బాబా ఆధీనంలోనే పంచభూతాలు !



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


2009వ సంవత్సరంలో కేదార్ నాథ్ వెళ్ళాము. అక్కడ బాగా చలిగా ఉంటుందని దుప్పట్లు, స్వెటర్స్, మంకీ టోపీలు, మఫ్లర్స్, గ్లౌజెస్ అన్నిటితో పాటు టార్చ్ లైట్ కూడా తీసుకువెళ్ళాము.

ఆ సమయానికి అక్కడ మూడు రోజుల నుండి కరెంటు లేదట. దైవ దర్శనానికి వెళ్ళాలంటే పెద్ద కొండ ఎక్కాలి.

ఆ దారి చిన్నగా ఉంటుంది. ఎక్కలేని వాళ్ళు గుర్రాలపై వెళతారు. మాములుగా అయితే చీకటి పడినా కానీ లైట్స్ వేసి ఉంటాయి.

అప్పటికే మూడు రోజులనుండి కరెంటు లేకపోవటాన  లైట్స్ ఉన్నాయి కానీ వెలిగే అవకాశం లేదు.

అది మేము పైకి ఎక్కేటప్పుడే చీకటి పడకముందే కిందకి దిగి రాదలుచుకుంటే రండి లేకుంటే పైననే ఉండిపోండి. దిగుతుండగా చీకటైపోతే మధ్యలో ఇరుక్కుపోతారు అని announcement చేసి ఉండాల్సింది.

కానీ అక్కడి గవర్నమెంట్ అటువంటిది చేయలేదు. ఆ సంగతి మాకు తెలియలేదు. కులాసాగా ఎక్కేటప్పుడు గుర్రాలమీద వెళ్ళాము.

సన్నటి కాలితోవ ఒకపక్క లోయ మరోపక్క కొండ ఉన్నాయి. ఆ గుర్రాలకి బాగా తర్ఫీదు ఇస్తారు కాబట్టి అవి బాగానే నడుస్తున్నాయి.

మనుషులు అలా నడవాలంటే చాలా జాగ్రత్తగా నడవాల్సివుంటుంది. దిగేటప్పుడు సరదాగా నడిచి చుట్టూ చూసుకుంటూ దిగుదామని దిగటం మొదలుపెట్టాం.

టార్చ్ లైట్ అవసరం అవుతుంది అని కూడా తెలియదు. అందుకని అది కూడా మా దగ్గర లేదు. 16 కిలోమీటర్లు మేము నడవ వలసి ఉంది.

సామాన్లు కింద లాకర్ లో ఉన్నాయి. కొంత దూరం వచ్చేవరకు బాగానే ఉంది, గబగబా దిగుతున్నాము, మా వెనక,  ముందు గుర్రాలు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు,

మాకు ఎదురు అంటే పైకి ఎక్కటానికి కూడా మనుషులు వస్తున్నారు, గుర్రాలు కూడా వస్తున్నాయి, కొంత దూరం పోయాక ఇంక గుర్రాలు కానీ మనుషులు కానీ ఎదురు రావటం మానేసాయి. వెనుక వచ్చేవాళ్ళు కూడా తగ్గారు.

చీకటి అయ్యింది. ఉన్నట్టుండి ఒక నర మానవుడు కూడా కనపడటం మానేసాడు. కటిక చీకటి, మేము ఇద్దరం మాత్రమే ఉన్నాం.

సన్నని దారి కొంచెం స్లిప్ అయిందా ఇంక గల్లంతే. ఆ కొండలలోనే చిన్న చిన్న అరల కింద చేసి, అందులో అక్కడ వాళ్ళు షాపులు పెట్టుకున్నారు.

ఇప్పుడు (ఆ సమయం లో) వాళ్ళు కూడా దుకాణాలు మూసేసి కిందకి వెళ్లి పోయారు. కొండని పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ  దిగుతున్నాము.

ఇంతలో పెద్ద పెట్టున వాన మొదలు అయింది. ఆ ప్రాంతంలో ఏ సమయం లోనైనా వానలు అలా కురుస్తూంటాయట.

మా చేతిలో టార్చ్ లైట్ అన్నా లేదు. కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి, కొత్త ప్రాంతం, పైగా వాన ఇంకేం చేయాలి.

ఇంకా వెళ్ళవలసిన దూరం మూడు కిలోమీటర్లు ఉంది. ఇంక ఇద్దరం నిలబడి ”ఓ బాబా! ఎందుకయ్యా మాకీ పరీక్ష, ఈ చీకటిలో వాన కూడా వస్తోంది. మేము ఎలాగయ్యా నడవగలం, కాలు పక్కకి పడిందా మేము మిగలము.

మా ఆవిడ అయితే కొంగు జాపి ”బాబా మమ్మల్ని దిక్కులేని పక్షులు చేయకు, ఇక్కడ పోయామంటే ఎవరికీ తెలియదుకూడా. ఈ చీకటిలో ఏం జరిగిందో కూడా మేము తెలుసుకోలేము. మమ్మల్ని అన్యాయం చేయకయ్యా బాబా అంటూ బోరున ఏడ్చింది.

అంతే! వెంటనే వాన ఆగింది, వాన ఆగటం ఒకటే కాదు, ఆకాశంలో నక్షత్రాలు కూడా వచ్చాయి.

ఆ నక్షత్రాల కాంతిలోనే మేము నడిచాము. మేము నెమ్మదిగా కిందకి చేరుకున్నాము. లాకర్ లో నుంచి సామానంతా తీసుకుని రూమ్ కి వెళ్ళాము.

మేమింకా బట్టలు కూడా మార్చుకోనేలేదు. మళ్ళీ వాన మొదలైంది, ఆ పడటం పడటం చాలా పెద్ద వాన తెల్లారేదాకా పడుతూనే ఉంది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles