సర్వస్య శరణాగతి తో నమ్మిన భక్తునికి ప్రతి క్షణం నేనున్నాను అని రుజువు చేసిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా గ్రామంలో BCA కాలేజి ఒకటి కొత్తగా పెట్టారు. అందులో నలుగురు విద్యార్థులు ‘సాయి దీక్ష’ తీసుకున్నారు. దీక్షలో నియమ నిష్టలు పాటించాలి. అలా ఉండలేనప్పుడు తీసుకోకూడదు.

కానీ ఈ నలుగురిలో ముగ్గురు పిల్లలు వారి వారి వ్యసనాలను మానుకోలేక పుట్టినరోజు, పార్టీ అంటూ విందు, వినోదాలతో మద్యమాంసాలను తింటూ నియమాలను ఉల్లంఘించారు.

ఈ పార్టీ కి దూరంగా ఉన్న పిల్లవాడి పేరు నరేష్. అతని ఒంటి మీదకి బాబా వారు వచ్చారు.

“నీ స్నేహితులు విందూ వినోదాలతో ఉన్నారు, వాళ్ళని అక్కడనుండి తీసుకురమ్మనమని వేరే వాళ్ళని పంపించామని” చెప్పారుట.

పల్లెటూరు కాబట్టి ఎం జరిగినా ఊళ్ళో అందరికి ఇట్టే తెలిసిపోతుంది. బాబా నరేష్ ఒంటి మీదకి వచ్చాడని తెలిసి నేను ఆసక్తి తో అక్కడకి వెళ్లాను.

ఒకళ్ళిద్దరు కుర్రాళ్ళు పరుగున పోయి ఆ జల్సాలు చేస్తున్న కుర్రాళ్ళని పిలుచుకు వచ్చారు.

విషయం తెలుసుకున్న  వాళ్ళు ‘తప్పైపోయింది బాబా’ అని చెంపలు వేసుకున్నారు. “సరే స్నానం చేసి వచ్చి కూర్చోమన్నాడు” నరేష్.

ఇలా బాబా అతని ఒంటి మీదకి రావడం వరుసగా మూడు రోజులు కొనసాగింది.

ఈ వింత చూడడానికి ఊర్లో కొంత మంది వచ్చారు. ఆ నరేష్ కీ ఈ విషయం తెలియదు. ఏదో అయింది అని తెలుసు. కానీ ఏమైందో తెలియదు.

అతను ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. జనం ఆ రోజు వారి కష్టాలు చెప్పుకున్నారు.

అందులో ఒక భక్తురాలు తన పిల్లల వివాహం గురించి, తన వ్యాపారం గురించి ఎంతో బాధగా ఏడుస్తూ చెప్పుకుంది.

అందుకు బాబా (నరేష్) “రేపు మీ ఇంటికి బాబా భక్తుడు వస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు” అని చెప్పాడు.

బాబా భక్తుడు వస్తాడంటే స్వయంగా బాబా చెప్పాడు కాబట్టి, బాబాయే వారింటికి వస్తారని వాళ్ళు గుమ్మాలు ఊడ్చి, కళ్ళాపి చల్లి, చక్కగా ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచారు.

మర్నాడు ఉదయం నేను అటు వస్తూవుంటే వాళ్ళ ఇంటి ముందు ఒకాయన నిలబడి ఉండటం నేను చూసాను.

ఆయన్ని నేను దూరం నుండి చూస్తూనే నాకు వైబ్రేషన్స్ వచ్చాయి. ఆయన బాబానే బాబానే అంటున్నాను.

నాతో పాటు నా కూడా వస్తున్న మురళి అన్న పెద్దాయన ఉన్నాడు. నువ్వు ఎపుడు బాబా బాబా అంటుంటావుగా అందుకే ఎవర్ని చూసినా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు.

ఆ రోజు సాయంత్రం మళ్ళీ నరేష్ ని కలిసాము. అక్కడ మళ్ళీ 40 మంది దాకా ఉన్నారు. నిన్నటి భక్తురాలు కూడా అక్కడకి వచ్చింది.

బాబా (నరేష్) “మీ ఇంటికి భిక్షకు వస్తే, బిక్ష వేస్తే ఒకలాగా వేయకపోతే మరోలాగా ఉండేది. కానీ నువ్వు వేసావ్.

అందుకే నేను మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని అడిగాను. శివలింగం మీ ఇంట్లో ఉంటే మడి ఆచారం పూజలు అభిషేకాలు చేయాలి మీరేమి చేయలేదు. అందుకే మీకు కష్టాలు వస్తున్నాయి.

ఆ లింగాన్ని నేను తీసుకున్నాను కాబట్టి మీ కష్టాలన్నీ పోతాయి. నేను మీ ఇంటికి వచ్చినపుడు ఒకతను చూసాడు. అతను ఇక్కడే ఉన్నాడు”. అంటూ నరేష్ నన్ను చూపించాడు.

అంటే ఉదయం నేను చూసింది బాబానే. అవును నేను బాబానే చూసాను. ఆయన్ని చూసి కూడా వెళ్లి పోయినందుకు నేను చాలా బాధపడ్డాను.

అది రెండవ రోజు, కొంతమంది మళ్ళీ బాబాను ప్రశ్నలు వేశారు. కొంతమందికి జవాబులు చెప్పి, మిగతా వారికి రేపు సమాదానాలు చెబుతానని చెప్పి, నన్ను చూసి ఇస్మాయిల్ నా కోసం పూలు తెచ్చి అలంకరించు అన్నాడు.

ఎందుకంటే నేను బాబా గుడిలో బాబాకి అలంకారం చేసేవాడిని అది నచ్చింది కాబోలు ఆయనకి (బాబా) ఆలా అనేటప్పటికి నేను ఎంతో పొంగిపొయాను.

ఆ మర్నాడు ఉదయాన్నే తోటకి వెళ్లి రకరకాల పూలు తెచ్చి మాలలు కట్టి కొన్ని అలంకరించి సాయంత్రం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.

సాయంత్రం కాగానే, కృష్ణుడు పాదాలు వేసినట్టుగా పూలరెక్కలతో పాదాల ఆకారాలతో అలంకరించాను.

ఇంకా హిందుత్వానికి గుర్తుగా ‘ఓం’ ముస్లిం గుర్తుగా ‘అర్ధచంద్రుడు’ క్రైస్తవానికి గుర్తుగా ‘ శిలువ’ గుర్తులు పూలతో అలంకరించాను.

అప్పుడు బాబా (నరేష్) ముందుగా నన్నే పిలిచి ఒక కొబ్బరికాయ నా చేతిలో పెట్టి కొట్టమన్నాడు. నేను కొబ్బరికాయ కొట్టాను.

ఆ కొట్టిన చేతిని అలాగే పట్టుకుని బాబా (నరేష్) ఆ చేతిని తీసుకువెళ్లి అర్ధచంద్రాకారం గుర్తు వేసిన పూలరెక్కలపైన పెట్టించాడు.

ఆ తర్వాత రెండవ కొబ్బరికాయ ఒక 6 ఏళ్ల బాబు వాడి పేరు కిరణ్ చేత కొబ్బరికాయ కొట్టించి. ఆ కొబ్బరికాయను ఓంకారం మీద పెటించాడు.

‘అప్పుడు నేను బాబా ఇంతమంది ఉంటే ఈ పిల్లవాడ్ని మాత్రమే పిలిచి ఇలా కొబ్బరికాయ కొట్టించావు’ అని అడిగితే

“ఆ పిల్లవాడు వాళ్ళ మామయ్య నడిగి ఇక్కడ ఇంతమంది వస్తారు, అందరికీ తినడానికి ప్రసాదం ఏదైనా పెడదాం అని ఇంట్లో పోరి ఇక్కడ పంచడానికి వాడు అరటి గెల పట్టుకు వచ్చాడు.

అందుకే వాడి నిష్కల్మష భక్తికి నేను లొంగిపోయాను. అందుకే కొబ్బరికాయ వాడిచేత కొట్టించాను.” అన్నాడు.

ఆ తరువాత పిల్లవాడిని గురించి కనుక్కుంటే బాబా చెప్పింది నిజమే, మామయ్యా. అరటిగెల! పట్టుకుపోతా అందరికీ పంచుతా అంటూ కూర్చున్నాడట. వాడి పోరు పడలేక ‘పట్టుకుపోరా బాబు అన్నాడంట వాళ్ళ మామయ్య.

‘అందరూ కళ్ళు మూసుకోండి ఇక్కడ ఇస్మాయిల్ నా పాదాలు వేసాడు, దానిమీద నుండి నడచి నేను వెళ్లి పోతాను, ఒక వెలుగు వస్తుంది, ఎవరూ కళ్ళు తెరవద్దు తట్టుకోలేరు” అని చెప్పాడు.

బాబా (నరేష్) మానవులకి అనుమానం సంశయం రెండూ ఎక్కువేగా అందునా భగవంతుడి విషయంలో మరీ ఎక్కువ.

బాబా నడుస్తాడా అది గమనించాలి అని అనుకోని కళ్ళు  మాత్రం మూసుకొని నరేష్ కాళ్ళ దగ్గర కూర్చుని వాడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాను. ఆరు సార్లు కళ్ళు తెరవద్దు అని చెప్పాడు.

నా మీద వెలుగు పడ్డ కాంతి నాకు బాగా తెలిసింది, క్షణమాగి కళ్ళు తెరువమన్నాడు.

అడుగులుగా వేసిన పూలరెక్కలు చెల్లా చెదురు అయ్యాయి. ఎవరో గబగబా నడిచిన చప్పుడు క్షణంలో వినపడినట్లు అయింది.

ఎవరో ఆ అడుగులలో నడిచినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. తలుపు సందులోంచి కోటి సూర్యుల కాంతిని నేను కళ్ళు మూసుకునే నా మీద పడటం నేను గమనించాను.

10 – 05 – 2005 న నాపుట్టినరోజు, అందరూ పుట్టినరోజులకి బాబాకి పూజలు,అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు.

నాకు కూడా అలా చేపించుకుంటే బాగుండు అనిపించింది. కానీ అభిషేకానికి 11 రూపాయలు కావాలి, ఇంకా పాలు అవి కొనాలి, అవి కొనాలంటే డబ్బులు లేవు అనుకున్నాను.

ఇంక ఆసంగతి మర్చిపోయాను. ఒకరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళాను, ప్రతి నెలలోను ముప్పై రోజులపాటు ముప్పై మంది అభిషేకాలు చేయడానికి ముందే పేర్లు నమోదు చేసుకుంటారు.

ఆరోజు వారి ఇంటినుండి ప్రసాదాలు కూడా తెస్తారు. ఉదయం అభిషేకం చేసినవారే మిగతా మూడు హారతులు కూడా చేస్తారు. అది అక్కడి పద్ధతి.

నేను వెళ్లేసరికి ఆ రోజు నమోదు చేసుకున్న వారు రాలేదు. వారింటి నుండి ప్రసాదాలు వచ్చాయి. పూజారిగారు అన్నారు ‘వారు వస్తే అప్పుడు చూద్దాంలే ఇస్మాయిల్ నువ్వు అభిషేకం చేయి” అంటూ నన్ను పిలిచాడు.

సరేనని మొదలు పెట్టాను. అభిషేకం అయిపోయింది. ఆ రోజు రావలసిన వారు రాలేదు.

మధ్యాహ్నం హారతి కూడా నేనే ఇచ్చాను. సాయంత్రం హారతికి బయలు దేరుతుంటే నా స్నేహితుడు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నేను ఆశ్చర్యపోయాను.

అప్పటిదాకా ఆ రోజు నా పుట్టినరోజు అన్న విషయం గుర్తు లేదు. నేను నా పుట్టినరోజున అభిషేకం అంతా నేను చేయాలని, నా దగ్గర డబ్బులు లేవని అనుకున్నాను కదా, అందుకే బాబా నా కోరిక ఇలా నెరవేర్చాడు.

నాకు ముందే నా పుట్టిన రోజు గుర్తుంటే అహంకారం తొంగిచూసేది. అందుకే గుర్తు లేకుండా నా కోరిక నెరవేర్చాడు శ్రీ సాయి.

సర్వస్య శరణాగతి తో నమ్మినవారికి ప్రతి క్షణం నేనున్నాను అని రుజువు చేస్తూనే వున్నాడు.

ఇప్పటివరకూ మా భారాలన్ని తానూ భరిస్తూనే ఉన్నాడు. సాయిరాం అనగానే ‘గంధం’ సెంటు వాసనలు వస్తూనే ఉంటాయి. పిలవగానే దగ్గరే ఉన్నానని ఎన్నోసార్లు నిదర్శనాలు ఇచ్చారు.

శ్రద్ధ, సబూరి అనే రెండు లక్షణాలు అంటే ఏమిటో తెలియదు కాని నిరంతరం వారిని అర్చించాలి.

అంటే తాను నమ్మిన వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని, నాకు యోగ విద్యలో ప్రావిణ్యం ఇచ్చి నాకు యోగాయందు గురుస్థానం ఇచ్చినారు.

జమ ఖర్చులు వ్రాసుకుంటూ బ్రతికే నాకు గురువుగా స్థానాన్నిచ్చి యోగ విద్య కల్పించారు.

ఈ సాయి మందిరంలో సాయి లీలలు వ్రాసివ్వండి అని అడగటం కూడా ఒక లీల, ఎలాగంటే సాయి లీలలు 2002 సంవత్సరం నుండీ నా జీవితంలో జరిగాయి.

అవన్నీ నాతోనే అంతం కాకూడదని కొన్ని నేను డైరీలో వ్రాసుకొన్నాను. వాటిని ఈ రోజు బయట పెడుతున్నాను.

ఈ పుస్తకం వ్రాసిన వారి చేత నన్ను పలకరించి సాయి లీలలు ఉంటే వ్రాసి ఇవ్వండి అని సాయి మరొక లీల చూపించారు.

ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో సాయి చెంతన చేరాను. ఒక సారి సాయి చెంతన చేరిన గాలి పటం అవుతాము మనము. మనల్ని ఆడించే దారం సాయి చేతిలో ఉంటుంది. ఇంతకు మించిన భాగ్యం ఏమిటి చెప్పండి.

తన భక్తులు సప్త సముద్రాల అవతల ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టిలాగినట్లు తన చెంతకు చేర్చుకుంటాడు సాయి.

నీవు హృదయంలో సాయిని నిలుపుచాలు మన జీవితంలో సాయి ఉంటాడు.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు.

శుభం భవతు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles