Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
అగ్గిపెట్టెతో అగ్నిని సృష్టించుకోడం ప్రతి రొజూ జరిగె ఒక తంతు ..
అది అగ్గిపెట్టెతోనే సాధ్యమెలా అవుతుంతో , అందుకువాడే రసాయనాలేమిటో తెలుసుకొనె ప్రయత్నం అన్వేషణలొ ఒక బాగం అనవొచ్చునేమో ..
ప్రతి రొజూ వంట గిన్నెలుమొదలూ , గ్రైండర్ల వరకూ నిత్యావసర వొస్తువులుగా వినియోగించడం ఒక యాంత్రికమైన చర్య ..
ఆ వొస్తువు వినియోగానికి పూర్వం,వొస్తువు తయారీవిధానంలో ఏఏ ముడిపదార్దాలతో,ఎన్ని అగచాట్లు ఎంతకాలంపడి అందించారో తెలుసుకునే ప్రయత్నం కూడా జ్ఞానంలో ఒక భాగమే …
మనిషి పుట్టి , వాడి పనులు వాడు చేసుకోగల అవగాహన కుదిరే వరకు కన్నతల్లి వాడికి ప్రెమతో వెట్టిచాకిరీ చేస్తుంది ..
కొంచెం ఊహ తెలిశాక అమ్మ చేసే చాకిరిని గురించి వాడు విన్నా , ఆ మాటలు చెవిదాకా సోకుతాయితప్ప , హృదయాన్ని పెద్దగా స్పందింపచేయవు ..
వాడికీ పెళ్లయి , పుట్టిన బిడ్డతో ప్రతి క్షణం బార్య పడే కష్టం గమనించటం వలన,గతంలో తనకు అమ్మ చేసిన చాకిరి అనుభవానికొస్తుంది ..
విత్తనాన్ని పూడ్చి , కాస్త నీటిని పొసి , ఫలాన్ని అనుభవించటం ఒక తంతుగా జరిగిపోతుంది , భూమి పొరల్లోనుండి విత్తనం చీల్చుకొని మొలక ఆవిర్భవించినట్టు , నవమాసాలు ,కొన్ని బాధలనుభవిస్తూ కడుపున బరువునుమోసి , ఒక శరీరానికి రూపమిచ్చేసమయంలో అమ్మ పడే కాన్పుకష్టాన్ని గమనిస్తె , అమ్మ విలువేమిటో , ఈ శరీరానికి ఎలా విలువ కట్టాలో స్పురిస్తుంది ..
” నా చరిత్ర నేనె వ్రాసుకొందును ” అన్నారు సాయి ..
ఆయన మాటలప్రకారం సచ్చరిత్ర కూడా బాబా ఆత్మకథే ..మనిషి తన భావాన్ని వ్యక్తపరచాలంటే మొదటిది నోటి మాటద్వారా , రెండవది కలం , కాగితాల సాయంతో రచనల ద్వారా ..
ఒక సాదాసీదా కథను రాయాలన్నా దానికో ఇతివృత్తం భావంలో మొదలవ్వాలి …
ఒక మహాత్ముని చరిత్ర రూపుదిద్దుకోవాలంటే , ఆ మహాత్ముని చర్యలూ, లీలతోపాటు , వారి దివ్యప్రబోధాలుకూడా భావానికి హత్తుకుని , ఆలోచనలో తదేకంగా ముడివేసుకోనిదే సాద్యంకాదు ..
బాబా అనుగ్రహంకావొచ్చు , భావస్ఫూర్తి బాబాతో మమేకమయి కావొచ్చు , ఆయన చేతిలో కలం బాబా ఆత్మకథకు మూలమైంది .. ఇందులొ నా ప్రమేయంఅంటూ ఏదీలెదు , ప్రతి అక్షరం బాబా పలికించినవే అని హేమాద్రిపంతు వినయంగా వ్యక్తీకరించినమాట ..
హేమాద్రిపంతు స్వయంగా బాబా సన్నిధిని అనుభవించి , స్వానుభూతిని అక్షరరూపంలొ లోకానికి అందించారు ..
సచ్చరిత్రను ఒక కథలా కాకుండా , ప్రతిఫలాపేక్షలేక , పారాయణ మొదలయితే , ప్రతి మనసూ హేమాద్రిపంతు స్వానుభూతితో మమేకమై , సాయి నిజసన్నిథి అనుభవానికి రాగలదని నా భావన ..
శ్రీ గురుభ్యోనమః
**
Latest Miracles:
- అన్నదాన మహిమ
- సాయి స్మరణ – అనారోగ్య హరణం
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నా భక్తులకు ఏ కష్టం రానివ్వను
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments