Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
నమ్మూ , నమ్మకపో , కానీ ప్రతిక్షణం మనసునుమోసంచేసుకొంటూ ,నటిస్తే అది అదోగతికి మార్గమౌతుంది
***
దెవుడున్నాడా , లేడా అంటూ పనీబాటలేకుండా అప్పుడప్పుడు కొన్ని టీవీఛానెల్స్ వాళ్ళు అతి ఉత్సాహంగా చర్చలుపెటుతుంటారు .అంతకన్నా రెచ్చిపోతుంటారు ఆ చర్చల్లో పాల్గొనేవాళ్ళు ..
ఉన్నాడా , పొనీ లేడా , ఎవరూ ఎటూ తేల్చలేక ఓ గంటసేపు చర్చించుకొని , అరుచుకొని గొంతెండిపోయి , రెండు గ్లాసులు నీళ్ళుతాగి , ప్రపంచానికి ఏదో దివ్యసందేశాన్ని ఇచ్చినట్టు తెగ ఆనందపడిపోతూ ఎవరిదోవనవాళ్లు పొతుంటారు …
అయినా ఆలయాలు చర్చిలు , మసీదులు మాత్రం భక్తులతొ యధావిధిగా కళకళలాడుతూ ఎప్పటికపుడు నిర్విఘ్నoగా గడిపోతూంటాయి ..
వాదించి , వాదించి కంటసోష , నవ్వులపాలౌవడంతప్ప , జీర్ణించుకొనిపోయిన వ్యవస్థలో , పాతుకుపోయిన విశ్వాసాన్ని ఒక్కసారిగా వొదలగొట్టడానికి, దేవుడు మరొ అవతారమెత్తినా సాధ్యంకాకపోవొచ్చునేమో …
లక్షల సంవత్సరాల సృష్టిగతానికి , ధర్మoతోబాటు అధర్మం కూడా చెలరేగింది ..
అధర్మం , రాక్షసత్వంగా హెచ్చుమీరి , ధర్మాచరణకు హాని కలిగిన సమయంలొ , సాత్వికులను రక్షించి , దుష్టగుణాలను శిక్షించేందుకు అనేక అవతారాలు ఆయాకాలాల్లో ఉద్భవించాయి ..
సత్వగుణ వృద్దికి , ధర్మాచరణకు అణుగుణంగా అనేక సద్గ్రంథాలు జనచైతన్యానికి అందించబడ్డాయి ..
అందుకు తగ్గ ఆచారాలు సంప్రదాయాన్ని నేర్పే మహాత్ములు ప్రకటమయ్యారు ..
ఆచారాలు , సాంప్రదాయాలను గౌరవించి , ఆదరిస్తే మనిషి జీవనవిధానం కుంటుబడకుండా ఒక క్రమశిక్షణను తీర్చిదిద్దుతాయి ..
ఇటీవల కాలంలొ , వెనకటి సంగతినివొదిలి , ఎన్నో కోట్లమంది సద్గురువుగా నమ్మి ఆరాధిస్తున్న వారికి ఉత్తమ ఫలితాలను అందిస్తున్న సాయి తత్వాన్ని హేళనచేస్తూ , అసలు బాబా దేవుడేనా అని కొన్ని నెలలపాటు భక్తుల మనోభావాలను కించపరుస్తూ ప్రచారాలు చేశారు ..
ఒక ధర్మంపట్ల , ఒక పారాయణపట్ల సరిఅయిన అవగాహన , పట్టు దొరకనంతవరకూ ఇలాంటి అజ్ఞానపు చర్చలు ఆందోళనరేపుతూనే ఉంటాయి .
కొన్ని సంఘటనలు నేరుగా కంటితొ చూడకపొయినా , స్వయంగా వినకపోయినా , వాస్తవ విరుద్ధాలుకూడా ఆనోటా ఈనోటా సోకి చివరకది వాస్తవమేనంటూ చిత్రీకరించబడుతూ ఉంటాయి ..
ఇలాంటి నిరూపణలేని అవాస్తవ ఊహాగానాలతో పచ్చటి సంసారాలూ కూలిపోయినవి వున్నాయి ..బరించలేక ప్రాణాలు బలికొన్నవి ఉన్నాయి ..
విశ్వాసాలకు విఘాతం కలిగించినవి ఉన్నాయి ..అన్నింటికీ మూలం ఆలొచిస్తే , అవగాహన లోపమే అనిపిస్తుంది ..
అనుభవంలేని సామాన్య చక్షువులకు గోచరించని దేవుడు , మనో నేత్రంతో సాద్యం చేసుకొన్నవాడి అనుభవాన్ని , నిజమా కాదా అని శంకించవొచ్చు .. ఆ సాధనలో అవగాహనతో పరిపక్వత సాధించుకునే యోగ్యత వరించినప్పుడు , అనుమానం అన్నది అగ్నికి ఆహుతైపోగలదు ..
ఆకారాలు మనోవికారాలను తొలిగేవరకే .. ఆకారాలు అందించిన దర్మం మనసుకు ఒంటపడితే , ఆకారానికి దూరమైనా మనసుకు వికారాలుమాత్రం ఉదయించవనేది అనుభవజ్ఞులమాట
దెవుడున్నాడా , ఉంటె పలుకుతాడా అన్నప్రశ్న ఎంత కొనసాగినా చర్చలు మిగులుతాయితప్ప , ఉన్నానని దేవుడు రుజువువుచేసుకోను చర్చమధ్యలో ప్రత్యక్షంకాడు ..
రామాయణ , భగద్గీత మొదలు బాబా సచ్చరిత్రవరకూ మానవత్వానికి మసులుకొనే థర్మాన్ని అందించినవే ..
థర్మాన్ని ఆదరించి , సదాచారాన్ని పాటిస్తే ఆ అవగాహన , అనుభవం మనసుకందుతుంది ..
మనిషిని గుర్తించడం తేలిక .. అనుభూతి ప్రక్కవాడికిలేక , స్వానుభూతిని చెప్పిఒప్పించడం దుర్లభమే .
” నీకు పెట్టడం యిష్టంలేకపోతే మానెయ్ పర్లేదు , కానీ కసిరికొట్టడం ఎందుకు ” అన్నారు సాయి ..
నమ్మి విశ్వాశంతో గట్టెక్కేవారు కోకోల్లలున్నారు .. నమ్మక వాదాలతొ జేవీతాలు ముగిసినవాళ్లు ఎందరో ఉండొచ్చు .. ఒక నమ్మకం జీవనశైలిని తీర్చిదిద్ది , మనసుకు ప్రశాంతనిస్తుంది
ఉన్నవి లేనట్లు కథనాలు అల్లుతూ మనసును మోసంచేసుకొన్నవాడికి ఆ మనసే వాడిని యమపాశంలా పట్టిపీడిస్తూనేవుంటుందని పెద్దలమాట ..
శ్రీ సాయి చరణార్పణమస్తు
***
Latest Miracles:
- ‘‘ఈ చేతుల్ని చూసిన గుర్తుందా నీకు?’’
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- ‘‘సద్గుణానికీ దాసగుణానికీ దేవుడు లొంగిపోతాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments