భక్తుని పిలుపు విన్న బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

భక్తుని పిలుపు విన్న బాబా

ఈ రోజు సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఒక బాబా లీలని తెలుసుకుందాము. ఇది ఒక భక్తుని పిలుపుకు వెంటనే స్పందించిన బాబా అద్భుతమైన లీల. ఇందులో భర్త తన భార్యకు మరణమే శరణ్యం అని బాబాని వేడుకున్న పరిస్థితిలో బాబా స్పందించి, పక్షవాతాన్ని వెనువెంటనే తగ్గించిన లీల అద్వితీయం, అపూర్వం.

కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య నా పెద్ద కుమారుని తో కొద్ది రోజులు వుండటానికి జనక్ పురి వెళ్ళింది. ఒక రోజు పొద్దున్నే వాడి నుంచి అమ్మకి చాలా సీరియస్ గా ఉందని, డా.సుధీర్ వర్మతో వెంటనే రమ్మని ఫోన్ కాల్ వచ్చింది.

నేను, మా చిన్న అబ్బాయి, డా.సుధీర్ వర్మతో కలిసి జనక్ పురి వెళ్ళాము. డా.వర్మ పరీక్షించి, నా భార్యకు పక్షవాతం వచ్చిందని, ఆమె కుడివైపు భాగమంతా చచ్చు పడిపోయిందని, ఆమెకు మాట కూడా పడిపోతుందని చెప్పారు.

ఆమె ఇక జీవితాంతము అంగ వైకల్యంతో మంచినీళ్ళకి కూడా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ ఉండాల్సిందేనని తలచుకునేటప్పటికి నేను షాక్ కి గురయ్యాను. ఇక నిరాశతో, అటువంటి పరిస్థితిలో ఆమె చనిపోవడమే మంచిదని నేను బాబాని ప్రార్థించి మనవి చేసుకున్నాను. ఎంతో అంకితభావంతోను, ప్రేమతోను కుటుంబానికెంతో సేవ చేసిన తనని ఆ స్థితిలో నేను చూడలేననిపించింది. 

తరువాత రాజా గార్డెన్ దగ్గరున్న నర్సింగ్ హోం లో చేర్పించడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసి, ఆమెని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు, మా అబ్బాయి నవ్వుతూ నన్ను పైకి రమ్మన్నాడు. వాడి నవ్వు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కాని నేను నా భార్య బెడ్ వద్దకి వెళ్ళాక, ఇంకా ఆశ్చర్యం వేసింది. నా భార్య అసలు యేమీ జరగనట్టుగా, చక్కగా ఆరోగ్యంగా లక్షణంగా ఉంది. 

మేము టాక్సీ మాట్లాడుకుని నర్సింగ్ హోం దగ్గిరకి వెళ్ళేటప్పటికి డా.వర్మ గేట్ వద్ద చక్రాల కుర్చీతోను, ఆస్పత్రి స్టాఫ్ తోను నా భార్యని లోపలికి తీసుకునివెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా ఆవిడ టాక్సీ దిగేటప్పటికి,  డా.వర్మ గారు “మిస్టర్.కపూర్, ఏమిటి నేను చూస్తున్నది?” అన్నారు.

“డాక్టర్, మీకే బాగా తెలుసు, మెడికల్ సైన్స్” అని నేను సమాధానమిచ్చాను. డాక్టర్, “కాదు, అది మెడికల్ సైన్స్ కాదు, మీ పిలుపు మీ గురు సాయికి చేరింది, ఆయన నయం చేశారు. అనుమానం లేదు, సాయి మిమ్మల్ని అనుగ్రహించారు” అన్నారు.

ఎస్.కే.కపూర్,
అంబికా విహార్,

న్యూఢిల్లీ

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles