Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-188-2112-చూపిన బాబావారు 3:17
బహుశః ఈ భక్తుడు తన పేరుని గుప్తంగా వుంచదలుచుకున్నాడేమొ, అందుకే కేవలం తన పేరులోని రెండు పొడి అక్షరాలు పి.ఎస్. లు మాత్రమే ప్రస్తావించాడు.
ఈ భక్తుడు 1950 నుండీ దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్నాడు. అన్ని రకాల వైద్య విధానాలనూ చికిత్సలనూ వాడాడు కానీ ఫలితం మాత్రం శూన్యమే.
ఇలా వుండగా ఒక రోజు ఈయనకి బాబా చాయ చిత్రమొకటి పాత మందుల పుస్తకంలో దొరికింది. దానిని ఆయన పూజించసాగాడు.
ప్రతిరోజూ తెల్లవారుతూనే దగ్గరలోని పార్కుకి పోయి ఏకాంత ప్రదేశంలోని చెట్టుక్రింద కూర్చుని ఆ చాయాచిత్రాన్ని చూసికుంటూ ధ్యానం చేసికునేవాడు, ఆ తర్వాత బాబా అష్టోత్తర శతనామా వళి ని చదువుకునేవాడు.
ఒకరోజు రాత్రి ఆయనకి ఒక ఆసక్తికరమైన కల వచ్చింది.
బాబా ని పోలివున్న ఒక సన్యాసి అతనిని తోడ్కొని వెడుతున్నారు, ఆ సన్యాసి అతనిని కొండలలోనికి కోనలలోనికి తీసికుని వెళ్లారు. దారంతా ముళ్లూ పొదలతో నిండివుంది.
అతనికి సన్యాసి వెంట నడవడం చాలా కష్టమైంది. అయినా కూడా పట్టుదలగా ఆ సన్యాసితో నడువసాగాడు. చివరికి వారొక మసీదు దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు ఆ సన్యాసి మాయమయిపోయాడు.
కల అక్కడితో చెదిరిపోయింది. ఈ స్వప్నసాక్షాత్కారం తర్వాత అతని దీర్ఘ కాల వ్యాధి తగ్గుముఖం పట్టింది. అతను ఆరోగ్యవంతుడైనాడు.
1953 లో తొలిసారిగా షిరిడీకి వెళ్ళిన అతను ద్వారకామాయికి వెళ్ళి ఆనందంతో ఉక్కిరిబిక్కరయ్యాడు.
తను గతంతో స్వప్నంలో చూసిన మసీదే ఇది. అప్పుడు అతను బాబా తనని ద్వారకామాయికి తోడ్కొని వచ్చారని తెలిసికున్నాడు.
శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవై రెండవ అధ్యాయంలో ద్వారకామాయి మసీదు గురించి బాబా బాలాసాహెబ్ మిరీకర్ తో ఎవరైతే ఈ ద్వారకామాయి ఒడిలో కూర్చొనెదరో వారిని కష్టముల నుండీ, ఆతురతలనుండీ తప్పించును. ఆమె ఒడినాశ్రయించిన వారి కష్టములన్నియూ సమసిపోవును.
ఈ మసీదుతల్లి చాలా దయార్ద్రహృదయురాలు.
అమె నిరాడంబర భక్తులకు తల్లి. ఎవరామె నీడనాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అన్నారు.
పీ.ఎస్.విషయంలో పీ.ఎస్ ను చాలా కష్టమైన బాటలన్నిటినీ తిప్పి చివరికి ద్వారకామాయకి చేర్చారు.
పీ.ఎస్. కర్మలన్నీ నాశనమయిపోయిన పిమ్మట ద్వారకామాయి అతని రోగాన్ని నయం చేసింది.
సంపూర్ణ ఆరొగ్యాన్నిచ్చింది.
సాయి సుధ, సంపుటి 16, భాగం 12, మే 1956.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374.
Latest Miracles:
- బాబా అతనిని సమృద్ధిగా ఆశీర్వదించారు–Audio
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- పొద్దు పోలేదు! …. మహనీయులు – 2020… నవంబర్ 19
- శంకర్ లాల్ కె. భట్
- running train నుంచి క్రిందపడుతున్న నన్ను బాబావారు కాపాడారు.పిలిచిన వెంటనే సమయానికి వచ్చి బాబావారు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అని నాకు స్పష్టమైంది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments