Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
నిజముగ ఆ పటము నుండి ఏమోయీ అంటే నిలువగలర సాయీ ,ఓపగలరా సాయీ ..
***
ఒక అందమైన ఇంటిని నిర్మించుకొని, అన్ని సౌకర్యారాలతో అనుభవించాలనే ఆశ అందరికి ఉండొచ్చు .
కానీ ఆ ఆశ సాకారమయ్యేది మాత్రం ప్రణాళికాబద్ధంగా , అధిక సౌకర్యాలను అదుపుచేసుకొని , కూడబెట్టుకున్న ఏ కొందరికో ..
ఆకట్టుకొనే వొస్తువులెన్నో అంగడిలో ఆకర్షిస్తుంటాయి .. అమ్మేవాడి దృష్టి వ్యాపారంమీద , కొనేవాడి దృష్టి ఆ వొస్తువును పొందాలనే తాపత్రయం మీద ఉంటుంది ..రెంటికి నడుమా ఉన్నదీ ఆర్థిక లావాదేవీలే ..
ఉన్నవాడు కొని అనుభవించడానికి పెద్దగా ఆలోచించడు .. లేనివాడు ఆ ఒస్తువును పొందాలనే ఆశ సాకారమయేందుకు అనేకపాట్లు పడందే , వాడి ఆశయం సిద్ధించదు ..
ఉన్నవాడితో పోటీపడితే , లేనివాడికి మిగిలేది నిరాశా , నిస్పృహలే ..
ఒక సామాన్యుడు అపరకుబేరుడుగా ఎదిగినవాడుంటాడు ..వాడిలా ఒక్కసారిగా ఎదగాలని సామాన్యుడు పోటీపడం దురాశ , అదే ఈర్ష అసూయలకు దారితీయవొచ్చు ..
లేకున్నా , ఉన్నట్లుగా నటించడం అనుకరణ ..
ఉన్నదేదో తెలుసుకుని , ఆ నియమానికి మనసును మలుచుకోడం అనుసరణ అంటారు ..
పుట్టకు వెళ్లి పూజిస్తే నాగేంద్రుడి అనుగ్రహంతో శుభాలు సిద్ధిస్తాయనేది ఒక నమ్మకం ..ఆ విశ్వాసానికి తగినట్టు పుట్టలోనుండి పడగవిప్పి పాము ప్రత్యక్షమైతే , విశ్వాసం గాలికెగిరి భయంతో వణుకుమొదలై పారిపోవలసివొస్తుంది ..
ఎంత ఎదిగినవారికి కూడా దేహాభిమానం ఒకటి వెంటాడుతూనేఉంది ..
దేహాభిమానం ఉన్నంతవరకు ఆరని ఆశలూ తప్పవు , ఊహించని పరిణామాలకు ఉలిక్కిపడుతూ నీడలా వెంటాడే భయమూ తప్పదు ..
దేవుడున్నాడనేది కూడా ఒక విస్వాసం ..
నమ్మకంతో అనుసరిస్తే పూర్వదురాచారస్థానంలో సదాచారo మొదలౌతుంది ..
మొదట మనసు నిలకడకావడమే ఒక అనుభవం ..
ఉన్నదేదో తెలుసుకుని , ఆచరించడం వలన అది ఆత్మానుభూతినిస్తుంది ..
భగవద్గీతను అందించింది , లోకం ఆదరించి తరించాలనే ..
సచ్చరిత్రలొ చెప్పింది కూడా ఆదరించి అనుసరించినవారివెంట నేనుంటాఅనే.
మాయ వదలనిధే శరీర భ్రమ నశించదు .. మాయ నన్నునూ వొదలకున్నది అన్నారు సాయి ..
తత్వసారం వొంటబడతే క్రమంగా హృదయనైర్మల్యాలు వైదొలిగి , మనసు ఆత్మానుభూతికి లోనౌతుంది .. ఆవరించిన మాయా సన్నగిల్లుతుంది ..శరీరభ్రమలూ మేఘంలా కరిగిపోగలవు ..
అంతవరకూ భౌతికమైన దర్శనం కోరుకోడం అత్యాశే , అలా జరిగితే గుండె దిటువుచేసుకొని భరించడం అందరికీ కష్టమే అని పెద్దలమాట ..
శ్రీ సాయి గురుభ్యోనమః
**
Latest Miracles:
- అమ్మలా బాబా చూపిన ప్రేమ
- సాయీ భాగవతము…..సాయి@366 జూన్ 28….Audio
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 3 వ.భాగం
- ఒదుగుతూ ఎదగాలి …..సాయి@366 జనవరి 24….Audio
- మాటే .. మంత్రం ….సాయి@366 సెప్టెంబర్ 13….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments