Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
వ్రజ భూమిలో బహులవన్ అనే గ్రామం ఉండేది. అక్కడ ఒక రాతి గోవు ఉండేది. దానిని భక్తులు పూజించేవారు.
ఒక ముస్లిం అధికారి వచ్చి, ఆ రాతి గోవును పూజించటానికి వీలులేదని, అది సజీవంగా ఉంటే తాను కూడా పూజిస్తానని పలికాడు.
భక్తులకు ఎం చేయాలో తెలియరాలేదు. అదే సమయాన అక్కడకు వల్లభాచార్యులవారు వచ్చారు. సంగతి తెలుసుకున్నారు.
పచ్చటి గడ్డిని దాని తోక దగ్గర పెట్టి, వేద మంత్రాలను చదివి, దానిపై నీరు చల్లారు. అది సజీవమై వెనకకు తిరిగి, పచ్చ గడ్డిని తింది. నివ్వెరపోయిన ఆ అధికారి, వల్లభాచార్యులకు నమస్కారం చేసాడు.
వల్లభాచార్యులు ఒక చిన్న పాత్రలో పాయసాన్ని తయారుచేసి, శ్రీకృష్ణునకు నివేదించాడు.
అదే సమయంలో ఒక వందమంది భక్తులతో ఒక సన్యాసి వచ్చాడు. అది భోజన సమయం. కాబట్టి ఆ అందరకు అతిధులకు పాయసాన్ని ఇవ్వాలి ప్రసాదంగా.
ఒకొక్క వ్యక్తికి ఒక డొప్ప ఇచ్చి దాని నిండా ప్రసాదాన్ని నింపి ఇవ్వసాగాడు. వారు 100కు పైగా ఉన్నారు. కడుపునిండా వారు తిన్నారు ఆ పాయసాన్ని. ఇంకా ప్రసాదం ఉంది పాత్రలో.
ఇదెలా సంభవమని ఆ వ్యక్తులు గుసగుసలాడుకోసాగారు వారిలో వారు. “ఇది ప్రసాద మహిమ. నిండు మనసుతో దైవ ప్రసాదాన్ని అర్పిస్తే, తరుగు ఉండదు. ఆకలిగొన్న వారికీ ఆహారం పెట్టాలి. అది ధర్మం. ఏ ఒక్కరు ఆకలితో గుమ్మం దాటరాదు” అని శ్రీవల్లభులు ఆ సమయంలో పలికారు.
సాయిబాబా జీవిత చరిత్రలో అనేక అట్టి ఉదంతాలు కనిపిస్తాయి.
శ్రీవల్లభాచార్యుల వారు ఒకసారి క్షిప్రా నదీ సమీపాన ఉన్న సాందీపని ఆశ్రమం చేరారు. సాందీపుడు బలరామ, కృష్ణుల గురువు.
ఆ ఆశ్రమంలో కనుచూపు మేరలో ఒక పచ్చని చెట్టే లేదు. ఎక్కడనుండో ఒక రావి ఆకు అయన పాదాలవద్ద పడ్డది. వెంటనే అక్కడ లోతుగా గుంట త్రవ్వి ఆ ఆకును పాతారు అయన.
అందరు చూస్తుండగానే ఆ ఆకు మొక్కయై, మహావృక్షమై శాఖోప శాఖలుగా విస్తరించింది.
శ్రీవల్లభులు తెలుగు వారు. అయన జననమే విచిత్రం.
ఆయనకు ఒకసారి కాదు, రెండుసార్లు శ్రీకృష్ణదేవరాయలు కనకాభిషేకం చేశాడు. ఎన్నో బహుమతులు, ధనరాశులు ఇచ్చాడు రాయలు.
శ్రీవల్లభులు తీసుకున్నారు. విద్యానగరం నుండి తెచ్చుకున్న బంగారు నాణెములతో నాథ్ ద్వారాలో వెలసిన గోవర్ధనునకు బంగారు మొలత్రాడు చేయించాడు.
పండరీ పురంలోని పాండురంగడు ఆజ్ఞాపించగా వివాహం చేసుకున్నాడు. శుద్దాద్వైతాన్ని ప్రతిపాదించారు. ఈయన జన్మదినం వైశాఖ (సామాన్యంగా మేలో వస్తుంది) బహుళ ఏకాదశి.
ఈయన అనేక రచనలో ఒకటి మధురాష్టకం. ఒక చరణమును స్మరించెదము గాక…
“అధరం మధురం వదనం మధురం, నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం, మధురాతిపతే రఖిలం మధురం…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- “తెలియగాలేరు, దైవ లీలలను”…. మహనీయులు – 2020… నవంబర్ 27
- “నిన్ను విడిచి నేను పోలేనులే” …..సాయి@366 మే 27…Audio
- జయ జగదీశ హరే! … మహనీయులు – 2020… జూలై 27
- శిక్ష తప్పదు …. మహనీయులు – 2020… మే 4
- చూపు కరువైన వారికైనా …. మహనీయులు – 2020… డిసెంబరు 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments