Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-186-2012-నేనెవరినో తెలిసికుంటావు 4:35
కడుపులోని పిండం కదలకపోవడం వలన నెల్లూరుకి చెందిన నరసింగరావు 1947 జూన్ నెలలో ఆసుపత్రిలో చేర్చాడు. దానికి తోడు ఆమె బిడ్డని ప్రసవించడం కూడా కష్టతరమవుతోంది.
డాక్టర్లు బిడ్డని తొలగించినా ఆమెకి విపరీతమైన జ్వరమొచ్చింది, మరియూ ఆమె కంపనాలకి గురయ్యింది.
ఆ మరునాడు ఉదయానికి నరసింగరావు తనని రెవెన్యూ శాఖలోని క్లర్కు పదవినుండి తొలగిస్తున్నట్లుగా నోటీసు నందుకున్నాడు.
వైద్యానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ కానీ తనిప్పుడు నిరుద్యోగి, పైసా దగ్గర లేని వాడు. పిల్లలు చిన్నవాళ్ళు, చూసేందుకు ఇంకెవరూ లేరు.
సాయి భక్తులందరి లాగానే నరసింగరావు కూడా సాయి మీదా భారాన్నంతా మోపాడు. నరసింగరావు సహోద్యోగులు అతని భార్య వైద్య ఖర్చులూ ఆసుపత్రి బిల్లులూ చెల్లించారు, పొరుగువారు పిల్లలను తమతో తీసికుని వెళ్లి జాగ్రత్తగా చూసికుంటున్నారు.
పదమూడవరోజున అతని భార్య ఆసుపత్రి నుండి విడుదలైంది. కానీ ఆమె కాలు వాచి నొప్పిగా వుంది.
నరసింగరావు స్నేహితుడైన డాక్టరు సిద్ధరామయ్య ఆమెకి ఉచితంగా చికిత్సచేసి మందులిచ్చాడు. క్రమంగా ఆమె కోలుకుంది, కొద్దికొద్దిగా నడువసాగింది.
ఈ సమయంలో నరసింగరావు బాబా నామాన్ని నిరంతరం ఉచ్చరించేవాడు, బాబా స్తోత్రాలను పాడుకునే వాడు.
ఒకరోజు వుదయాన్నే ఇంటి బయటకు వచ్చిన నరసింగరావుకి బాబా బిక్షమెత్తుకుంటూ కనిపించారు.
కొద్ది సమయం దిగ్భ్రాంతి కి గురయ్యిన నరసింగరావు ఆయన దగ్గరికి వెళ్లి ఆలోచనలేకుండా, ’అయ్యా! మీరెవరో తెలిసికోవచ్చా?’ అని ఆంగ్లంలో ప్రశ్నించాడు.
బాబా కూడా ఆంగ్లంలోనే ’నీవు మూర్ఖుడివి, నిన్ను నువ్వు తెలిసికోగలిగితే, నేనెవరినో తెలిసికోగలుగుతావు’ అన్నారు.
యుజుర్వేదంలో చెప్పిన అహం బ్రహ్మస్మి అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని బాబా నరసింగరావు కి ఒకే ఒక వాక్యంలో బోధించారు.
అప్పుడు నరసింగరావు బాబా ని తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానించాడు.
’నేనందుకే వచ్చాను’ అంటూ బాబా అంగీకరించారు.
బాబా ని సుఖాశీనులు చేసిన నరసింగరావు బాబా కి వడ్డించసాగాడు.
నరసింగరావుని ఆపుతూ బాబా ’నేను నీ భార్య వడ్డించాలనుకుంటున్నాను’ అన్నారు. అతికష్టం మీద ఆమె బాబా కి వడ్డించింది.
భోజనమయిన తర్వాత బాబా కొద్దిగా విశ్రాంతి తీసికుంటూ వుండగా నరసింగరావు బాబాకి పళ్ళు కొని తీసికుని రావాలని మార్కేట్ కి వెళ్ళాడు.
కానీ నరసింగరావు తిరిగి వచ్చేటప్పటికి బాబా వెళ్ళిపోయారు. అయితే నరసింగరావు భార్య ఈ సంఘటన తర్వాత పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతురాలైంది.
ఒకరోజు బాబా ఫోటో ని ఫ్రేము కట్టించుకోవడానికి నరసింగరావు భార్య మార్కేట్ కి వెడుతోంది. దురదృష్టవశాత్తూ ఆ ఫోటో ఎక్కడో పడిపోయింది.
ఎంత వెతికినా దొరకలేదు, బాబా తనని విడిచి వెళ్లిపోయారని ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏదో ఆపద కలుగబోతోందని ఆమె ఊహించుకుంది. అయితే అటువంటిదేమీ జరుగలేదు.
ఆ రాత్రి స్వప్నంలో ఆమెకు బాబా దర్శనమిచ్చారు. ”ఎందుకు అంతలా ఏడుస్తున్నావు. ఇక్కడ నీకు నచ్చిన నా చిత్రాన్ని తీసికుని రోజూ పూజించుకో’ అన్నారు.
ఆ మరునాడు షిరిడీకి పోయెచ్చిన ఒక భక్తుడు వారింటికి వచ్చి ఆమె కి బాబా చిత్రాన్ని బహుకరించాడు. ఆమె స్వప్నంలో ఎన్నుకున్న చిత్రమే అది.
ఆ చిత్రాన్ని బాబా ఇచ్చిన అపూర్వమైన బహుమానంగా ఆ దంపతులు దాచుకున్నారు. ఆ చిత్రాన్ని పొందిన తర్వాత ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. ఆమె భర్తకి మంచి ఉద్యోగము దొరికింది. ఆర్దికంగా కూడా బాబా నిలదొక్కుకున్నారు.
రామలింగస్వామి, అంబ్రోసియా ఇన్ షిరిడీ నుండి.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374.
Latest Miracles:
- బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio
- అభిషేక తీర్దముతొ ఆరోగ్యము చెకూరుట–Audio
- ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు
- “విషకీటకము నాయనా జాగ్రత” అని శ్రీ సాయి ముందుగా వెంకటేశ్వర్లుగారిని హెచ్చరించుట–Audio
- కొంత సమయం తరువాత పాప బ్రతికింది అందరూ బాబా లీలను చూసి ఆశ్చర్యపోయారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “ముందుగా నువ్వెవరివో తెలిసికో; అప్పుడు నేనెవరినో తెలిసికుంటావు–Audio”
B.C.SURYAPRAKASH
December 20, 2018 at 10:37 amబాబ లీల లు అమెగం