సంశయించిన వ్యక్తికీ బాబా వారు, ఆమె పెద్దనాన్న రూపంలో దర్శన మిచ్చుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గోపాలకృష్ణ గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం

మా చుట్టాలమ్మాయి నిర్మల కి చాలా రోజులుగా వివాహం అవ్వలేదు. వాళ్ళ నాన్న చాలా దిగులు పడుతూండేవాడు.

అటువంటి పరిస్థితిలో ఎవరో ఆమెకి శ్రీ సచ్చరిత్ర పారాయణ గ్రంథం చేతిలో పెట్టి, ఇది చదువుకో, నీకు త్వరలో పెళ్లి అయిపోతుందని  చెప్పారట.

సరేనని ఆ అమ్మాయి పెళ్లి కోసమే ఆ గ్రంధం పారాయణ చెయ్యడం మొదలు పెట్టింది. ఆ పుస్తకం చదువుతోంది కానీ, బాబాని ఏకోశానా  దేముడుగా ఆమె మనసు అంగీకరించడం లేదు.

పైగా ఈయనేం దేవుడు? దేవుడంటే శివుడే కానీ ఈయన కాదు,

ఈయన నిజంగా దేవుడైతే నేను ఒక సమయం చెబుతాను. ఒక రోజు చెబుతాను. ఆ సమయంలో, ఆ రోజు నాడు నాకు తెలిసేటట్టుగా కనపడితే అంటే నాకు కనపడింది నిజంగా బాబా అని నాకు అనిపించాలి. అని అనుకుంది.

నాలుగు రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడికో బయటకు వెళ్ళాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది. గేటుకి తాళం వేసింది.

వాళ్ళ వీధి అంతా ఏదో రిపేర్ చేస్తున్నారు. రోడ్డంతా గోతులు, ఎత్తులు, పల్లాలుగా ఉంది. ఆ రోజు ఆ అమ్మాయి బాబా నాకీ రోజు కనపడాలి అని అనుకుంది.

సాయంత్రం 6 -30 అయింది. ఇంతలో బయట గేట్ దగ్గర ‘నిర్మలా! నిర్మలా! అంటూ పిలుపు వినపడింది. నిర్మల బయటకు వచ్చి చూసింది. గేట్ దగ్గర వాళ్ళ పెద్ద నాన్న గారు.

 ‘అయ్యో! పెద్ద నాన్న! ఇంత పొద్దు పోయాక వచ్చావేమిటి? ఉండు గేట్ తాళం తీస్తాను అంది నిర్మల.

“వద్దమ్మా సందు చివర రిక్షా ఉంది, ఇటు పోతూ పోతూ నిన్ను చూడాలనిపించి వచ్చానమ్మా! తాళం ఏమి తీయకు తల్లి! నేను వెళ్లి పోతాను” అంటూ వెళ్ళిపోయాడు. (ఆయన ఒక స్వామీజీ, ఆయన పేరు రామకృష్ణానంద భారతి, విజయవాడలో ఉందాయన ఆశ్రమం, దత్తాత్రేయ పీఠం)

ఆయనలా వెళ్లిపోతూంటే చూసింది. కాళ్ళు బాగా వాచి ఉన్నాయి. అడుగులు భారంగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు.

నిర్మల లోపలికి వచ్చి ఏడ్చేసింది. అంత పెద్ద వయసాయన ఇంత చీకటి వేళ నిన్ను చూడాలనిపించిందమ్మా అంటూ వచ్చాడు. పెద్ద నాన్నకి నేను అంటే ఎంత ప్రేమ అనుకుని కళ్ళనీళ్ళు తుడుచుకుంది.

ఇంతలో వాళ్ళ నాన్న వచ్చాడు, నాన్నా! సాయంత్రం పెద్దనాన్న నిర్మలా నిన్ను చూడాలనిపించి వచ్చానమ్మా అంటూ వచ్చాడు. నేను రా పెద్దనాన్న తాళం తీస్తానన్నాను.

అయినా కూడా వద్దమ్మా నిన్ను చూసానుగా, అక్కడ రిక్షా ఉంది వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోయాడు పాపం. లోపలికి రమ్మన్నా రాలేదు అని చెప్పింది నిర్మల బాధగా.

వాళ్ళ నాన్న ఏమిటి అన్నయ్య ఇంటికి వచ్చాడా! ఎందుకు అనవసరంగా ఇంత దూరం వచ్చాడు. పైగా రోడ్ కూడా ఏమి బాగా లేదు, ఎందుకొచ్చాడో ఏమిటో? అన్నాడు.

రెండు రోజుల తర్వాతా వాళ్ళ నాన్న అన్నయ్యను చూడాలని వెళ్ళాడుట.

“అన్నయ్యా! నేను లేనప్పుడు నీవు నిర్మలని చూడాలని అంత దూరం వచ్చావుట అంత శ్రమ పడి, చూడ బోతే నీ కాళ్ళు కూడా బాగా వాచి ఉన్నాయి అన్నాడుట.

ఆయన ఏమిటి నేను మీ ఇంటికి వచ్చానా? నిర్మలని చూడాలని అన్నానా? నిర్మలని పిలిచానా? లేదురా బాబు! నేనసలు మీ ఇంటికే రాలేదు. ఎవరిని చూసి ఎవరనుకుందో ఏమో అన్నాడట ఆయన.

వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చి నిర్మలతో “పెద్ద నాన్న అసలు మనింటికి రాలేదట, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏమో అన్నారుట వాళ్ళ నాన్న.

అది విని ఆ అమ్మాయి ఆశ్చర్యంతో విస్మయం చెందింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది.

ఎందుకంటే బాబా తనకు తెలిసిన వాళ్ళ రూపంలో, తను అనుకున్న సమయంలో రావాలి అని ఆ అమ్మాయి అనుకుంది.

తను అనుకున్న సమయంలో బాబా ఆమె కోరికను తీర్చి ఆమెకు నమ్మకం, విశ్వాసం పెంపొందేట్లు చేసాడు.

2006 చివరిలో మా ఫామిలీ, మా తోడల్లుడు వాళ్ళ కుటుంబం, మా కుటుంబం కలిసి షిరిడి వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చి, నేను అద్దెకు ఉన్న ఇల్లు తాళం తీస్తుంటే,

వెనక నుండి ఎవరో సార్ మీకు మల్కాజ్గిరిలో ఉన్న ఖాళీ స్థలంకి మంచి రేట్ వచ్చేలా చూస్తాను అమ్ముతారా? అని అడిగాడు.

నేను తరువాత చెపుతాను అన్నా వదలకుండా ఫాలో-అప్ చేసి నాకు 5 రేట్లు పైన రేట్ ఇప్పించాడు.

అలాగే మాకు రెండు మూడు చోట్లగల ఇతర వాటి మీద కూడా మంచి లాభాలు, వచ్చేలా చేయడంతో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం, మేము ఉన్న “ద్వారకామాయి” అనే ఇంటిని ఏ విధమయిన అప్పు చేయకుండా 2007 లో కొన్నాము.

నాకు అత్యంత సంతోషం ఎందుకంటే ఈ ఇల్లు బాగ్ లింగంపల్లిలో గల సాయిబాబా మందిరానికి ఎదురుగానే ఉంటుంది.

ప్రతి రోజు నేను ఏ పని మీదనైనా బయటకి వెళుతుంటే సాయినాధునికి ఒక నమస్కారం చేసుకుని వెళ్లే అవకాశం అడగకుండానే ఆ బాబా నాకు కలిపించారు.

ఈ విధంగా ఎల్ల వేళలా నన్ను నా కుటుంబాన్ని, తన బిడ్డలుగా తలచి రక్షిస్తూ మాపై కరుణాకటాక్షాలు, కురిపిస్తూ,

ఈదీనుడైన భక్తునికి ఏది అవసరమో తెలుసుకుని అడగక ముందే తల్లిలా ప్రసాదిస్తున్న సాయినాధునికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. హృదయపూర్వక వందనాలు సమర్పించడం తప్ప. ఓంశ్రీసాయినాధయ నమః.

సర్వం శ్రీసాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles