భక్త రక్షణ …. మహనీయులు – 2020… ఏప్రిల్ 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాను దత్త సంప్రదాయానికి చెందిన వానిగాను, నవనాథ సంప్రదాయానికి చెందిన వానిగాను భావిస్తారు భక్తులు. శంకర మహారాజ్ విషయంలోనూ అంతే.

గణేష్ మాధవ్ అభయంకర్ శంకర మహారాజు భక్తుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు.

ఆ యుద్దపు రోజులలో కూడా అయన మిలటరీ కాంప్ లో గురుచరిత్ర పారాయణ చేసేవాడు కాదు.

ఒకసారి సాయంకాలం ఆ రోజు యుద్ధం ముగిసిన తరువాత, కాంప్ లో బట్టలు మార్చుకుంటున్నాడు ఆయన. ఆయన ధరించిన ప్యాంట్ క్రింది భాగం కాలి అడుగు భాగం తూట్లు పడివున్నాయి.

ఇంకా పరీక్షగా చూసుకున్నాడు. కాళ్ళకు, పాదాలకు గాయాలు లేవు. ఆ విషయం ఆశ్చర్యం కలిగించింది ఆయనకు.

యుద్ధానంతరం స్వగృహం చేరాడు. తన గురువైన శంకర్ మహారాజ్ కూడా వచ్చారు.

అభయంకర్ శంకర్ మహారాజ్ పాదాలకు నమస్కరించాడు. శంకర్ మహారాజ్ కాళ్ళకు, పాదాలకు తుపాకీ గుల్ల గాయాలున్నాయి.

“ఆ గాయాలేమిటి?” ప్రశ్నించాడు అభయంకర్. చిరునవ్వు నవ్వి “నీ పాదాలకు, కాళ్ళకు తగలవలసిన తుపాకీగుళ్ళు నా కాళ్ళకు, పాదాలకు తగిలాయి.

ప్యాంట్ క్రింది భాగం కాలటం, ప్యాంటుకు తూట్లు పడడటం జరిగింది. దత్తాత్రేయస్వామి నిన్ను రక్షింప మన్నారు” అని ఆ యుద్ధంలో జరిగిన ప్రతి సంఘటనను వివరించి చెప్పారు శంకర్ మహారాజ్.

అభయంకర్ ఆయన పాదాలను కన్నీటితో కడిగాడు. గురువు రుణం తీర్చుకోగలమా?

బెంగళూరులో బుర్రిట్ ఒక బ్రాందీ షాపు యజమాని. అప్పుడింకా బ్రిటిష్ ప్రభుత్వమే దేశాన్ని ఏలుతొంది.

బుర్రిట్ పై ఆంగ్ల ప్రభుత్వానికి కోపం వచ్చి, ఎదో కుంటిసాకు చూపించి షాపు ఆస్తిపాస్తులన్నిటిని జఫ్తు చేసింది. ధనవంతుడు బుర్రిట్ పేదవాడయ్యాడు.

శంకర్ మహారాజ్ ఆయనను కోర్టుకు వెళ్ళమన్నాడు. కోర్టు ఆంగ్ల ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పై కోర్టుకు వెళ్ళమన్నారు శంకర్ మహారాజ్.

కనపడ్డ చోటల్లా అప్పుచేసి, డబ్బు తెచ్చి కోర్టుకు పోయాడు బుర్రిట్. అక్కడ కూడా ఓడిపోయాడు.

శంకర్ మహారాజ్ ని నమ్మటం పొరపాటైందని అనుకున్నాడు. “ఈ శంకర్ ఎవరినీ మోసం చేయడు, ఇంకా అంతా అవలేదు. తీర్పు వచ్చిన రోజు శిలకు నీవు నమస్కారం చేస్తావు” అన్నారు శంకర్ మహారాజ్ బుర్రిట్ తో.

సంవత్సరాలు గడిచాయి. స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ కక్షలతో అన్యాయంగా పెట్టిన కేసులన్నిటిని కొట్టివేసింది.

అందులో బుర్రిట్ కేసు కూడా ఉంది. బుర్రిట్ కు లక్ష రూపాయల నష్ట పరిహారం కూడా ఇచ్చింది.

శంకర్ మహారాజ్ వద్దకు బయలుదేరాడు. ఆయన 28.4.1947న మహాసమాధి చెందారని తెలిసి విలపించాడు బుర్రిట్. నమ్మిన వారిని నట్టేట ముంచడు శంకర్ మహారాజ్.

నేడు శంకర్ మహారాజ్ సమాధి చెందిన రోజు ఏప్రియల్ 28.  ఆయనవైపు ఒక అడుగువేద్దాం, పది అడుగులు ఆయన మనవైపు వేస్తాడు.

సద్గురు శంకర్ మహారాజ్ కీ జయ్!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles