Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా పాత శిధిలమైన మసీదులో నివసించేవారు. 60 ఏళ్ళు సాయి చేసిన ఎన్నో లీలలకు ఆ మశీదే రంగస్తలమైంది. ఆ శిధిలమైన మశీదు నేల అసమానంగా ఉండి, మోకాలు లోతు గోతులుండేవి.
అందులో ఈశాన్యం మూల కేవలమొక గోనె గుడ్డ మీద సాయి కూర్చొనేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్ని హోత్రము, లేక ‘ధుని’ నిర్వహించేవారు. తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపై చేయి వుంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తుండేవారు.
దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుం గొట్టాలనుంచుకొనేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరుగలి వుండేది. దానితో ఆయన తరుచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తానిండా గోధుమలు, ఆయన పాగ పీల్చటానికి ఒక సంచిలో నాటు పొగాకు వుండేవి.
పడమటి గోడలో గూడు (నింబార్) కు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకొన్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచటి భక్తులకు అదే ప్రసాదంగా యిచ్చి, చివరకు తామూ తినేవారు.
మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు, సేవకులూ బాబా భిక్ష వేసుకొనే కుండ నుండి తమకు కావలసినంత తీసుకొనేవారు. అయన ఏ ప్రాణిని అసహ్యించుకొని వేల్లగోట్టేవారు కాదు. చేవరకు రుచి, విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు తినేవారు.
ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన, ‘ఫాతిహ’ చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాముకూడ చదివేవారు.
భక్తులు తెచ్చిన పూలు నింబార్ కు ఎదురుగా వ్రేలాడతీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసికోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకొనేవారు.
మత సామరస్యానికి రంగస్థలమైన మశీదుకు ఆయన ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్ధం, “మతభేదం లేకుండా అందరికీ నాలు పురుషార్ధాలకూ ద్వారాలు తెరచి వుండేది” అని స్కాందపురాణం చెప్పింది.
‘అక్కడ ధుని ఎందుకు?’ అని అడిగితే, “అందరి పాపాలు దహించడానికే!’ అని సాయి చెప్పారు. కుల మత భేదాలకతీతమైనదే సాయి ధర్మమని, ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది.
ఆ మశీదు పైకప్పు చాలా దీన స్థితిలో ఉండేది. అటువంటి మశీదులో భక్తులు దానిని మరమ్మతు చేసే వరకు బాబా సంతోషంగా తిని, నిద్రపోయేవారు. ఒకసారి బాబా భక్తులతో కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా, శిధిలమైన మశీదు పైకప్పు నుండి పెట పెటమని శబ్దమైంది.
బాబా అకస్మాత్తుగా చేయి పైకెత్తి “వేచి ఉండు, కాసేపు అగు” అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. అప్పుడు అందరు తినడం కొనసాగించారు. భోజనం ముగిసిన తరువాత, బాబా తమ చిలుమ్ గొట్టాలు, పొగాకు సంచులు మరియు నీటి కుండ వంటి వారి చిన్న వస్తువులను తీసుకుని సభా మండపంలోకి వచ్చారు. ఆయనను అనుసరిస్తూ భక్తులు కూడా బయటకు వచ్చి, బాబా ప్రక్కన చేరారు.
అప్పుడే మశీదు యొక్క పైకప్పు నుండి ఒక భాగం సరిగ్గా బాబా మరియు భక్తులు కూర్చున్న చోటనే విరిగి పడింది. అప్పుడు బాబా ఆగమని ఎవరిని ఆదేశించారో భక్తులకు అర్థమై ఆశ్చర్యపోయాడు.
యిలా సృష్టి అంత బాబా అధీనంలో ఉంటుంది. బాబా ఆజ్ఞ ప్రకారమే సృష్టిలో ప్రతి కదలిక జరుగుతుంది. అందుకే బాబా “అన్ని నావే, నేనే అన్ని అందరికి ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైన కదలదు” అన్నారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మసీదు పుట్టిల్లు…..సాయి@366 ఏప్రిల్ 16….Audio
- షిర్డీ సాయి హారతులు – రెండవ భాగం
- మతిభ్రమించిన మహ్మద్ ఖాన్ ను రక్షించుట
- సాయి భక్త బడేబాబా రెండవ బాగం….
- పల్లకీ – చావడి ఉత్సవము–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments