Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ప్రయత్నం గట్టిగాలేక మనసుకు స్పందనలెక్కడ.
******
అనుకొన్నవేవీ జరగడంలేదని కుమిలిపోయేవాళ్లు కొందరు ..
ఆచారాలు మంటకలుస్తూ ,అనాచారం ప్రబలిపోతోందని గగ్గోలుపెట్టేవాళ్లు కొందరు ..
నందిని పందినిచేసి ఎదో విదంగా లోకాన్ని ఏమార్చి బతికిపోవాలని యుక్తికుయుక్తులు పన్నేవాళ్ళుకొందరు ,, ఉదయంలేస్తే ఎవరు దొరుకుతారా , తనలోని ప్రాభవాన్ని ఎవరు గుర్తించి ఆకాశానికి ఎత్తుతారా అని పడరానిపాట్లు పడేవాళ్ళు కొందరు ..
లోకం ఒక రంగస్థలం , విధాత సృష్టిలో లోపాన్ని ఎంచలేంకానీ , ఎంచుకున్న మార్గాలలో మనిషి , పంచుకొనే స్వభావాలు భిన్న పాత్రల్లో , భిన్న వ్యక్తిత్వాలతో తమ పాత్రలను పోషిస్తు, అందుకుఅనుగుణంగా ఫలితాలనుపొందుతుంటారు ..
పెళ్లి చేసుకోడం , పిల్లల్ని కనడం ఒక బ్రహ్మవిద్యకాదు , అనాదినుండి క్రమంతప్పకుండా జరగుతున్న తంతే అది .
ఆ బిడ్డలను పెంచి , తీర్చదిద్దడానికి కూడా తల్లితండ్రులకు కొంత సంస్కారం ఉండాలి ..
ఎన్నడూ అలగని ధర్మరాజుకు కోపంవొస్తే , ఆ ధాటికితాళలేక , సప్తసముద్రాలు ఉప్పొంగి , ప్రళయం వొచ్చినంత పనౌతుందట ..
అలా బిడ్డలకు పెంచే క్రమంలోకూడా అయినదానికి , కానిదానికి చీటికిమాటికి కసురుకొంటూ , విసుక్కొంటూ కోపాలు ప్రదర్శిస్తూ , అదేదో క్రమశిక్షణ అనుకొంటే , వాడికది ప్రతి రోజూ విని విని దినవారీ చర్యలో అదో భాగమైపోతుంది తప్ప , ఏమాత్రం చలనం ఉండదు …
పురాణాలు , ఆద్యాత్మిక గ్రంధాలుకూడా మనిషి మౌడ్యాన్ని తొలగించి , ఉన్నత సిద్ధికోసం అందించబడ్డవే …
బాబాలాంటి సద్గురువులైనా , అవతారాల పరంపరలు కూడా మనిషికి ధర్మాధర్మ విచక్షణను అందించి , ఎవరి పాత్రని వారు సృష్టిధర్మానికి అణుగుణంగా నెరవేర్చుకునే మార్గాన్ని ప్రభోధించేవే ..
ఒక సద్గురువు ప్రబోధాలలోకాని సద్గ్రంధాలలో అందించబడిన హితవాక్యాలలోకాని , చదవడం , వినడం వలన స్వప్రయోజనాలు నెరవేరగలవని ప్రచారాల చేసేవారు కొందరు , చదివిన , విన్న మంచివిషయాలను పదేపదే మననం వలన , సామూహిక సత్సంగాలవలన బోధలలోని ఆంతర్యాలు మనసుకు ప్రబోధించబడతాయి అని కొందరంటారు ..
సచ్చరిత్రలో సయితం “”బాబా పలుకులు ఎప్పుడూ బావగర్భితంగా ఉండెడివి “” అని చెప్పబడింది ….
ఎవరి ఆసక్తినిబట్టి వారి మనసు వికాసం చెందుతూంటుంది ..
ఎంత పరిమితికి మించి ఆలోచించినా , ఎవరి అనుభవాన్నిబట్టి ఒకే విషయంలోనే అనేక అంతరార్ధాలు గోచరిస్తుంటాయి ..
అందించబడిన విషయం ఒకటే అయినా , విశ్లేషణలు మాత్రం సమభావంతో కనిపించవు ..
ప్రతి నిత్యం నేను పంపే సందేశాలుకూడా నా భావ పరిమితికి లోబడినవే ..
ఒక గురువాక్యమైనా , సద్గ్రంథపారాయనైనా , అంతరార్ధమెరిగి , ఆచరణమొదలైతే అందుకు తగ్గ ఫలితాలు నీడలా వెంటాడగలవని నా భావం.. విత్తనం నాటనిదే , ఒక మహావృక్షానికి కూడా ఉనికే ఉండదు ..
బాబాను దర్శించుకోండి , ఒక్కసారి పారాయణచేయండి మీరనుకొన్నవన్నీ తీరిపోతాయని కొందరు ప్రచారం చేస్తుంటారు ..
ఆయన అందించిన ప్రబోధాలను కనీసం ఆచరించే ప్రయత్నంకానిదే , ప్రకటమై , లోకంనుండి ఆయన ఆశించిన ఫలితానికి చేరువై , ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకోలేమని నా పరిమితమయిన బుద్ధికి అందే భావం ..
ఎవరి భావాలనుబట్టి వారికవి సిద్ధించవొచ్చు , కానీ ప్రయత్నం లేకుండా పరమార్ధం చేకూరదని నా భావనలో నాకు కలిగే ఆలోచన …
జయ్ సద్గురుదేవా
*****
Latest Miracles:
- తాతకు తగ్గ మనుమరాలు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 8
- నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు
- కాలదర్పదమనాయ నమః …..సాయి@366 మే 30….Audio
- అంతిమ అంతరార్థ చర్య …..సాయి@366 జూన్ 2…Audio
- ‘‘లే బాబా లే! గద్దె మీద నుంచి లే’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments