బురహాన్ పూరు మహిళ (బాబా స్వప్నములో కిచిడీ కోరుట)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

 ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము. బురహాన్ పురూలో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు ‘కిచిడీ’ కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారమువద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాల సంతసించి ఆమె యందరికి తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీతీర్థమును దర్శించి షిరిడీ చేరి, అచట రెండుమాసము లుండిరి. ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను దర్శించి, పుజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజులవరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు కూర్చొనిరి. కనుక తెర వేసి యుండెను. తెరవేసి యుండునపుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమెనిలువలేక పోయెను. ఒకచేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీకొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను. ఆమె కిచిడీ యచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీదముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా యీ యాతురతను జూచియందరు ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles