భావూ మహారాజ్ కుంభార్ రెండవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

భావూ మహారాజ్ కుంభార్ రెండవ బాగం…

ఆయనకు శ్రీ సాయిబాబాతో గల అనుభవాలేమిటో, బాబా ఆయనకు ఏ ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు ప్రసాదించారో ఎవ్వరికీ తెలియదు. ఈయన పూర్తీ అవధూతావస్థలో, మూర్తీభవించిన వైరాగ్యంతో షిరిడి లో సంచరించేవారు. యెప్పుదూ ఎవ్వరితో మాట్లాడక ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేవారు.

సుమారు తెల్లవారి 5 గంటలకు అతను రహస్యంగా బాబా దర్శనం చేసుకొనేవారు. వాస్తవానికి అతను రోజులో అనేక సార్లు బాబా వద్దకు వెళ్ళేవారు. బాబా అతనితో కొన్ని మాటలు చెప్పడం గాని, మౌనంగా సంభాశించుకోవడం గాని జరిగేది. కాని అతను బాబా వద్దకు వెళ్ళడం ఇతర భక్తులకు తెలిసేదికాదు. అతనికి బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక మార్గదర్శకము ఎవరు అర్థం చేసుకోలేరు.

బాబాతో ఉన్న ఆధ్యాత్మిక శిక్షణ గురించి అతడు ఎవరికి ఏమి తెలియజేయలేదు. ఒకసారి బూటి ఆ విషయం గురించి అడిగారు. అప్పుడు బావు మహారాజ్ నవ్వి, “నా తండ్రి నాకు తన భకారిలో(జొన్న రొట్టె) 1/4 వంతు ఇచ్చారు మరియు నాకు కొన్ని కథలను చెపుతారు” అని జవాబిచ్చారు.

బాబా మహాసమాధి తరువాత, బావు మహారాజు ఆయన సమాధిని రోజులో చాలాసార్లు రహస్యంగా దర్శనం చేసుకొనేవారు. అతను ఎప్పుడు దర్శనం చేసుకుంటున్నాడనే విషయం ఎవరూ గుర్తించలేక పోయేవారు. బాబా మరియు బాహు మహరాజ్ మధ్య సంబంధం చాలా లోతైనది మరియు బలంగా ఉండేది.

“ఏ పని చేయకుండా ఎవ్వరు ఊరికే ఉండకూడదు, ఏదో పని చేస్తుండాలి” అన్న శ్రీ సాయిబాబా హేతవుకు అనుగుణంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా గ్రామంలో మురికి కాలువలు, రోడ్లు, ముఖ్యంగా మశీదు ముందు రోడ్లు శుభ్రం చేస్తుండేవారు.

సరిగ్గా సాయి వలె ఈయన కూడా ఏ విధమైన వ్యక్తిగత ప్రచారాన్ని ఇష్టపడే వారు కాదు. కట్టుకున్న గోచి తప్ప ఏ స్వార్ధం లేకుండా ఉండేవారు. ఆస్తిపాస్తులను అసహ్యించుకోనేవారు. దీన్నిబట్టి అయన తన ఆత్మస్వరూపంగా ఉన్న సాయిబాబాతో యెంత సన్నిహితంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

బాహు మహారాజ్ సమాధి చెందడానికి ఒక వారం ముందు అనారోగ్యంతో ఉన్నారు. అతను ఆకలిని పూర్తిగా కోల్పోయి ఆహారం ఏమి తినలేదు. కేవలం అతను చాలా ఎక్కువ నీటిని తాగుతూ ఉన్నారు. అతనికి తీవ్రమైన మధుమేహం ఉన్నట్లుగా అనిపించింది.

రఘువీర్ భాస్కర్ పురందరే మరియు సగుణమేరు నాయక్ అతనిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అతను చైత్ర కృష్ణ పక్ష తృతీయ అంటే ఏప్రిల్ 27, 1937న తన చివరి శ్వాసను విడిచారు. అతని మరణ వార్త క్షణాలలో షిర్డీ యావత్తు వ్యాపించి భక్తులు అందరు చేరి లెండీ బాగ్ మార్గంలో వేప చెట్టు కింద అతనిని సమాధి చేసారు.

7 మే 1937 న, అతని మరణించిన 12వ రోజు అతని గౌరవార్థం మహా విందు ఏర్పాటు చేసారు. తరువాతి రోజు (అనగా, 13 వ రోజు) షిరా (బెల్లంతో తయారు చేసిన ఒక రకమైన హల్వా) వేడుక కూడా జరిగింది. ఈ పవిత్రమైన రోజు సంత్ బాహు మహారాజ్ కుంభార్ యొక్క అందమైన చిత్రంనకు సమాధి మందిరంలో ఫోటో గ్యాలరీలో గౌరవ స్థానాన్ని కల్పించారు.

ప్రతి సంవత్సరం చైత్రా మాసంలో  షిర్డీ సాయిబాబా సంస్తాన్ వారు ఇతని పుణ్యతిని నిర్వహించి విందు ఏర్పాటు చేస్తున్నారు.

నేటికి పసిపిల్లలకు, పశువులకు జబ్బు చేస్తే శ్రీ భావూ మహారాజ్ కుంభార్ సమాధికి ప్రదక్షిణ చేసి అక్కడి మట్టిని నుదుట ధరిస్తే ఉపశమనం కలుగుతుందని ప్రజల విశ్వాసం.

షిరిడి వంటి క్షేత్రంలో సద్గురుని ఆశ్రయించుకొని జీవించిన శ్రీ భావూ మహారాజ్ కుంభార్ వంటి ఎందరో మహాత్ముల గురించి భక్తలోకానికి తెలియకపోవడం కడు శోచనీయం.

source: http://saiamrithadhara.com/fivesamadhis.html

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles