ఉదీ మహిమతో సాయి పాదదాసుడగుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: జనార్దన్

నివాసం: హైదరాబాద్

“సచ్చిదానంద స్వరూపుడు జగత్తును పుట్టించి, పోషించి, లయింప చేసేవాడు. భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమిచ్చు సదాశివుడు, సద్గురువు అయిన ఆ సాయి నాథునికి నమస్కారం”.

నా పేరు N.జనార్దన్. నేను హైదరాబాదులోని రామ్నగర్ నివాసిని. కానిస్టేబుల్ గా రిటైర్ అయి బాబా సేవలో ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం నా వయసు 75 సంవత్సరాలు.

నాకు జరిగిన మొదటి లీలను మీతో పంచుకోడానికి సంతోషిస్తున్నాను. అది చిత్తూరుకు దగ్గరగా చెన్నూరు గ్రామం. ఆ గ్రామంలోన ఒక ముస్లిం సాయి భక్తుడు ఉండేవాడు. అతని పేరు బషీరుద్దీన్ బాబా.

తాను ఆ చెన్నూరులోనే ఒక ఆలయం నిర్మించాడు. అది “రామ్ సాయి మందిర్”. ఇంత వరకు అలాంటి ఆలయంను నేను ఎక్కడా చూడలేదు.

సీత, రామ్, లక్ష్మణ్ మూర్తులు వెనకకు ఉంటాయి. వారి ముందు బాబా మూర్తి ఉంటుంది. యెంత బాగుంటుందో. నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్న రోజులవి. సేవచేయడం కోసం “రామ్ సాయి మందిర్”కు మేము పది మంది కలిసి వెళ్ళాం.

అప్పట్లో గుడి కొత్తగా కట్టడం వల్ల చాలా రద్దీగా   ఉండేది. మా పది మంది బాబా సేవలో ఒక్కొక్కరుగా విడిపోయి బాబా సేవ చేసుకుంటున్నారు.

నాది వచ్చే భక్తుల నుండి కొబ్బరికాయలు తీసుకుని కొట్టే సేవ. అయితే కొబ్బరి కాయలు కొట్టి, కొట్టి నా చేతులు కమిలిపోయి గాయం అయి రక్తం వచ్చింది.

బషీరుద్దీన్ బాబా నా చేతిలో నుండి రక్తం రావడం గమనించి శేజ్ హారతికి ముందు బాబాగారి ఊధీని నా చేతి నిండా పుసారు.

చేయంతా విభూతి పూసి, పై నుండి ఒక కర్చీఫ్ తీస్కొని చేయి చుట్టూ కట్టి, మళ్ళీ రేపు శేజ్ హారతికి కట్టు విప్పుతాను. అంత వరకూ అలాగే ఉండనీయండి అని అన్నారు.

మరుసటి రోజు నా చేతికున్న కర్చీఫ్ని  తీసి చూస్తే ఆశ్చర్యం, అద్భుతం. ఊధీ తాలుకు మహిమ చూడండి. కనీసం గాయం తాలుకు మచ్చ అయిన లేదు.

నాకు గాయం అయి రక్తం వచ్చింది కదా! కొంచెం అయినా  మచ్చ ఉండాలి కదా! అసలు గాయం కాకా ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఏదో గుడిలో సేవ చేసుకుందాం పుణ్యం వస్తుంది కదా! అని వెళ్ళా.

కానీ నా జీవితం ఇక అప్పటి నుండి మొత్తం మారిపోయింది. అంతా సాయి మయం అయింది. అప్పుడు జరిగిన నా మొదటి బాబా అనుభవంతో నేను 1975లో బాబా భక్తుడిగా మారిపోయా.

ఇప్పుడు నా వయస్సు 75 సంవత్సరాలు. అంటే బాబాతో నా అనుబంధం 42 సంవత్సరాలు. ఆయన నీడలో నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. నేను ప్రతిరోజూ రాంనగర్ సాయిబాబా గుడికి వస్తాను.

ఆ బాబా రప్పించుకుంటున్నాడు. 1975వ సంవత్సరంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఘంటసాల గారు కాకడ హారతికి వచ్చి ఆ గుడిలో రెండు రోజులు ఉండి కాకడ హారతి సుప్రభాతం పాడారు.

నా యొక్క ఈ అమూల్యమైన మొదటి అనుభవంను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

బాబా ఆశీర్వాదములు సదా అందరికి ఉండాలని ఆశిస్తూ.

       ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

 

***సాయిసూక్తి

 

“నేను మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాను”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles