Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే , అయ్యయో జెబులు కాళీ ఆయనే …..
ఎవరు ఆడమన్నారు , ఓడి ఎవరు ఏడవమన్నారు ..అంతా స్వయంకృతాపరాధమే ..చేతులు కాలాకైనా , మనిషి తన బలహీనతని గుర్తిర్తే , పస్చాత్తాపంతో రెండోసారి ఆ తప్పును చెయకుండా ఉండగలడు ..
చేసిన తప్పునే , మళ్లీమళ్లీ చేస్తూ ఆడిన ప్రతిసారి ఓడుతూ , ప్రారబ్దమంటూ పైవాడిని ఆడిపోసుకొంటే అదే నిజమయిన ప్రారబ్దమేమో అనిపిస్తుంది ..
పుట్టుకతో ప్రతివారి హృదయం నిష్కల్మషమె ..
ఉన్న 64 కళల్లో కొన్ని ఆకర్శించి , ఒంటబట్టినవే ఆయావ్యక్తుల సంస్కారలకు మూలం అని అంటారు ..
ఎందరో ఒస్తూ పోతూ ఉంటారు ఇంటికి .. అందులొ చాకిరీచేసే పనివాళ్ళు మొదలూ , అనుకోని అతిధులమొదలూ బంధుమిత్రులూ కూడా ఉండొచ్చు ..
పెట్టినచోట పెట్టిన వొస్తువు కనబడకపోతే , వెతికివేసారి చివరకి అనుమానించేది మొదట ఇంటిలో చాకిరీకి కుదిరిన , అర్భకులైన పనివాళ్లనే ..
దరిద్రుడినైనా , ధనవంతుడినైనా ప్రలోభపెట్టెవి ఆకర్షణలు , అవసరాలు ఒక్కటే ..
వొచ్చినవాడు , అటూఇటూ ఎవరూ గమనించడంలేదని ఒకమంచి విలువగలవొస్తువును టక్కున జేబులొ వేసుకున్నా , పనివాళ్లను అనుమానించినట్టు వొచ్చిన పెద్దమనిషిని ఒక్కసారిగా సభ్యతలేకుండా నిర్దారించలేం ..
అవకాశం ఒచ్చి , పెడబుద్ధి పక్కదోవపట్టి , బలహీనక్షణాల్లో ఒక తప్పుచేసినా , పట్టుబడలేదని , వొచ్చిన ప్రతిసారి అదేపనికి పూనుకొంటే , ఒకనాటికి అది బయటపడి , అవమానానికి, తగిన శిక్షకు గురికాకతప్పదు ..
” సృష్టిలో లోపంలేదు , చూసే దృష్టిలొ తప్ప” అంటారు ..సృష్టి క్రమానికి సృష్టికి మూలమైనవాడు కారణం ..అంధుకే పైవాడి నిర్ధేశానుసారం అది అనాదిగా తన విదిని క్రమంతప్పకుండా నెరవేరుస్తుంది ..
ఆ క్రమంలో ప్రకృతి ఓభాగం , ఆప్రకృతిలో అన్ని జీవులతోబాటు మనిషీ ఓ బాగం ..మనిషితప్ప , చరాచరజీవులంతా సృష్టిలో నిర్ధేశింపబడిన కార్యానికే కట్టుబడివుంటున్నాయి ..
ధర్మానికి కట్టుబడినా , దొంగతనానికి అలవాటుపడిన , ఉన్న కళలలో మనిషి తను ఎంచుకున్న ప్రయత్నాన్నిబట్టే ఆధారపడి ఉంటుంది ..
ఒక మాట దుష్ప్రావంతో మనిషి నైతికంగా దిగజారేందుకు, మంచుకొండపైనుండి జారినంత సులవుగా మనసుపై ప్రభావితమయేందుకు కొన్ని సెకన్లకాలం చాలు …
అదే ఒక మంచిమాటతో , మనసుకుపట్టిన జడంతొలగి, ఉత్తమసంస్కారాలు అలవడేందుకు , ఎగబాకి ఎంతో కష్టంతో మంచుకొండనెక్కినంత సాధనతోనే సాధ్యమంటారు …
ప్రకృతి ఆదారంలేక మనిషికి , మరే యితరజీవరాశికి మనుగడలేదు.
ప్రకృతికి మూలమైనదేదొ , వెనక ఆడించె ఆధారమేదో గుర్తిస్తే , ప్రకృతిలో తనవొంతు బాద్యతను మనిషి గుర్తించగలడు , నివురుగప్పిన నీడలా వెంటాడే మాయను జయించే సద్గురు బోధలను వొంటబట్టించుకొని ఉత్తమ సంస్కారాలతొ జన్మ సాఫల్యాన్ని పొందగలరని పెద్దలమాట
ఆటలు , పాటలు మనిషికి విరామంలో ఆహ్లాదాన్నిస్తాయి .. కానీ ఏ ఆట , ఏ పాట మనిషికీ అధోగతినిస్తాయో , పురోగతినిస్తాయో అది అదుపుచేసుకొనే మనిషి ప్రయత్నంతోనె సాద్యం అని ఆర్యుల నోట అనాదిగా వినిపిస్తున్నమాట ..
జయ్ గురుదేవ సాయి సమర్థ
****
Latest Miracles:
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- సద్గురు సాయినాథుని కృపాజల్లులు. ఎన్. రాజ్యలక్ష్మి ,హైదరాబాద్
- సద్గురు సాయినాథుని సాక్షాత్కారం, యోగయ్య, కోట, నెల్లూరు జిల్లా.
- చతుష్పాదులు – ఉత్తమ గతులు…..సాయి@366 అక్టోబర్ 8….Audio
- బాబా అని ముందు పిలిచింది ఎవరు (2వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments