Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
కూరగాయలు కొనేందుకు కూడా కొంత అవగాహన కావాలి జన్మ తరించేందుకు కూడా మనసుకు కొంత విచక్షణ మొదలవ్వాలి.
****
ఒరేయ్ , మార్కెట్టుకు వెళ్లి రెండురకాల కూరగాయలు తీసుకురా అని అమ్మ చేపితే , ఆ తెచ్చిన రెండురకాల్లో సగం పుచ్చినవి , కుళ్ళినవి వ్యర్ధమైపొయ్యేవే ఉంటాయి ..
కూరగాయలు కొనడానికి కూడా కాస్త అవగాహన , అనుభవం ఉండాలి ..
నాలుగుసార్లు అలా మార్కెట్టుకు వెళ్ళితేవడం అలవాటైతే , నాణ్యమైనవి ఎంపికచేసుకోడం , బేరసారాలు చేయడం వెన్నతో పెట్టిన విద్యలా అనుభవానికొస్తుంది ..
అవగాహన కుదిరేంతవరకు కొన్ని సందర్భాలు చేదు అనుభవాన్ని మిగిలిస్తుంటాయి.
కూరగాయలలాంటి అల్పవొస్తువులతో ఒక పూట నష్టపోయినా , మరుసటిరోజుకు అవగాహనకుదిరి , మళ్లీ నష్టపోకుండా అనుభవం కుదరవొచ్చు ..
ఏదో సందర్భంలో కూడబెట్టుకున్న సొత్తును నష్టపొయినా , తిరిగి ధనాన్ని సంపాదించుకొనే అవకాశం కలగవొచ్చు ,..
అవగాహన రాహిత్యం వలన కొన్ని సందర్భాలలో అతి తెలివి వ్యవహారాలవలన జీవితకాలంలో పూడ్చుకోలేని నష్టాన్ని భరిస్తూ , జన్మనే నష్టపోయేపరిస్థితి ఏర్పడవొచ్చు ..
ఒక పసివాడిని బడిలో చెర్చాలంటే , ఎక్కడ చదువు బాగాచెప్తారో అని నాలుగు విద్యాసంస్థలను విచారిస్తారు …
ఒక వివాహవ్యవస్థలో అటు , యిటూ వర్గాలు ఒకటికి నాలుగుసార్లు వాకబుచేసుకొని నిర్ణయానికొస్తారు ..
సద్గ్రంధాలలోని ప్రబోధాలు , సద్గురువుల వచనాలు కూడా అవగాహన కుదిరేంతవరకు భావం మనసుకు స్ఫురించడం కష్టం ..చదువు అదో కధలా సాగిపోతుంది ..
మనసు కలగబోయే ఫలితంకోసం ప్రతిక్షణం నిరీక్షిస్తూ ఉంటుంది …
జ్ఞానేశ్వరిని ఎలా పారాయణ చెయ్యాలో , బీవీ దేవుతో బాబా స్వయంగా చెప్పిన, సచ్చరిత్రలో మార్గాన్ని అనుసరిస్తే , ఆయన ప్రబోధాలలోని ఆంతర్యాలు అవగాహనకొస్తాయి … మనసును ఆలోచింపచేస్తాయి .. ఆ ఆలోచనే నిత్య స్మరణకు దారితీస్తుంది .. ఆ స్మరణే మరుసటి జన్మకు నిర్ణయం కాగలదని పెద్దలమాట …
సద్గురు పాదరజోంకి జయ్
**
కూరగాయల ఎంపికలో ఒకపూటనష్టం , మరుసటిరోజుకు అనుభవానికొస్తుంది .ఆధ్యాత్మికంలో సరిఅయిన అవగాహనలేకుంటే జీవితకాలం నష్టమే– ప్రకాశం
భార్యాభర్తల నడుమ ఏకాభిప్రాయంఉంటె ఆ ఇల్లే స్వర్గతుల్యం. ఆశ్రయించిన తత్వంమీద ఏకాగ్రతకుదిరితే ఆ జన్మే సాఫల్యం – ప్రకాశం
లాగించెంపమీద వొకటివేసినా దోషంకాకపోవొచ్చు ద్వేషంతో కడుపుమీదకొడితె వాడి సంసారమే వీధులపాలౌతుంది.ఎంతటివాడు ఆ ఉసురు అనుభవించకతప్పదు– ప్రకాశం
చదివింది చెప్పి లోకాన్ని ఆకర్షించవొచ్చు .. చెప్పేది ఆచరించక లోకేశ్వరుని మెప్పించలేము– ప్రకాశం
Latest Miracles:
- ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….Audio
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు
- పరీక్షలు – పొరపాట్లు …..సాయి@366 జూన్ 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments