ఆశ్రయించి ఆరాధించే గురువైనా , దైవం పైనైనా ముందు విశ్వాసం మొదలవ్వాలి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

నేను , నాది అన్న అహంకారానికి పతనం నీడలా కాచుకొనేఉంటుంది.యదార్ధాన్ని గ్రహించిన మనసు కాలనిర్ణయానికి కట్టుబడేఉంటుంది.

****

అమృతం తాగిన దేవతాగణానికి చావు భయమేలేందంటారు ..

అంతటి దేవతలుకూడా , మూఢభక్తితో కఠోర తపస్సుతో శివ , బ్రహ్మాదులను మెప్పించి వరాలుపొందిన రాక్షసులు , ముల్లోకాలపై దండయాత్ర చేసినప్పుడు , చావు భయంతో పరాశక్తిని శరణువేడారని దేవీభాగవతం చెబుతుంది …

అమృతం తాగిన దేవతలకు సైతం , బలమైన ప్రత్యర్థిని చూసి చావుకు భయపడకా తప్పలేదు ..

నిష్ఠతో అంత తపస్సు చేసి ,అదే దేవతలను మెప్పించి ,మృత్యువులేకుండా వరాలుపొందిన రాక్షసులకుకూడా , అహంకారంతో పెట్రేగి చివరకు మృత్యువాత పడకా తప్పలేదు ..

భక్తి కుదరాలంటే జ్ఞానం కలగాలి ..

ఆశ్రయించి , ఆరాధించే గురువైనా , దైవం పైనైనా ముందు విశ్వాసం మొదలవ్వాలి ..

అంతవరకూ విభూధిరేఖలుధరించినా , పట్టెడు కుంకుమ నుదుటపెట్టినా , అలంకార విద్యార్థిలా లోకానికి భక్తుడనే భ్రమను కలిగించడంతప్ప , అంతటితో మనసుకు పట్టిన మాలిన్యాలు ఒక్కసారిగా తొలగడం అసాధ్యమే అని ఆర్యులంటారు ..

వ్యాధి ముదిరి , చావుభయంతో దిక్కుతోచనప్పుడు , ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవతున్నప్పుడు , సాధిచలేనివి సాధించాలన్న తాపత్రయం పెరిగినప్పుడు ఎక్కువగా గుర్తుకొచ్చేది ఒక్క భగవంతుడే ..

తీరితే దేవుడు కరుణామయుడoటారు .. సమస్యజఠిలమైతే , జన్మ ప్రారబ్ధం అనుకోడం లోకoలో అనాదిగా వినిపించే ఒక ఆచారం ..

విశ్వాసమైన భక్తికి , అవగాహన తోడౌతుంటారు ..

అవగాహన మొదలయితే సహజమైన చావు ,పుట్టుకల మధ్య కర్తవ్యం బోధపడుతుంది ..

మాసిన వస్త్రాన్ని వొదలి నూతనవస్త్రాన్ని ధరించినట్టు , మోక్షార్హతను పొందేవరకూ , నశించిన శరీరం మళ్లీ , మళ్లీ చావు , పుట్టుకలను అనుభవిస్తూనే ఉంటుందని భగద్గీతలోని పరమాత్ముడు అందించిన బోధలపై అవగాహన కుదురుతుంది .

కొలిచే విధానంలో విశ్వాసం మొదలయితే , జరిగినవి , జరుగుతున్న వాటిపై మనసుపోక , హృదయం ఆత్మస్థైర్యంతో భక్త మహాల్సాలాంటి భక్తుల్లా తమకు నిర్ధేశింపడిన కర్తవ్యాన్ని నెరవేర్చుకోడంలోనే మనసును లగ్నం చేస్తారు.

నేను , నాదన్న అహంకారం ఉన్నచోట పతనంకూడా నీడలా కాచుకొనేవుంటుంది.

మనో నియమాలకు కట్టుబడి , మనసునులగ్నంచేసి , ఉన్నయదార్ధాన్ని అవగాహనచేసుకొని , కాలనిర్ణయానికి తలవొంచినవాడు , ఏ భయానికి ,ఏ మృత్యునీడకూ చలించడు ..

అవగాహన కుదరనంతవరకు మనసు సూర్యుడిని ఆవహించిన దట్టమైన మేఘంలా అజ్ఞానం ఆవహించి ఉంటుంది ..

అవగాహనతో యదార్ధానికి దగ్గరైన మనసు వేపచెట్టుచేదులోకూడా అమృతాన్ని చవిచూడగలదని పెద్దలమాట ..

జై గురుదేవ సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles