Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Author : Kota Prakasam garu
నమ్మకంలేని ఆరాధనలు వ్యర్థం విశ్వాసంలేని గురుసేవా వ్యర్థమే.
**
ఏవయసుకుతగ్గ ముచ్చట ఆ వయసులొ జరగాలి , వయసుతగ్గట్టు ప్రవర్తనా ఉండాలి అంటారు ..
అభంశుభం , ఆరమరకలులేని ఐదేండ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం జరిగితె , వేరేవ్యాపకాలులేని ఆ వయసులో దిద్దిoచిన అక్షరాలు శరీరం రూపుమాసిపోయేంతవరకు గుర్తుండిపోతాయి ..
పెద్దచదువులతో పాటు , అవగాహనతో బ్రతుకుతెరువుకోసం ఉద్యొగం , సంపాదన వేట మొదలౌతుంది ..
సంపాదనతో సంసారాన్ని పోషించగలడనే నమ్మకంకలిగాక , వివాహం చేసుకొనే యోగ్యతోస్తుంది ..
క్రమంగా పెరిగె సంసారంపట్ల జీవితానుబవం మొదలౌతుంది ..
సంసారబాధ్యతలు దాటి , విశ్రాంతి కోరుకొనే సమయానికి శరీర రుగ్మతలు కలవరపరుస్తుంటాయి …
ఎప్పటికప్పుడు జరిగేదంతా నిజమనిపించినా , వయసుమీరి చింతన మొదలయితే కరిగిపోయినకాలమంతా ఒక కలలా జీవితమే ఒక పెద్ద నాటకంగా అనిపిస్తుంది ..
ఒకవయసులో అమ్మ ఆధారమున్నా ,సంసారంలో బార్య సహకారమున్నా , మద్యలో ఉత్పన్నమయ్యే వొడుదుడుకులే ఎప్పటికపుడు మనిషి మనసుకు తీరని సమస్యలుగా పట్టిపీడిస్తుంటాయి ..
కొన్ని సమస్యలు టీకప్పులొ తుఫానులా సమసిపోతూంటాయి .. కొన్ని గతాన్ని గుర్తుచేసి పట్టిపీడిస్తూనేఉంటాయి ..
మనిషికి తల్లి , భార్యా , బిడ్డా , ఉద్యోగాలు జీవితానికి ఆధారమైనట్టు , మనసుకు ఒక వ్యాపకాన్నిచ్చే ఆలంబనలేక , మానశిక ఉన్నతికి మార్గం కరువే ..
చావు , పుట్టుకలమధ్య జరిగేదంతా జీవితానికొ అనుభవం ..
చావును జయించేమార్గానికి అక్షరాలుదిద్దిoచి , పాటాలు నేర్పి మనసుకు పదునుపెట్టి , యోగ్యతనందించేది ఆద్యాత్మిక చింతన ..
సంసారంపట్ల , సమాజంపట్ల ఒక అవగాహన కుదిరితే , జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ..
మొదట దేవుడంటే ఒక నమ్మకం , ఉనికినిగుర్తించి , విశ్వాసంతోపాటు సద్గ్రంధాలపట్ల అవగాహనకుదిరితే భక్తి అనే నావ కడకంటా తోడుండి , తీరానికి చేరుస్తుంది ..
అమ్మలేక జన్మలు ఉండవు .. సద్గురువును ఆశ్రయించక జ్ఞానం ఉదయించదు ..
ఒకటి శరీరానికి మూలమయితే , మరొకటి జన్మతరింపుకు మూలమైంది అమ్మను అభిమానించేభాగంలో సగమైనా గురువాక్యాలపై విశ్వాసముంచి పాటించినవాడికి జన్మాన్తర సుఖాలకు లోటువుండదని ఆర్యులు అందించినమాట ..
సద్గురు పాదార్పణమస్తు
***
Latest Miracles:
- శాస్త్ర జ్ఞానం…. మహనీయులు – 2020… జూన్ 14
- కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము
- బాబా గారు నా అనారోగ్య సమస్యని స్వయంగా బాగుచేసిన లీల
- షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 2 వ బాగం
- అమెరికా నుండి ఒక సాయి భక్తురాలు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments