Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
జానకి బాయ్ ఎంగిల్ 1905 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బాబాకు భక్తులు. ఆమె తల్లిదండ్రులు ఆమెను 1912వ సంవత్సరం లో షిరిడీ తీర్థయాత్రకు తీసుకువెళ్ళారు. ఆమె ఆరు సంవత్సరాల వయస్సులో షిర్డిని మొదటిసారి సందర్శించారు.
వారు ద్వారకామయికి వెళ్లి బాబాని దర్శించుకున్నారు. ఆమె తల్లి ముందుకు వంగి బాబా పాదములుకు నమస్కరించుకుంది. కానీ జానకి భయపడి దూరంగా ఉండిపోయింది. ఆమె బాబా సమీపంలోకి వెళ్ళడానికి భయపడి భయముతో నిలుచుంది.
జానకి బాయ్ ఎంగ్లీ ని ఆమె తల్లి భయపడ్డవా? అని అడిగారు. అప్పుడు జానకి బాయి నవ్వింది. ఆమె తల్లి ఆమె చేతిని పట్టుకొని బాబా పాదాల వద్దకు ఆమెను విసిరివేసింది.
బాబా ప్రేమగా ఆమెను పైకి లేవదీసి, ఆమెను వెన్ను తట్టి, .మృదువుగా ఆమెతో “జా బీటా రామ్ మాయి హో జావో” “వెళ్ళు, రాముని లో మునిగిపో” అని అన్నారు.
1912వ సంవత్సరంలో బాబా తనని ఆశిర్వాదించిన దానికి అర్థం తరువాత కాలంలో ఆమె తెలుసుకుంది. 88 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఎవరి సహాయం లేకుండా నిరాటంకంగా నడుస్తూ, ధృడమైన శరీరాకృతిని కలిగి ఉండేది. ఆమె ఆనందంతో కీర్తనలు మరియు నాట్యం చేస్తూ అంతటా భక్తిని వ్యాప్తి చేసింది.
ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమె తల్లి ఘోరమైన అనారోగ్యంతో మంచం పట్టింది. అట్టి స్తితిలో ఆమె తన కుమార్తెని తలచుకుంటూ ఉండేది. “బాబా నా కుమార్తెని ఇంటికి వచ్చేలా చేయండి” అని బాబాకు ప్రార్థన చేసింది.
జానకి బాయి కి ఒక కల వచ్చింది, ఆ కలలో బాబా ఆమెతో “ఆమె తల్లిని మర్చిపోవద్దు, వెళ్లి ఆమెను చూసిరా” అని చెప్పారు. ఆమె అత్తగారు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు.
అయినప్పటికీ బాబా తనతో ఉన్నారన్న ధైర్యంతో ఆమె తన సంచులు సర్దుకొని తన తల్లిని చూడానికి వెళ్లారు. ఆమె తన తల్లి వద్ద రెండు నుండి మూడు రోజుల పాటు ఉండి, అత్తగారి ఇంటికి తిరిగి వచ్చారు. అత్తగారి మాట వినకుండా వెళ్ళినప్పటికీ బాబా దయవలన ఏ పెద్ద పరిణామాలను ఎదుర్కోలేదు.
బాబాను నమ్ముకున్న వారికీ ఏ కష్టములు ఉండవు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సరిలేరు మీ కెవ్వరు…. …. మహనీయులు – 2020… ఆగస్టు 23
- తీరని కోర్కెలు ….. సాయి @366 ఫిబ్రవరి 9….Audio
- బాలకృష్ణా! నిన్ను నే చేరి కోలతు…. మహనీయులు – 2020… జూలై 8
- మనసు నిండా భక్తి ….. సాయి@366 మార్చి 4….Audio
- బొంబాయి స్త్రీ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments