 15రూపాయలు అప్పుతీసికొని దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక యిప్పుడయిన నెరవేరినదా?”

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు అనగా పండుగదినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా యభిప్రాయము.

సాంజా

మధ్యాహ్నభోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను. కాని, యెవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను. మూడవరోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్ యేమి నైవేద్యము తీసికొని రావలెనని బాబాను అడిగెను. సాంజాతీసికొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు రెండు కుండల నిండ సాంజాతెచ్చిరి. లక్ష్మీచందు చాల యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా యిట్లనెను. “నీవు ఆకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదయిన ఔషధము తీసికొనుము.” బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్వపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు!

దోష దృష్టి

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా, బాబా శ్యామాతో నిట్లనియె. “ఎవరిదో దోషదృష్టి నాపయి పడుటచే నేను బాధపడుచున్నాను.” లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది యంతయు బాబా వెల్లడి చేయుచుండెను.

ఈ విధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపైబడి “మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడు నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప యితరదైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి జెందునుగాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచబాధలనుండి కాపాడుదురు గాక!” యని ప్రార్థించెను.

బాబా యాశీర్వాదమును, ఊదీప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles