నిస్సహాయురాలైన నా చేత ఎన్నో కార్యాలను జరిపించిన బాబావారు …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను మా ఇంటి దగ్గర బాబా గుడికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళుతుండడంతో అక్కడ అందరూ నాకు బాగానే పరిచయం అయ్యారు.

అక్కడ అందరమూ కూర్చొని విష్ణుసహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజలు అవీ చేసుకుంటూ ఉండే వాళ్ళం.

గురువారాలు అన్నదానాలు కూడా చేసేవాళ్ళము. అన్నదానానికి మేమే పదిమంది ఆడవాళ్ళము కలిసి వంటలు చేసేవాళ్ళము.

ఆ సమయంలో ఒక అబ్బాయి కూడా గుడికి వస్తూండేవాడు, వాడికి వయస్సు పది సంవత్సరాలు ఉంటాయి. మా పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు.

వాడికి చదువు మీద అసలు శ్రద్ధ లేదు. ఆటలంటే చాలా ఇష్టం, బాగా అల్లరి కూడా చేస్తుండేవాడు.

వాడికి తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళ అమ్మ నాతోటి అంటూ ఉండేది, కళమ్మా వాడసలు చెప్పిన మాట వినటం లేదు. చదువంటే అసలు పట్టించుకోవటం లేదు.

మా రెక్కల కష్టమే కదమ్మా వాడు చదువు కోకపోతే ఎలాగమ్మా అని అంటూ ఉండేది.

నేను ఒకరోజు గుడి నుండి ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఇంట్లో ఉన్నాడు. మా పిల్లలతో ఆడుతూ ఉన్నాడు. వాడి పేరు కార్తీక్.

నేను వాడిని పిలిచాను, నా దగ్గరికి వచ్చాడు. ”ఒరేయ్ నువ్వు చదుకోవా” అని అడిగాను. ”చదువుకుంటానమ్మా” అని అన్నాడు.

”ఊరికే అనడం కాదు నువ్వు చదువు కుంటే నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. కార్లు ఎక్కి తిరగవచ్చు. అదే చదువుకోలేదనుకో, నీతోటి ఎవరూ మాట్లాడరు. నిన్ను ఎవరూ మర్యాదగా చూడరు.

చదువు కుంటే నిన్ను మీ అమ్మ  నాన్న మెచ్చుకుంటారు. అందరికంటే బాబా నిన్ను మెచ్చుకుంటారు. అది చూసి మీ అమ్మ చాలా గర్వపడుతుంది.

చదువుకోవాలిరా. ఎవరి దాకా ఎందుకు, ఈరోజు ఈ పొజిషన్లో అన్నలు అక్కలు ఉన్నారంటే (మా పిల్లలు) వాళ్ళు బాగా చదువుకున్నారు. చెప్పిన మాట విన్నారు కాబట్టేరా. అందుకే బాగా చదువుకోవాలిరా కార్తీకు” అని చెప్పాను.

వాడికేమైందో ఏమో ఆ రోజు నుండి అల్లరి మానేసి బుద్దిగా స్కూలికి వెళ్లి చదువుకుంటున్నాడు.

ఇప్పుడు వాడు ఇంటర్ పాస్ అయ్యి పొలిసు ట్రైనింగ్ కి వెళ్తున్నాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. ”నీ వల్లే అమ్మా నేను ఈ రోజు మంచిగా అయ్యాను” అంటాడు. నన్ను అమ్మా అని పిలుస్తాడు.

ఏదైనా నాకే ముందు చెబుతాడు. వీడు నాకు పెంపుడు కొడుకు అంటారు అందరూ.

నాదేముంది, అంతా బాబా దయ. వాడికి ఆ రోజు నా చేత బాబా అలా చెప్పించాడు, విన్నాడు, బాగు పడ్డాడు. అంతా బాబా దయ.

వాడి పరీక్షలకి నేను బాబాకి పూజ చేసేదాన్ని. వాడు బాబాని నమ్ముతాడు, వాడు బాబా భక్తుడయినాడు.

ఒక సారి నేను గుడికి వెళ్ళినప్పుడు బాబాని పూజారి ఆ రోజు బాగా అలంకరించాడు.

అది చూసి నేను ఈ రోజు ”బాబా బావున్నాడు అబ్బా! ఎంత అందంగా ఉన్నాడు, ఒక్కసారి బాబా ని ముద్దు పెట్టుకుంటే బావుండునని” అనుకున్నాను.

 గురువారం రోజు, హారతి సమయంలో పూజారి గారు గద్దెనెక్కనివ్వరు. ముద్దు పెట్టుకోవడం ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుని నా పనిలో నేను మునిగిపోయాను.

ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ముసలాయన, పిల్లలు తల్లి భుజాల చుట్టూ మీదకి చేతులు వేసి ఎలా ఆడతారో అలా నా మెడ చుట్టూ చేతులు వేసి నా బుగ్గన చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు.

నేను బుగ్గ తుడుచుకుంటూ ”ఏంటి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటావు” అన్నాను చిరాకుగా.

”అసలు నువ్వు ఎవరు, నా భుజాల మీద ఎందుకు పడుతున్నావు” అన్నాను.

”నేను నీకు తెలుసు. నన్ను ముద్దు అడిగావు, అందుకే పెట్టాను” అన్నాడు.

”ముసలాడివి నిన్ను నేను ముద్దు అడగటం ఏంటి” అన్నాను.

”నువ్వు నన్ను అడిగావు, నాకేం తెలియదు, నువ్వు అడిగావు నేను పెట్టాను” అన్నాడు.

తెల్లవారింది. నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది, నేను ముందు రోజు బాబాని ముద్దు పెట్టుకోవాలని అనుకుంటే నాకు ఆయనే ముద్దు పెట్టాడు.

బాబా గుడికి అప్పట్లో ఒకావిడ వస్తుండేది. ఆవిడ గుర్రంగూడాలో ఉండేది. ఆవిడ పేరు దుర్గ.

ఆవిడకి భర్త పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒకతను ఈమెని రోజు ఇబ్బంది పెడుతున్నాడట.

ఈవిడ అతన్ని చూసి భయపడి పగలు రాత్రి కూడా ఇదే ఆలోచన చేస్తూ ఒకలాగా తయారయ్యింది.

రోజు గుడికి వస్తూండేది. ఆమె ఇంట్లో కూడా ఏ పని చెయ్యకుండా తయారయ్యింది. భర్త పిల్లలు ఈమెని పట్టించుకోవటం లేదంటుంది.

ఒకరోజు ఉదయం పూట గుడికి వెళ్లి కొంచెం ఇంట్లో పని ఉంటే ఇంట్లో ఉండిపోయాను, ఆ సమయంలో దుర్గ గుడికి వచ్చింది.

నా కోసం వెతికింది. నేను కనపడకపోయేసరికి మా ఇల్లు ఎక్కడ అని పూజారి గారిని అడిగిందట, పూజారి గారు మా ఇల్లు చూపించారు, ఇంటికి వచింది.

నన్ను పట్టుకొని ఏడుపు మొదలు పెట్టింది. మెల్లగా ఏడుపు ఆపించి, ఎందుకు ఏడుస్తున్నావు అని, అసలు నీ సమస్య ఏమిటని అడిగాను.

నన్ను ఇంట్లో ఎవరూ పట్టించు కోవటం లేదు. మా ఇంటి దగ్గర ఒకతను నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది. అది ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే మనిషి ఒకలాగా తయారయ్యింది.

నీకేమి కాదు, నువ్వు ముందు ఏడుపు ఆపుమని, ఎటూ పోవద్దు మా ఇంట్లోనే ఉండు అని నేను అన్నం పెట్టాను.

ఈ రాత్రికి ఇక్కడే ఉండు అన్నాను. తినిపడుకుంది. అలాగే నాలుగు రోజులు ఉంది.

నాకు తెలిసిన వారంతా ఆ అమ్మాయిని అనవసరంగా ఇంట్లో పెట్టుకున్నావు, ఆమెకి పిచ్చి ఉంది, లేనిపోని ప్రమాదం ఎందుకు కొని తెచుకుంటావు అన్నారు.

ఆమె మా ఇంటికి వచ్చింది, నా ఆశ్రయం కోరింది. బాబా నన్ను ఆమెకి చూపించాడు. నేను ఆమెకి ఏమైనా చేయాలి అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను. ఆరోజే వాళ్ళ వాళ్ళకి కబురుచేశాను.

మా స్నేహితురాలు లక్ష్మి గారు వున్నారు కదా, ఆమెతో నేను సంప్రదించి ఎలాగయినా ఈమెని బాగుచేయాలి. ఏం చేద్దాము అన్నాను.

ఆమె వెంటనే dilshukhnagar ఒక డాక్టర్ ఉన్నారు ఆమెకి చూపిద్దాం అంది. అంతే , వెంటనే దుర్గ, నేను, లక్ష్మి గారు వాళ్ళ వాళ్ళు అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము.

డాక్టర్ గారు దుర్గని పరీక్ష చేసి ఏవో మందులు రాసిచ్చారు. అవీ వాడింది , కొన్నాళ్ళకి ఆమె మామూలు మనిషి అయ్యింది .

ఆమె నన్ను ఒకటే పొగుడుతుంది. ఆ రోజు నిన్ను అందరూ మాటలు అంటున్నా గాని నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో ఆశ్రయం కల్పించావు.

అలాగే కనుక నువ్వు చేసి ఉండక పోతే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు కళా అంటుంది.

”నాదేం లేదు దుర్గ, ఆ రోజు నా దగ్గరికి బాబా నిన్ను పంపించాడు అంటే నేను నీకు ఏదైనా చేయగలనని అనుకోని పంపించి ఉంటారు.

నాకు ఆ సమయంలో అలా తోచింది, బాబా నాకు ఎలా ప్రేరణ ఇస్తే అలా చేసాను, అంతే తప్ప నాదేం లేదు” అన్నాను.

మా పెళ్లి నాటికి 7th క్లాస్ చదివాను. ఆ తర్వాత నేను 10th క్లాస్ చదివాను. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను.

నాకు ఇంగ్లీష్ కూడా ”బాబా” నేర్పించాడు. అప్పుడంటే చదువు లేదు ధైర్యం లేదు, ఇప్పుడు చదువు ఉంది. బాబా దయతో ధైర్యం కూడా ఉంది.

ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను అంటే మా పిల్లలు నువ్వు కష్టపడింది చాలు. ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు హాయిగా బాబా సేవ చేసుకోమ్మా! అంటారు.

నేను ఒకసారి యాత్రలకి అని వెళ్లి మధ్యలో తిరుపతి కూడా వెళ్ళాను. అక్కడ నాకో కల వచ్చింది. ఆ కలలో నాకు ఒక ఫోటో కనపడింది. అది ”బాబా” ఫోటోనే.

కింద బాబా పైన ఈశ్వరుడు ఉన్న ఫోటో. అలాంటి ఫోటోనే మరునాడు నాకు ఒక షాప్ లో కనపడింది. అంతే వెంటనే దాన్ని కొనుక్కున్నాను. హైదరాబాద్ వచ్చాక మా పూజా మందిరంలో పెట్టాను.

మా పిల్ల పెళ్లి మండపంలో ఆ ఫోటోని పెట్టాను. అందరూ ఫకీరు ఫోటో మండపంలో ఎలా పెడతారు అని అనుకున్నారు.

నాకు ”బాబా” అంటే ఇష్టం. బాబాయే నాకు ముఖ్యం, ఆయన లేకుండా మేము లేము అన్నాము. నేను ఎవరి మాటలు లెక్క చెయ్యలేదు.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles