బాబా అమె గొంతు బాధను నయపరిచారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-192-2312-బాధను నయపరిచారు 2:37

మణి షాహుకారు కి 1950 తీవ్రమైన గొంతునొప్పి వచ్చింది.

గొంతు బొంగురు పోవడం, గులక రాళ్లు గొంతులో వున్న భావనతో ఆమె తీవ్రంగా బాధపడసాగింది.

అన్ని రకాల వైద్యాలూ, హోమియో, అల్లోపతి, ఆయుర్వేదిక వాడింది కానీ ఎవరూ ఆమె వ్యాధి ఏమిటో తెలిసికో లేకపోయారు. ఆమె హిందూస్తానీ సంగీతం పాడేది, అందువలన ఆమె చాలా బాధపడింది.

అన్నిరకాల వైద్యాలు వాడినా కూడా ఫలితం కనిపించలేదు. పదినిముషాల పాటు పాడిన వెను వెంటనే ఆమె గొంతు బొంగురు పోయేది, దాంతో ఆమె పాడడం ఆపవలసివచ్చేది.
ఈ బాధననుభవించిన ఆరునెలల తర్వాత ఆమె షిరిడీకి పోయింది.

బాబా సమాధి ముందు నిలబడి సాయం కోసం ఏడ్చింది. ఆ తర్వాత సంస్థాన్ లో వుంటున్న తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది.

ఆ స్నేహితురాలితో కొంత సేపు గడిపిన తర్వాత రాత్రి 7.30 కి సాఠే వాడాలో తనకి కేటాయించిన గది తాళం తీసి లోపలికి ప్రవేశించింది.
ఆమె చీరకు కట్టిన పిన్నను తీస్తూ వుండగా ఒక కాగితమూ, కొన్ని మందులూ నేలమీద పడ్డాయి.

అవి ఎవరో మందుల షాపు వ్యక్తి చేత చక్కగా ప్యాక్ చేయబడ్డాయి. ఆ కాగితం రెండు అంగుళాల పొడుగుంది. ఆశ్చర్యపోయిన ఆమె ఆ పాకెట్ ని తీసింది.

అందులో హొమియో పతి మందుని పోలివున్న ఆరు చిన్న మాత్రలున్నాయి. అవి తీసికున్న వెంటనే ఆమె తన స్నేహితురాలిదగ్గరికి పరిగెత్తింది. ఆమె కంతా వివరించింది.

’ఇది బాబా ఇచ్చిన ప్రసాదమని నువ్వు అర్దం చేసికోలేకపోయావా? ఇప్ప్పుడు వీటితో నువ్వేం చేస్తావని అడిగిందామె. మణి ఇంకేమీ ఆలోచించకుండా ఆ మాత్రలని తిని తన గదికి చేరుకుంది.

గదికి పోయిన వెంటనే ఆమె గొంతులో ఏవిధమైన బొంగురూ లేకుండా, నొప్పీ లేకండా, ఆమె సంగీతాన్ని పాడుకో సాగింది. ఆమె బాబా కి కృతజ్ఞురాలై బాబా కి భక్తురాలై నిలిచింది.

రామలింగస్వామి ’అంబ్రోసియా ఇన్ షిరిడీ’ నుండి సంగ్రహము.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935,
Voice call: 9437366086, 8270077374.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles