Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముందుభాగం ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
వెంగళరావు నగర్ బాబా గుడిలో ప్రతి గురువారం రాత్రి భజన, పల్లకీ జరుగుతుంది.అని మా ఫ్రెండ్ చెప్పడం తో తరువాతి గురువారం రాత్రి తనతో పాటూ గుడికి వెళ్ళాను.ఆరోజు భజన పాటలు పాడుతున్న దగ్గర కూచున్నాను.
చాల ప్రశాంతంగాఅనిపించింది ఆ పాటలు వింటుంటే. అలా మెల్లి మెల్లిగా ఆ పాటల కోసం ప్రతి గురువారం గుడికి వెళ్లేదాన్ని,నేను వెళ్లడమేకాకుండా మా రూమ్ మేట్స్ ని కూడా తీసుకువెళ్లేదాన్ని వాళ్ళకి కూడా నచ్చి ,అందరం గురువారం రాత్రి భజనకి వెళ్లేలావాటు ఐంది.
కానీ ఇక్కడ విశేషమేమంటే ..నాకుగుడిని పరిచయం చేసిన ఫ్రెండ్ మాత్రం నన్ను తీసుకువెళ్లిన ఆరెండు వారాలు తప్ప మళ్ళీ రావడం తనకి కుదరలేదు.తరువాత ఆలోచిస్తే అర్థమైంది నేను ఆ గుడికి రావడానికి తనను ఒక మిష లాగ ఉపోయోగించుకున్నాడు బాబా అని..అలా వెళ్ళినప్పుడు కూడా నేను బాబాని ఏమి కోరేదాన్ని కాదు.నాకు శివుడుఉండగా బాబాని కోరడం ఎందుకు అని.
బాబా విగ్రహం దగ్గర కూడా అదే అనుకునే దాన్ని,! “ మీరు అనుకుంటున్నారేమో నేను అంటే ఇష్టం లేదు అనుకుంటూనే నా దగ్గరకు వస్తున్నావు చూసావా అని.నేనేమి మీకోసం రావట్లేదు..ఇక్కడ భజననచ్చింది.
సంగీతం అంటే నాకు ఇష్టం కాబట్టి ప్రశాంతత కోసం వస్తున్నా అంతే మీకోసమేమి కాదు..ఐన నేను మిమ్మల్నిఏమి అడగడం లేదు కదా.ఐన మీరు అనుకుంటారేమో నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నావు కదా అని.
కానీ మీరు దేవుడో కాదో నాకు తెలియదు కానీ , పెద్దవాళ్ళు కదా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నమస్కరించడం పద్దతి కదా అందుకే నమస్కరిస్తున్నాను అంతే తప్ప ఇంకేమి కాదు.
ఓకేనా బాబా అని అనుకునే దాన్ని..కానీ అలా ప్రతి గురువారం వెళ్లడం అలవాటు అయిపోయింది. శివుని గుడి దగ్గరలోనే
ఉన్నా,అక్కడికి కాకుండా బాబా గుడికి వెళ్లడం అలవాటైపోయింది..
నేను అనుకునే దాన్ని శివుని గుడికి వెళ్లట్లేదు ఎందుకు బాబా గుడికే అలవాటయ్యాను అని.ఒకరోజు కలలో శివుని గుడి బాబా గుడి పక్క పక్కనే ఉన్నాయి.నేను అనుకుంటున్నాకలలో.. రోజు శివుని గుడికి 1st వెళ్లకుండా బాబా గుడికి 1st వెళుతున్న ఈ రోజు 1st శివుని దగ్గరకి వెళ్ళాలి అని గుడి తలుపులు తెరిచి లింగానికి నమస్కరిస్తుంటే అనుకోకుండా శివుని విగ్రహం కళ్ళు తెరిచి చూసింది.
నాకు ఒక్కసారిగా ఆనందం,భయం రెండు కలబోయిసినట్టుగా ఐంది.ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు అసలు ఆలోచించాలని కూడా అనిపించలేదు.నాకు అప్పుడు భక్తి సినిమాలలో దేవుడు ప్రత్యక్షమవగానే భక్తులు ఎలా ఆనందం లో మాటలు రాకుండా ఉంటారో గుర్తొచ్చి పాపం వాల్ల పరిస్థితి అప్పుడు ఇలాగె ఉందేమో అనుకున్నాను.
మాట్లాడదామని బలవంతంగా ప్రయత్నిస్తున్న సమయంలో శివుడు, రోజు బాబా గుడికే 1st వెళుతున్నావు కదా,ఈ రోజేంటి దారితప్పి ఇలా ముందు నా దగ్గరికి వచ్చావ్ అన్నారు.
నేను భయంతో కొంచం దైర్యం తో మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి..ఒక్కొక్క పదం ముద్ద ముద్దగా మీరైనా బాబా ఐన ఒకటే కదా అని అటు వెళ్తున్నాను అని అన్నాను.దానికి శివుడు ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నారు.
నేను మీరైనా బాబా ఐన ఒకటే కదా అని అటు వెళ్తున్నాను అని అన్నాను..అలా అనడానికి చాల ప్రయత్నం చేశాను ఎందుకంటే అస్సలు మాటలు రావడం లేదు.
చాల బలవంతంగా ఒక్కోపదాన్ని కష్టపడుతూ చెప్పాను…దానికి శివుడు నవ్వుతూ సరే ఇకనుండి ఆటే వెల్లులే ఇక, సరేనా అన్నారు నేను సరే అనేసరికి మళ్ళీ శివుడు మాయమయ్యాడు.
కానీ ఆ ఆనందంతో కూడిన భయమో ఏదో ఆ అనుభవాన్ని నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా కానీ,రెండు రోజులవరకు అలాగే ఉంది.కానీ శివుడు బాబా దగ్గరికి వెళ్ళడానికి పెర్మిషన్ చ్చాడు ఇక హ్యాపీ బాబా గుడికే వెళ్లొచ్చు ఇక ఎలాంటి అనుమానం లేకుండా అనుకున్నాను.
తరవాతి భాగం ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- బాబా వారి అనుమతి లేకుండా చేసిన పనిలో నష్టాల పాలైన భక్తుడు…Audio
- ఎవరూ తమంతట తాముగా షిరిడీకి రాలేరు. ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి.
- బాబా గుడి కొరకు స్థలం కొని బాబా అనుమతి కొరకు ఎదురుచూస్తున్నా భక్తుడు
- ‘‘మనం దర్శించుకోవాలనుకున్నంత మాత్రాన బాబా దర్శనం కాదు. అలాగే వెళ్ళాలనుకున్నంత మాత్రాన షిరిడికి వెళ్ళలేం. అన్నిటికీ బాబా అనుమతి కావాలి.
- సమస్యను బాబాకి చెప్పుకున్నంతనే చికిత్స మొదలు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శివుని అనుమతి…”
Sreenivas
January 11, 2017 at 4:46 amసాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
kishore Babu
January 11, 2017 at 5:57 amSai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/videos/view/Sai-Baba-Naamam-7
Sai Suresh
January 11, 2017 at 9:32 amచాల బాగున్నాయి సాయి మీ అనుభవాలు. ఈ లీల ద్వార బాబా మరోసారి తాము సర్వ దేవత స్వరూపమని నిరూపించారు. మీరు శివుని భక్తురాలు కనుక ఆ రూపంలోనే బాబాని ఆశ్రయించమని చెప్పారు. ఎవరు ఏ దేవతను ఆరాధించినా చివరకు అందరు గురువును ఆశ్రయించావలసిందే. మీకు సరైన సమయం వచ్చింది కాబట్టే ఆ శివుడు మిమ్మల్ని గురు పాదాల చెంత చేర్చి, మీకున్న సంశయాన్ని కూడా స్వప్నం ద్వార నివృత్తి చేసారు. మీరు అదృష్టవంతులు సాయి.
kishore Babu
January 11, 2017 at 9:49 amNice comment Sai….Respected Devotees…please encourage the authors by writing your valuable comments. Thanks to all Sai Baba devotees.