నిరంతర నామస్మరణ , సగం ప్రారబ్ధాలను హరింపచేయగలదు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

నిరంతర నామస్మరణ , సగం ప్రారబ్ధాలను హరింపచేయగలదు

————
శ్రీరామ నవమి శుభాకాంక్షలతో
——–

బాల్యానికి , వృద్యాప్యానికి మద్య వయసులో తీసుకొనే నిర్ణయాలు , అలవరుచుకునే సంస్కారాలే మనిషి అంతిమరోజుల్లో మానసిక నిలకడకు అద్దం పడతాయి .

విద్యావిధానంలో కూడా ఇదే కనబడుతుంది .. అక్షరాబ్యాసం మొదలూ పదవతరగతివరకూ చదివే చదువు సైన్సు , లెక్కలు , చరిత్రలు కలగాపులగంగా బోధించబడుతుంది .

విద్యార్థి అన్నిటిమీద మనసుపెట్టి చదివి , ఉత్తీర్ణత సాధించినా , అవగాహన మొదలయ్యే ఆ వయసులో , ఇంటరుమీడియెటులో విద్యార్థి ఆసక్తి ఏ రంగంవైపు మొగ్గుచూపుతుందో , ఆ ఎంచుకునే విధానమే , వాడి పైచదువుకు , వాడి ఉద్యోగ విషయాలకు ఉపకరిస్తాయి ..

పుట్టుకతో వొచ్చినవి పిడకలతోకానీ పోవని ఒక నాటుసామెత .. పుట్టగానె ఎవరి జీవితాలు నిర్ణయింపబడవు ..

బాల్యావస్థ మొదలు యుక్తవయసు ప్రారంభమయ్యేవరకు అవగాహన కుదరడం , ఫలానా అని నిర్ణయించుకోడం ఎవరికీ ఆ వయసులో సాద్యం కాకపోవొచ్చు ..

అవగాహన కుదిరే వయసులో ఇదా , అదా అని ఎంచుకొని ఇంటరులో అడుగుపెట్టి , పాసయ్యాక అదే డిగ్రీలో కూడా కొనసాగించవలసి వొస్తుందితప్ప , ఆర్ట్స్ చదివినవాడికి సైన్సులో సీటు ఇమ్మంటే కుదరదుపొమ్మంటారు ..

ఒక జీవితభాగస్వామిని ఎంచుకొనేవిషయంలో ఒకటి నాలుసార్లు విచారించి , అన్నీ సమ్మతమయ్యాక , తృప్తిగా ఉంటే సమ్మతం తెలుపుతుంటారు ..

వొచ్చే జీతాన్ని బట్టి , ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలో , ఎలా చేసుకొంటె కడవరకూ లోటులేకుండా జీవితం వెళ్ళబుచ్చవొచ్చో పధకాలు రచించుకొంటూ ఉంటారు ..

జీవితంమీద ఒక అవగాహన , గట్టి నిర్ణయాలు , ఒక నియమం లేకపోతే ,వేసే ప్రతి తప్పటడుగు పర్యవసానం వృధ్యాప్యంలో ప్రతిక్షణం క్షోభకు గురికావాల్సివొస్తుంది ..

భక్తిమార్గంలో అవగాహన మొదలయితే , జన్మ సంస్కారాలను అది శుభ్రపరుస్తుంది ..

భగవంతుడు అంటే కేవలం కోర్కెలుతీర్చే యంత్రంగా అర్థమైతే , మనసు కూడా ఆ వలయంలోనే ప్రదక్షిణచేస్తూ , ఆ ఆశయంతోనే ఆశ్రయిస్తూ ఉంటుంది ..

ప్రారబ్ధకర్మలన్నవి పూర్వాకృతంగా సంభవించేవి , అనుభవించక ఎంతటివాడికి వాటిని అనుభవించక తప్పదంటుంది శాస్త్రం ..

భక్తి బీజం అన్నది వారి , వారి సుకృతoకొద్దీ , ఏ వయసులో అయినాఅంకురించవొచ్చు ..

ఎప్పుడు మొదలయిందో ప్రధానంకాదు , ఎంత ఆశక్తి , అవగాహనహన కుదురుతుందో మనోనైజంకూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తుంది .. …

ఎవరు నా ఉనికిని , సదా నన్ను స్మరించుచుందురో , అట్టివారికి నేను దాసానుదాసుడను అన్నారు సాయి ..

జీవితం అంటేనె అది సుఖదుఃఖాల సమ్మేళనం ..

చేజేతుల చేసుకొనే కర్మలు కొన్నైతే , వొస్తూ జనాకు తోడుగా వొచ్చిన పూర్వప్రారబ్ధాలు కొన్ని వెంటాడుతూ ఉక్కిబిక్కరి చేస్తూ మనసుకు నిలకడలేకుండా చేయవొచ్చు ..

ఆ బలహీన పరిస్థితులనుండి తప్పించి , మనసుకు నిలకడను కూర్చగలిగేది నిరంతర మననం ఒక్కటే అని భగద్గీతలోనేకాక బాబా సచ్చరిత్రలో కూడా అందించిన సారం ఒక్కటే ..

కర్మ బలీయంగా ఉండవొచ్చుకానీ , ఆలోచనను శ్రద్దగా కొలిచే దైవం వైపు దృష్టిని సారించినపుడు , సాధనామార్గంలో సగం విజయాన్ని సాధిచినట్టే అని పెద్దలమాట …

జయ్ గురు సాయి సమర్థ

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles