రాజకీయాలలో రాణించిన రుషి…..సాయి@366 అక్టోబర్ 2….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


”ఆధ్యాత్మిక రంగంలో శ్రీ సాయిబాబా ఏం చేశారో, రాజకీయ, ఆర్ధిక, సాంఫిుక రంగాలలో గాంధీజీ అవే చేసినట్లు కనిపిస్తుంది” అన్నారు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు.

అహింస, సత్యము, దొంగిలించక పోవటం, అపరిగ్రహము, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవటం, నిర్భయత్వం, అన్ని మతాలపట్ల సమాన గౌరవం, అంటరానితనం పాటించక పోవటం – ఈ నియమాలను సాయినాథుడు ఆచరించి మార్గదర్శకుడైనాడు.

గాంధీజీ వాటిని పాటించి రాజకీయాలలో ఋషి అయ్యారు. అక్టోబరు 2న పుట్టిన మరొక రాజకీయ రుషితుల్యుడు శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి. ఇంకా ఆయనకు స్వగృహమే లేదు,  ప్రధానమంత్రి అయినా. సాయి కూడా పాడుబడిన మసీదునే వాడాడు – భవంతిని నిర్మించుకోకుండా.

నమ్రత సాయినాథుని ఊపిరి. గాంధీగారు భారత దేశంలోని లక్షలాది జనహృదాయాల్లో స్థానం సంపాదించుకున్నట్లుగా ఇటీవల ఎవరూ సంపాదించుకోలేదు.  మహాత్ముడయ్యాడు గాంధీ.

‘మహాత్ముడు’ అంటూ ప్రజలు తనకు ఇచ్చిన నివాళి, నిజంగా శ్రీరామకృష్ణ పరమహంసకు చెందుతుంది అన్నారు గాంధీ. నిరాడంబరత, జీవనశైలి రామకృష్ణుల నుండే అలవడిందన్నారు ఆయన. సాయి కూడా తన ప్రజ్ఞాపాటవాలు అన్నిటికి కారణం తన గురువే అన్నట్లుగా.

సాయిబాబా సత్యమునకు తన జీవితంలో పెద్ద పీట వేశారు. అసలు గాంధీ జీవితమంతా సత్యంతో పరిశోధనలే (”ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌ ఎక్స్పెరిమెంట్సు విత్‌ ట్రూత్‌” అనేది గాంధీగారి ఆత్మకథ).

సాయిబాబా ఇతరుల బాధలను తాను అనుభవించి, తన దేహం పరులకోసమే గాని, తన కోసం కాదని అనేకసార్లు రుజువు చేశారు.

జాతీయవాది గోపాలకృష్ణ గోఖలే ఒక రోజు గాంధీజీతో మాట్లాడుతూ ”మీరు, మీ తల్లిదండ్రులు కలసి అడవిలో పోతుండగా ఒక సింహం ఎదురు వచ్చిందను కోండి అప్పుడు మీరేం చేస్తారు?” అని ప్రశ్నించాడు.

”ఏముంది! మొదట నేను ఆ సింహానికి ఆహారమవుతాను. అలాచేయటం వలన నా తల్లిదండ్రులు బయటపడతారు కదా!” అని ప్రశాంతంగా జవాబిచ్చారు గాంధీజీ.

రాజకీయాలలో కూడా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చును గాంధీజీలాగా!

ఈ రోజు అక్టోబరు 2 గాంధీ జయంతి. ఆ మహాత్మునికి నివాళులు అర్పిద్దాం మనస్ఫూర్తిగా

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles