Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
మనసుకు దేనిని అందిస్తామో గతులుకూడా అలానె నిర్ణయింపబడుతాయి
***
“అన్నం పరబ్రహ్మ స్వరూపం ” అంటారు .. మనిషి మొదలూ సృష్టిలో ప్రతి జీవరాశికి ఆహారమే ప్రాణాధారం.
ప్రాంతాలనుబట్టి అది అన్నంకావొచ్చు గోధుమరొట్టెకావొచ్చు, కనీసం రెండుపూటలా కడుపునింపుకోనిదే శరీర వ్యవస్థ సహకరించక ,అది నిర్వీర్యమై పోతుంది ..
ఎంత ఆకలితో శోషించి పోయేవాడుకూడా కేవలం అన్నాన్ని ఒక్క ముద్ద తినాలంటే గొంతు దిగడం కష్టమే ..
అన్నానికి తగినట్టు , సాంబారు , కూరా , పచ్చడి ఇలా కనీసం ఎదో పదార్ధాన్ని కలపి భుజించకపోతే అది భోజనం అనిపించుకోదు , సరికదా ఉత్త అన్నాన్ని నాలుగుమెతుకులు కూడా తినడానికి ఎవరికీ సాద్యంకాకపోవొచ్చు …
మనసూ ఒక నిరాకార పదార్థమే ..
సృష్టికి ఆధారమైన శక్తికి ఒక ఆకారమంటూ లేని నిరాకారస్థితి అంటుంది వేదం ..
మనసుకూ ఒక రూపంలేదు , కానీ నిరాకారమైన శక్తి సృష్టికి మూలమైనట్టు , ప్రతి మనిషి జీవనావిధానానికి ఆధారమైంది అంతర్గతంగా , ఎవరికీ అంధక ఆడించే వారి , వారి మానసిక సంస్కారాలే ….
పుట్టి ,ఊహ తెలిసే వరకూ మనసు కూడా రుచిలేని అన్నంలాంటిదే ..
ఊహ ప్రారంభమైన మొదలూ మనోఅభిరుచులు దేనికి ప్రాధాన్యతనిస్తుందో , అభిరుచికి తగ్గట్టు వారి వ్యక్తిగత సంస్కారాలు అలానె తీర్చిదిద్దబడతాయంటారు ..
అన్నానికి కలుపుకొని తినె పధార్దాలు కారం , తీపి , వగరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొ రుచిని ఆస్వాదించినట్టు ,లోకం మంచి చెడుల మిశ్రమం అన్నది అనాదిగా చరిత్రలో వినబడుతున్నదే.
మనిషి ఒక ఉన్నతస్థాయికి ఎదగాలన్నా , దిగజారి చరిత్రహీనుడవ్వాలన్నా , మనసుకు వొంటబట్టించే సంస్కారాలె ప్రదాన పాత్రను పోషిస్తుంది ..
భోజనంలో షడ్రుచులు వొడ్డించినా , అధికరుచులకుపోక నాలుకను అదుపుచేసుకొంటే శరీరం రోగాలమయంకాకుండా , ఆరోగ్యంతో సహకరిస్తుంది ..
ఉత్తమమైన ఆలోచనలను మనసుకు అందిస్తే , అది ప్రలోబాలనే రుచులకు పోకుండా ఉత్తమగతిని అందించే శ్రేయోమార్గంలో నడకలు నేర్వగలదని పెద్దలంటారు ..
శ్రీ గురుదేవ సాయి సమర్థ
**
Latest Miracles:
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- పటానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోవద్దు–Audio
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- ఒకసారి శరణు వేడిన చాలును!…..సాయి@366 మే 6….Audio
- భిక్షుని రూపంలో అన్న ప్రసాదం స్వీకరించిన బాబా!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments