జీవిత చరిత్రలు చదవటం జీవితాలను మారుస్తాయా? మధుమోహన్ తనతో “శ్రీకమలాంబికా దివ్య చరితము”ను తీసుకువెళ్లాడు మద్రాసు నుండి చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణమయ్యాడు. ఆ పెట్టెలో ముస్లింలందరూ నమాజు చేసుకుంటున్నారు. నేను కూడా దైవ చింతన చేసినట్లుంటుందని, ఆ జీవిత చరిత్రలో ఏ పేజీ వస్తే ఆ పేజీ చదవాలని ఒక పేజీ తెరిచాడు. Read more…
Category: Mahaneeyulu – 2020
సాయిబాబా “అక్కడ (బీడ్) నాకు జరీ పని అంటే బంగారు, వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా విరామం తీసుకోకుండా పని చేశాను” అన్నాడు. ఇంకా, మహారాష్ట్రలో జిప్రు అన్నా అని పిలవబడే ఒక మహనీయుడు కూడా అదే పని చేసేవాడు. జలగంలోని నసీరాబాద్ ల మీరారాం, కాశీబాయి (సావిత్రీబాయి) దంపతులకు Read more…
తుడిమెళ్ల నారాయణమ్మ గారు ఎవరు? ఆమె తల్లిదండ్రులకు బిడ్డ, సామాన్య గృహిణి, చిన్న తనంలోనే భర్తను కోల్పోయిన దీనురాలు, కానీ ఆమె జీవితము ప్రాపంచిక, ఆధ్యాత్మిక మార్గాల సమన్వయంతో తీరు తెన్నులు దిద్దుకుంది. ఒక మహనీయుని లేదా మహనీయురాలి జీవితములో కుటుంబమే ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాలను తెలుపుతుంది. అయితే వాటిని గ్రహించగల శక్తి ఆ వ్యక్తికి Read more…
“నా కోసం మీరు కంచికి ఇంత దూరం రావలసిన పనిలేదు. చందోలులో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారున్నారు కదా, ప్రతి గురువారం వారిని దర్శించండి” అని కంచి కామకోటి పరమాచార్యుల వారు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారనేవారు. అఖిల భారత సాయి భక్త సమ్మేళనం నెల్లూరు పట్టణంలో 7, 8, 9 Read more…
వినోబాభావే సూరదాసును సంగీత మహా సాగరం అంటారు. రామ సామ్రాజ్యాన్ని తులసీదాసు ఏలినట్లు, కృష్ణ – బాలకృష్ణ మథుర ప్రేమను సూరదాసు నేటికి ఏలుతున్నాడు. కొందరు ఆయనను పుట్టు గుడ్డి అంటారు, మరి కొందరు కాదంటారు. అయన ఆగ్రా, మథురల మధ్య నున్న (గౌఘాట్), గడ్ ఘట్ (Gad Ghat) లో నివసించారు కొంత కాలం. Read more…
ఈశ్వరమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి గారి మనుమరాలు. ఈమె అఖండ బ్రహ్మవాదిని. ఈమె తన తాతగారి వలె, గద్య, పద్య, గేయ, వచనాత్మకాలైన తత్వ సాహిత్యాన్ని రచించింది. అవి జనరంజకమైనాయి. ఈమె తాతగారి వలె అనేక మహిమలను కూడా చూపింది. పెద్దారి గట్ల గ్రామంలో కొందరు ఈమె మహత్యాన్ని పరీక్షింపదలచి దిగ్బంధన యంత్రం ప్రతిష్టించి, దానిపైన ఆమె కూర్చుండి Read more…
మెడికల్ కాలేజీలో బయో కెమిస్ట్ గా పనిచేసే శ్రీరామస్వామిని, పరిశోధనలకై విదేశాలకు పంపటానికి ఎంపిక చేసింది ప్రభుత్వం. ఆయన రమణుల భక్తుడు. ప్రభుత్వం గతంలో ఎంపిక చేసిన రామస్వామిని కాకుండా, వేరొక వ్యక్తిని పంపింది విదేశాలకు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. రాజీనామా పత్రాన్ని సమర్పించి, రమణుల వద్దకు వెళ్లాడు. అంకిత భక్తుడైనాడు. తాను పాండిచేరిలో మరో Read more…
తమ మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ప్రతి మతంలోనూ ఉండే విషయమే, కానీ,మతం మారి, వేరొక మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ఒక విశేషమైనదిగా భావించవచ్చును. అటువంటి వారిలో మచిలీపట్నానికి చెందిన ఫరీద్ మస్తాన్ ఒకరు. ఒకప్పటి అప్పలస్వామి ఫరీద్ మస్తాన్ అయ్యాడు. ఇటువంటి వారికి గురువుపై అమిత విశ్వాసముంటుంది. అప్పలస్వామి ఒకసారి ఖాదర్ వలీ గారి Read more…
సాయిబాబా పరీక్షలు పెట్టేవాడు. చాలాసార్లు అవి పరీక్షలని ఎవరికి తెలియదు. లద్దగిరి పొలిమేరలలో డిసెంబర్ 5, 1893న మహాసమాధి చెందిన రామదాసు స్వామి కూడా అంతే. ఒకసారి స్వామి వద్దకు కర్నూలు నుండి సుబ్బారావు గారు వెళ్ళినాడు. అయితే సుబ్బారావు అక్కడకు చేరే ముందే స్వామి విస విస నడచి కొండ వైపు వెళ్లిపోయారు. సుబ్బారావు వచ్చి Read more…
సాయిబాబా “ఈ భగవానుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచినప్పుడు, నా వంటి ఫకీరనగా దానికి ఎంతమాత్రము?” అంటారు. ఆళ్వార్లలో ఒకడు తొండరడిప్పొడి ఆళ్వారు. ఈయననే “భక్తంఘ్రి రేణు’ అని ‘మందంగుడి ముని’ అనియే కాక ‘విప్రనాయణుడు’ అని పిలుస్తారు. ఈయనను విష్ణువు యొక్క వన మూలాంశ అంటారు. బాల్యం నుండి విష్ణు భక్తి Read more…
సాయిబాబా వలె ఎక్కడో జన్మించి, చివరకు షిరిడీలో స్థిరపడినట్లు శ్రీహనుమత్ కాళీప్రసాద బాబూజీగా పేరు గాంచిన ఈ మహనీయుడు నంబూరులో స్థిరపడ్డారు. డిసెంబర్ 3, 1988లో దేహ త్యాగం చేసారు. అనేక ప్రదేశాలను పర్యటించారు. ఒక వసతి గృహంలో ఆసీనులై ఉండగా, 5, 6 ఏండ్ల బాలుడు ఒక పెద్ద కోటి వచ్చి కూర్చుందని, లోనికి Read more…
సాయిబాబా దగ్గరకు నానా సాహెబ్ చందోర్కరు అనే భక్తుడు తనకు సాయి సాయం చేయలేదని మూతి బిగించుకుని కూర్చున్నాడు. సుబోధానందుడు తల్లిదండ్రులకు తెలియకుండా తన దైవమైన రామకృష్ణులను సందర్శించుకునే వాడు. ఒకసారి సుబోధానందుడు రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తనను చూచే వారెవరూ లేరు. ఒక రాత్రి నీటి కుండ వద్దకు దాహం తీర్చుకుందామని పోతుంటే, Read more…
నారాయణ భట్టాద్రికి పక్షవాతం వచ్చింది. ఆ వ్యాధి రాలేదు, ఆయన కోరి తెచ్చుకున్నారు. భట్టాద్రి గురువు అచ్యుత పిషారటి. ఆ గురువుకు సంభవించిన వ్యాధిని తనపై తీసుకుంటానన్నాడు నారాయణ భట్టాద్రి. గురువు అంగీకరించలేదు. చివరకు నారాయణ భట్టాద్రి దీనాతి దీనంగా ప్రాధేయ పడటం వలన, గురువు “సరే” అన్నాడు. ఆ వ్యాధి పిషారటి గురువు నుండి Read more…
అప్పటి వరకు ఎక్కడా బాబాజీ మందిరం విగ్రహ ప్రతిష్ట జరుగలేదు. బాబాజీ మందిరం ద్వారాహాట్ దేవపురిలో ఉంది. బాబాజీ క్రియా యోగి. క్రియా యోగం అంటే తనను తాను తెలుసుకోవటం, తనలోనికి తాను ప్రయాణించటం. శరీరాన్ని, మనసును, బుద్దిని సమన్వయపరచి వ్యక్తిని శక్తిగా చేసేదే అది. దానిని ప్రాణ విద్య, ఆత్మ విద్య అని కూడా అంటారు. Read more…
హజ్రత్ క్వాజాబాకీబిల్లా దైవ భక్తి గల కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదవ ఏటనే దివ్య ఖురాన్ కంఠస్తమైంది. కుమారుని తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవేదనను చూస్తున్న మాతృమూర్తి, తన కుమారుని ఆధ్యాత్మిక దప్పికను తీర్చమని ప్రార్ధించేది. తల్లి అంటే ఈమె. ఒకనాడు అతనికి హజ్రత్ క్వాజాబహాఉద్దీన్ నక్సబంది దర్శనం అయింది. అతడు ఆనందంతో పులకరించిపోయాడు. ఇండియాకు వెళ్లి ఆ Read more…
“ఎచట నుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు” అని వ్రాసారు సుందరకాండలో శ్రీ ఎం.యస్. రామారావు గారు. తెలుగు నేలను రామ భక్తితో పునీతం చేసింది త్యాగయ్య, గోపరాజు, బమ్మెర పోతరాజు మాత్రమే కాదు. పెమ్మరాజు విశ్వేశ్వర రావుగారు కూడా రామ భక్తి సామ్రాజ్యంలో పాలుపంచుకున్న పుణ్యాత్ముడు. చూలాలు పల్లాలమ్మ అడవికొలను గ్రామంలో Read more…
కుతుబ్ మీనార్ పేరు వినని వారుండరు. క్వాజాకుతుబుద్దీన్ భక్తియార్ కాకి పేరిట అప్పటి ఢిల్లీ సుల్తాను నిర్మించిన కట్టడం అది. సుల్తాన్ ఆ సూఫీ యోగిపై పూర్తి విశ్వాసంతో ఉండేవాడు. కానీ ఆ చిస్తీ సాంప్రదాయ యోగి అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు. ఈయన తనకున్న సంపదను అందరకూ పంచేవాడు. అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఏమి Read more…
శ్రీధర వేంకటేశ, సదాశివ బ్రహ్మేంద్రుల సహాధ్యాయి. ఆయన ఒకసారి మంటపంలో తులా పురాణం చెబుతున్నారు. అది వారం రోజుల పాటు సాగింది. చివరి దినాన ఆయన, అక్కడ ఉన్న ఇతరులకు తనతో ఆ మంటపం బైటకు రమ్మన్నారు. అందరూ బయటకు వచ్చారు. ఆ మంటపం కూలిపోయింది. సాయిబాబా “ఆగు” అని ద్వారకామాయి (మసీదు) కప్పుకేసి చూశారు. Read more…
Recent Comments