Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
1926 ప్రాంతములో బాబా పుణ్యతిధికి నేను నా భార్యను, రెండు సంవత్సరాల మా పెద్దబ్బాయి మనోహర్ ని వెంట పెట్టుకొని షిర్డీ కి వెళ్ళాను .
పుణ్యతిధి ముగిసినతర్వాత బాబాజాన్ ను దర్శించడానికి పూణే బయలుదేరాను.
పూణే స్టేషన్ నుండి లష్కర్ వెళ్లి బాబాజాన్ చూసి రావడానికి రెండు రూపాయిలు సరిపోతాయి అనుకుని నా లోపలి జేబులో 2 రూ|| ప్రత్యేకించి విడిగా పెట్టాను.
నేను ఖర్చుల కోసమని డబ్బు ఆలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి.
పూణే లో దిగి లష్కర్ కు రానుపోను రూపాయి ఎనిమిది అనాలకు విక్టోరియా (టాంగా) మాట్లాడుకుని లష్కర్ వెళ్ళాను.
బాబాజాన్ కు సమర్పించడానికి 4 లేక 6 అనాలకు పూలమాల కొన్నాను.
అక్కడ పకీర్లకు టీ, రొట్టెలుకు గాను రూపాయి నాలుగణాలు దానము చేశాను .
తిరిగి పూణే స్టేషన్ కి వచ్చి టాంగా వానికి రూపాయి ఎనిమిది అణాలు ఇచ్చి రైల్ లో కూర్చున్నాను.
యధాలాపంగా లోపలి జేబులో చేయ పెట్టాను.
నేను ప్రతేకించి పెట్టిన రెండు రూపాయిలు అలాగే ఉన్నాయి.
అమితాశ్చర్యానికి లోనూఅయ్యాను.
టాంగాకు, పూలకు పకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు.
లష్కరకు వెళ్లి తిరిగి వచ్చేంత వరుకు అయన ఖర్చులన్నీ లోపలి జేబునుండే తీసి ఖర్చుపెట్టాను.
వేరే జేబులో నోట్లు ఉన్నాయి కానీ వాటిని తాకలేదు.
అయినా ఖర్చులు లెక్కించి చుస్తే మూడు రూపాయిల పైచిలుకు ఖర్చుఅయింది.
ఆలా నా జేబులో ఉన్న రెండు రూపాయిలు అంత మొత్తముగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశర్యం వేసింది.
శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్ ,
పోలీస్ ఇన్స్పెక్టర్, ముంబయి.
తరువాతి భాగము.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1
- మా పాపకు గురువుగారి దర్శనం అయినప్పటి నుండి అన్నీ తాను అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయి. – Audio
- ఆ డాక్టర్ ఆశ్చర్యముగా రెండు రోజుల్లోనే కూర్చోవడము, అటు ఇటు చూడడము చేయకలిగింది.—Audio
- సమయానికి జేబులో 200 రూపాయిలు చూసి ఆశ్చర్యం అనిపించింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “పెట్టిన రెండు రూపాయిలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనూఅయ్యాను.”
kishore Babu
May 27, 2017 at 10:14 pmనాకుకూడా ఇటువంటి అనుభవం కలిగింది. ఈ కింది లింక్ క్లిక్ చేసి చదవండి.
http://saileelas.com/telugu/?p=5998