మా ఊరి భాయిజా మాతని గర్భశోకం నుంచి తప్పించిన బాబా …!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీలత అనే ఆవిడ మా అందరికీ నిజంగా తల్లే. ఏ పండగైనా పబ్బమైనా, ఆవిడ గుడిలో పండగలకే అని కాదు, ప్రతి గురువారం తానే స్వయంగా వంట చేసి బాబా గుడిలో నైవేద్యం పెట్టిస్తుంది.

గురువారాలు వారి ఇంటినుండే వంట అంతా తయారు చేయబడుతుంది. నిజంగా ఆ తల్లి ఎన్ని పూజలు చేసిందో, ఇలాంటి భాగ్యాన్ని పొందింది.

ఎంత పనిచేసినా ఆమె మొహంలో అలసటే ఉండదు, రోజు 4 హారతులు ఇంట్లో అయినా చేసి తీరవలసిందే.

ఎవరైనా కొత్త వారు గుడికి వచ్చినా, ఏదైనా కార్యార్థమై మా అన్నల్ని కలవటానికి వచ్చినా కూడా భోజనం పెట్టకుండా పోనివ్వదు భోజనం అంటే భోజనం కాదు. ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పెడుతుంది.

ఆ తల్లిని అందరూ బాయిజా మాత అని పిలుస్తారు, ఆ తల్లికి ఒకనాడు ఒక పెద్ద కష్టం వచ్చింది, ఇంజనీరింగ్ చదువుతున్న ఆమె ఒక్కగానొక్క కొడుకును కాలేజీకి వెడుతుంటే ఒక లారీ గుద్దేసింది.

తల పుచ్చకాయలాగా రెండు ముక్కలుగా చీలి పోయింది. వరంగల్ హాస్పిటల్ లో చేర్పించాము. అతని తలకి అటునుంచి ఇటుకి కుట్లు వేశారు. అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఆ తల్లి బాధ వర్ణనాతీతం.

కన్నీరు మున్నీరుగా ఏకధాటిగా ఏడుస్తుంది. డాక్టర్స్ ఏ మాటా చెప్పటంలేదు, ఎదిగి చేతికి వచ్చిన కొడుక్కి ఏమైనా అయితే, ఆ తల్లితండ్రుల పరిస్థితి ఏమనాలి? ఎంత బాధగా ఉంటుంది, ఆ తల్లి ఏమి తినటం లేదు.

అప్పుడు నేను ”బాబా ఈ అక్క బాధ నేను చూడలేకపోతున్నాను, నాకు ఎలాగో అమ్మా నాన్నా లేరు, ఒంటరి వాడ్ని, నేనేమైన ఎవరికీ ఏ బాధా ఉండదు,

నువ్వు ప్రాణమే తీసుకోవాలనుకుంటే, నా ప్రాణం తీసుకుని, నా ఆయువుని అతనికిచ్చి అతన్ని బ్రతికించి ఆ తల్లిని  గర్భశోకం నుండి రక్షించు, నన్ను నువ్వు తీసుకు పో” అని వేడుకున్నాను.

రెండు రోజులలో అతనికి స్పృహ వచ్చింది, గండం గడిచింది అన్నారు కానీ, దెబ్బ తగిలింది తలకి కాబట్టి సరిగా ఉంటాడో లేదో నని అందరూ భయపడ్డారు.

నేను ఆ అక్కకి ధైర్యం చెప్పి శ్రీ సాయి సచ్చరిత్ర తీసుకువచ్చి పారాయణ చేయమని ఆమెకిచ్చాను.

అక్క పారాయణ ప్రారంభించింది, యాక్సిడెంట్ అయిన 20 రోజులకే పిల్లాడు కాలేజీ కి వెళ్లడం మొదలుపెట్టాడు,

ఆ అబ్బాయిని హాస్పిటల్లో చూసిన ప్రతి వాళ్ళు ఈ పిల్లాడు బ్రతకడం కష్టం అన్నారు, అలా బాబా ఆ తల్లిని గర్భశోకం నుండి కాపాడాడు.

మరింక ఆ తల్లి బాబాకి అలా సేవ చేస్తుంది అంటే, తన బిడ్డని బ్రతికించి పునర్జన్మ నిచ్చిన, బాబా పైన ఆమెకి ప్రేమ ఎందుకు ఉండదు. బాబా భక్తుల పైన అభిమానం ఎందుకుండదు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles