Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Author : Kota Prakasam garu
ఒక సామాన్యుడికి సుఖంగా గడిచిపోవాలని కోరిక ఒక సన్యాసికి మోక్షంపొందాలని కోరిక… తృప్తిలేని జీవితాలకు ఎన్నటికి ప్రశాంతత లభించడం కష్టమే.
****
కొన్ని భయాలతో, కొంత అసంతృప్తితోనే బ్రతుకు తెల్లారిపోతూంటుంది ..
డబ్బులు చేజారి కిందపడి , కాళ్లకుతగిలితే అమ్మవారికి కోపంవొస్తుందని భయం..ఆ డబ్బుతోనేకొన్న బంగారాన్ని బీరువాలో , లొపలి అరలో దాచి భద్రపరుస్తుంటారు ..
ప్రతి ఒస్తువును కొని స్వంతంచేసుకోవాలంటే డబ్బె మూలాధారం ..
అయితె అదే డబ్బుతోకొన్న బంగారాన్ని బీరువాలో దాచి కాపలాకాచేవాడు ,ఆ డబ్బుతోనె కొన్న చీపురకట్టనుమాత్రం అవసరానికివాడుకొని,కాళ్లకు చేతులకు తగులుతున్న పట్టించుకొక మూలపెట్టేస్తుంటారు ..
బంగారంతో ఎన్నిరకాల నగలుచేయించి దాచిపెట్టుకొన్నా , బంగారంతో సాధ్యంకానిది , ఒక్కపూట చీపురు వాడకపొతే , ఇల్లు ఒక అడవిలా మారకతప్పదు ..
శరీరానికి ఇచ్చినంత ప్రాదాన్యత మురుగుకూపంలో తచ్చాడే మనసును గురించి ఆలోచనకురాదు ..
మనిషిది రెండునాలుకలధోరణి అంటారు ..ప్రతి సందర్బంలో విపరీతంగా స్పందిచేది మనసే .. ఉధృతమైన నిర్ణయాలకు విచక్షణనిచ్చి కాస్త అలోచించి అడుగువేయమని హెచ్చరించేది మనసే ..
జన్మ సుకృతం , జన్మ ప్రారబ్దం ఇవి వాడుకభాషలో యాదృశ్చికమైన మాటగాతప్ప ,నిజానికి గడిచిపోయిన వర్తమానంలోని గతాన్ని నెమరువేసుకోగలడుకానీనే , మరుక్షణం ఏది ఎలా జరుగుతుందొ ఊహకందని ఒక సామాన్యుడు , గత జన్మను , కలుగబోవు జన్మ పరిణామాన్ని గ్రహించటం కొన్ని భయాలతో, కొంత అసంతృప్తితోనే బ్రతుకు తెల్లారిపోతూంటుంది ..
జన్మ సుకృతం , జన్మ ప్రారబ్దం ఇవి వాడుకభాషలో యాదృశ్చికమైన మాటగాతప్ప ,నిజానికి గడిచిపోయిన వర్తమానంలోని గతాన్ని నెమరువేసుకోగలడుకానీ , మరుక్షణం ఏది ఎలా జరుగుతుందొ ఊహకందని ఒక సామాన్యుడు , గత జన్మను , కలుగబోవు జన్మ పరిణామాన్ని గ్రహించటం ఎవరిఊహకూ అందని విషయమే …
పూటగడవనివాడిని చేరదీసి , రెండుపూటలా కడుపునింపినా , కోట్లకు పడగెత్తి పదితరాలకు కూడబెట్టినవాడికైనా ఏదో సమస్యతో మనసుతల్లడిల్లుతూ అసంతృప్తి తొంగిచూస్తూనే వుంటుంది ….
అసంతృప్తిని , తృప్తితో జయించే మార్గంలో అడుగుపెట్టి , అవగాహానకుదిరేవరకు , దావాగ్నిలా అసంతృప్తితో ఆలోచనలు రగులుతూనే ఉంటాయి ..
జీవితమంతా సుఖంగా గడిచిపోవాలని ఒక సామాన్యుడికి కోరిక .. జన్మను తరింపచేసుకొని , మోక్షం పొందాలని ఒక సన్యాసికి కొరిక .. రెండు ప్రయత్నాలు ఫలించాలని , ఆధారపడేది సృష్టికి ఆధారమైన మూలంపైనే …
పుట్టడం , పోవడం మనిషితోబాటు ప్రతి జీవికి తప్పదు .వెనకా , ముందూ జన్మలగూర్చి , జన్మ ప్రారబ్ధాలగూర్చి ,ప్రస్థాపనకుతెచ్చేది మనసే , తృప్తినినిచ్చే మార్గాన్ని ఆశ్రయించి యోగ్యతపొందగలిగేది మనసునరేగే ఆలోచనలవల్లనే ..
జన్మపరంపరలు ఉన్నవో , లేవోకానీ కలిగినంతవరకూ తృప్తితో ప్రశాంతంగా గడపటం మనిషికి ఓ వరంలాంటిది ..
ఒక సద్గ్రంథాన్ని చదివి అర్థంచేసుకొన్నా , ఒక సద్గురును ఆశ్రయించి సద్బోధలను అనుసరించినా ముందూ వెనకటి జన్మలకన్నా , ఈ జన్మకు నిర్ధేశింపబడిన కర్తవ్యమేదో బోధపడినవాడికి ఎన్నడూ అసంతృప్తి అన్నది ఆలోచనతో మెదలవు అని పెద్దలమాట ..
శ్రీ సాయి చరణార్పణమస్తు
Latest Miracles:
- దైవానుగ్రహము
- ఎవరివో? నీవెవరివో? .. …. మహనీయులు – 2020… డిసెంబరు 21
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – నాల్గవ భాగం
- సాయి సేవకే నా పూర్తి జీవితం …..!
- మానవ జన్మ…. మహనీయులు – 2020… ఆగస్టు 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments