Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
నా తండ్రి విఠల్ N వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.కరాచీలో నివసిస్తుండేవాడు.వారు ఎప్పటినుండో సాయిబాబా భక్తులు,కాని ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోడానికి ఇష్టపడేవారు కాదు.
మా నాన్న మొదటి శిరిడీ యాత్ర నా చిన్నతనంలో జరిగింది.
అప్పటి విషయాలు గుర్తుంచుకొనే తీవ్రంగా జ్వరం వచ్చింది.అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డని తీసుకొని ప్రయాణం చేయడం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు.
కానీ,మా నాన్న లెక్కచేయకుండా,బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకొని బయలుదేరాడు.
మేము కళ్యాణ్ స్టేషను చేరేటప్పటికి ఛబూకు జ్వరం తగ్గిపోయింది.
ఆవిధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది.
మా నాన్న మసీదుకు వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.
ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావలసి ఉంది.
సరియైన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలచిన రైలును కోపర్గాంలోఅందుకోవాలి.మా నాన్న బాబా వద్దకు వెళ్లి అనుమతికోరాడు.
ఆ మరుసటి దినమున ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు.కానీ బాబా అనుమతి ఇవ్వలేదు.
దాదాపు 4 గంటలపాటు శిరిడీలోనే ఉంచిన తరువాత వెళ్ళమని ఆదేశించారు.
అప్పుడు కోపర్గాం స్టేషనుకు వెళ్ళినా ప్రయోజనముండదు.రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది.మా నాన్నకు ఏంచేయాలో తోచలేదు.
ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తరువాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్ గాంకు బయలుదేరాడు.
అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషను చేరిన తర్వాతే వచ్చింది.
బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు.ఆయన సకాలంలో బొంబాయి చేరాడు.
1933-1934 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యంతో మంచానపడ్డాడు.
ఆయనకు చికిత్స చేస్తున్నడాక్టరు చిష్కరు మా నాన్న కోలుకుంటాడనే ఆశవదులుకున్నాడు.
21 రోజులు గడచినా జ్వరతీవ్రత తగ్గలేదు.మా నాన్న అంతటి అనారోగ్యంలోను బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు.
21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు.
ఆయన పడక పక్కనే మేమందరం ఉన్నా మాకెవరికీ ఏమీ కనిపించలేదు. “బాబా వచ్చారు.వారు రొట్టెలు,ఉల్లిపాయ అడుగుతున్నారు!” అని మా నాన్న అరిచారు.మాకేమీ బాబా కనిపించలేదు.
బహుశా నాన్నగారు జ్వరతీవ్రతలో కలవరిస్తున్నారనుకొని రొట్టె,ఉల్లి తీసుకువెళ్ళలేదు.దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరిని బయటికి వెళ్ళమన్నారు.
మేము గది బయటకి వచ్చి లోపల ఏమి జరుగుతుందో వినబడేలా నిలబడ్డాము.
అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది.
ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులిద్దరిని బాబా వెళ్ళిపొమ్మని చెబుతున్నారు.
కానీ వాళ్ళు తమతో మా నాన్నని కూడా తీసుకొని వెళ్తామని చెబుతున్నారు.
బాబా ఒప్పుకోలేదు.వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని గద్దించి,సట్కాతో నేలపై కొట్టారు.దానితో వాళ్ళు వెళ్లిపోయినట్లు అనిపించింది.ఆపై వాళ్ళ గొంతులు వినిపించలేదు.
తరువాత బాబా మా నాన్నకు ఒక పెద్దలోటాడు చల్లని నీటిని త్రాగమని చెప్పి వెళ్ళిపోయారు.
మా నాన్న నన్ను లోనికి పిలిచి,చల్లని మంచి నీళ్ళు తెమ్మన్నారు.
డాక్టర్లు చల్లని నీళ్ళు త్రాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను.
మా నాన్న పట్టుబట్టడంతో బాబా మాటలపై నమ్మకమున్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది.
మా నాన్న రెండు,మూడు కప్పుల నీళ్ళు తాగారు.వెంటనే ఆయనకి చెమటపట్టి జ్వరం తగ్గనారంభించింది.
వెంటనే మేము డాక్టరుకు కబురుపెట్టగా,అతను వచ్చి పరీక్షించాడు.
చల్లని నీరు త్రాగాడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టరు ఆశ్చర్యానికి అవధులు లేవు.
ఒక ఇంజక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు.తిరిగి మరుసటిరోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదము లేదని తేల్చిచెప్పాడు.
ఇలా బాబా తన దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు.
అంతకుముందు కూడా మా నాన్న కష్టసమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కన్పించి,రొట్టె,ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు.
గతసంవత్సరం(1935లో)మా నాన్న మా చెల్లెలు ఛబూకు వివాహం చేయదలచారు.
తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు.
ఒక సంబంధం కుదిరినట్లనిపించి చివరికి ఎదో కారణం వళ్ళ చెడిపోయింది.
దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు.తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు.
ఒకరోజు మా నాన్నకు బాబా కలలో కన్పించి పండరీపురం వైపు నుండి తనకొక ఉత్తరం వస్తుందని,ఆ సంబంధం కుదురుతుందని,చింతపడవద్దని చెప్పారట.
అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అనునతడు పండరికి చెందిన దీక్షిత్ అను యువకుడితో ఛబూ వివాహ విషయంగా ఉత్తరం వ్రాసాడు.త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మా అమ్మ నాన్న హ్యాపీ గ ఉంటేనే కదా నేను హ్యాపీ గ ఉంటాను.
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
- బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments