“బాబా” అని అనగానే బావిలో పడిన బాలుని ఒడ్డున దించిన బాబా…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-67-1102-బాబా అని అనగానే బావిలో పడిన బాలుని 3:50

ఇలా లోకమున ప్రకటింపచేసి సాయిభక్తులమైన మనకు తనయందలి విశ్వాసమును పెంపొందింప చేసి మనము మేలు పొందునట్లగుటకు బాబా శ్రీ వేమూరి వెంకటేశ్వర్లుగారిని ఎన్నుకొనిరి.

వారిదే మరియొక అద్భుతలీల చూడుడు. ఇది 1957 లో జరిగిన సంఘటన.

“సెప్టెంబరు ఆరవ తేదీన సాయంత్రమున వెంకటేశ్వర్లుగారు శ్రీ సజ్ఞావెంకయ్య అను క్లయింటుతో కలసి తన ఇంటిలోని ఆఫీసు గదిలో కూర్చిండిరి.

ఆసమయమున వారి భార్య ఆదుర్దాగా వారి వద్దకు వచ్చి పిల్లవాడు బావిలో పడినాడని చెప్పినది. వినుటతోడనే ‘బాబా’ అనుచు లేచి వెంకయ్యతో కలసి పెరటిలో యున్న బావి వద్దకు వచ్చిరి వెంకటేశ్వర్లుగారు.

వీరచటికి చేరుసరికి బావిలో పడిన తన 15 ఏండ్ల మూడవ కుమారుడు బావి ఒడ్డున నిలచి యుండెను.

తల తడిసియుండి అయోమయ పరిస్థితిలో యుండెను. వెంకటేశ్వర్లు గారు ఆ బాలుని వీపు తట్టి నీవు బావిలో ఎలా పడితివి, బయటకెట్లొచ్చితివని అడిగిరి.

ఆకుర్రవాడు తేరుకుని తాను బావిలో పడినట్లు అతనికి అప్పుడు గుర్తుకువాచ్చి “నేను బావిలో పడగానే లోపలకు పోలేదు.

కొంత లోపలకు వెళ్ళగా ఇటుక రాయి ఒకటి నాకాలు క్రిందకు రాగా ఆరాతిపైన నేను నిలుచున్నాను.

ఇంతలో ఎవరో నన్ను ఇక్కడ ఒడ్డున దించారు” అని చెప్పాడు.

ఆ బావి వరలతో యున్నది. నీరు తోడుటకు గిలకలు లేవు. ఒడ్డుపైకెక్కి నీరుతోడుచు కాలుజారి ఆబాలుడు బావిలో పడినాడు.

బావిలో 8 అడుగుల నీరు యున్నది. ఆనీటి పై ఒడ్డు 5 అడుగుల ఎత్తు యున్నది.

బావిలో పడి పోయిన ఆ 8 అడుగుల నీటిలో మునిగి పోయి వుండెడివాడు. 5 అడుగుల ఎత్తు పైకి వరలుండుటచే అతనికి పైన అందదు కనుక పైకి రాలేడు.
నీటిపైకి రాయి తేలుటయేమి? ఆరాతిపై ఆబాలుకు కాలు పెట్టినను ఆ రాయి మునగక అట్లేనిలచి యుండుటయేమి?

ఎవరో ఎట్లు పైకి తెస్తారు? శ్రీసాయిబాబా కాక, తాడు, నిచ్చెన లేక పైనుండి మనుష్యుల సాయములేక పైకి ఎట్లురాగలడు?

బాబా అలనాడు మసీదు వెన్నుపట్టెకు చెక్కబళ్ళా కట్టినప్పుడు అంత ఎత్తుపై నిచ్చెన మొదలగునవి ఏమి లేక ఎట్లు ఎక్కగలిగిరి?

అట్లే సర్వాంతర్యామియైన బాబా బావిలో నుండి బయటకు ఆబాలుని తెచ్చి దించిరి. సందేహించవలసిన పనిలేదు.

ఇది అంతయు సాయి బాబా లీలయే. “మీరు ఆఫీసురూములో ‘బాబా’ అంటూ లేచారు. ఇచ్చట బాబా మీ అబ్బాయిని రక్షించారు” అని క్లయింటు సజ్జా వెంకయ్య అనిరి.

సాయి కంకల్పించిన సాధ్యము కానీ దేమి ఉండదు. నీటిపై ఇటుక తెలగలదు. ఎంతలోతునుండైన బయట సంకల్పమాత్రములో బాబా వారు బయట నిలబెట్టగలరు.

ఆశ్రయించిన భక్తునియేకాదు. వారిపై ఆధారపడిన వారినందరిని సాయి కాపాడగలరని వెంకటేశ్వర్లుగారనిరి.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల (డిసెంబర్. – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles